రైలు మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? 1 కిలోమీటరు నడవడం కోసం అన్ని లీటర్ల డీజిల్‌ అవసరమా?

ఎవరైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ముందు ఎంక్వైరీ చేసేదీ మైలేజీ. ముఖ్యంగా కారు, బైక్ కొనేటప్పుడు దీనిని ఒక ప్రధాన అంశంగా మనం పరిగణిస్త‌ాము. వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేయండ ద్వారా మైలేజీపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాం. అయితే బస్సు, లారీ, విమానం లేదా రైలు మైలేజీ ఎంత అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? దేశంలో చౌకైన ప్రయాణ రైలు మార్గం ఒకటిగా ఉంది. ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అయితే రైలు మైలేజీ ఎంత ఇస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.

ఒక కిలోమీటరు నడిచే రైలుకు ఎంత డీజిల్ అవసరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలావరకు రైళ్లు ప్రస్తుతం విద్యుత్ శక్తితో నడుస్తున్నాయి. అయితే భారతీయ రైల్వే పరిధిలో వివిధ రకాల లోకోమోటివ్స్‌ ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఇవి అన్ని డీజిల్‌తో నడుస్తాయి. రైళ్ల మైలేజీ చాలా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే భారీ బరువుని లాగేందుకు ఆ మాత్రం ఫ్యూయల్‌ అవసరం పడుతుంది.

Diesel Trains Mileage Calculation

ఈ రైళ్లు వాటి వర్గీకరణ ఆధారంగా వేర్వేరు మైలేజీని అందిస్తాయి. ముఖ్యంగా రైలు మైలేజీ దాని బరువు, పవర్‌, ప్రయాణించే దూరం వంటి అంశాలను కూడా ఇందులో అంశాలుగా ఉంటాయి. ఉదాహరణకు 12 బోగీలున్న ప్యాసింజర్ రైలు కిలోమీటరు నడవాలంటే 6 లీటర్ల ఇంధనం అవసరం. అదేవిధంగా, 24 బోగీలు ఉన్న సూపర్ ఫాస్ట్ రైలు కూడా 1 కి.మీ మైలేజీ ఇవ్వాలంటే 6 లీటర్ల డీజిల్ అవసరం.

12 బోగీలున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపడానికి కిలోమీటరుకు 4.5 లీటర్ల ఇంధనం మాత్రమే అవసరం అవుతుంది. ప్రస్తుతం భారతీయ రైల్వేలో ఏ రైలు కూడా లీటర్ డీజిల్‌కి 1 కిలోమీటర్ మైలేజీ కూడా ఇవ్వడం లేదు. రైలులోని బోగీలు లేదా కంపార్ట్‌మెంట్ల సంఖ్య ఆధారంగా మైలేజీ ఇస్తుందని గుర్తుంచుకోండి.

Diesel Trains Mileage Calculation

తక్కువ కంపార్ట్‌మెంట్లు ఉన్న రైళ్ల ఇంజిన్‌ని లాగేందుకు తక్కువ శక్తి అవసరం పడుతుంది. ఇది తక్కువ ఇంధన వినియోగానికి దారితీస్తుంది. కాబట్టి మైలేజీ ఎక్కువ ఇస్తుంది. అంతేకాక, కార్లు, బైక్స్‌ మాదిరిగా, రైలు ఇంధన సామర్థ్యం కూడా దాని రకంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఎక్స్‌ప్రెస్‌ లేదా సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల కంటే ప్యాసింజర్ రైళ్లు ఎక్కువ ఫ్యూయల్‌ని వినియోగిస్తాయి.

ప్యాసింజర్ రైళ్లు తమ రూట్లలో ఎక్కువ స్టాప్స్‌ కలిగి ఉన్నందున తరచుగా ఆగాల్సి ఉంటుంది. అందువల్ల, ఇంధన సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. తరచుగా ఆపాల్సిన అవసరం లోకోమోటివ్ అధిక వేగంలో వెళ్లకుండా నిలువరిస్తుంది. దీంతో యాక్సిలరేటర్స్‌, బ్రేకుల వాడకం పెరుగుతుంది. ఫలితంగా ఇంధన వినియోగం పెరిగి, మైలేజీ తగ్గుంతుంది.

అయితే తక్కువ స్టాప్‌లతో కూడిన ఎక్స్ ప్రెస్ రైళ్లు అధిక మైలేజీని ఇస్తాయి. ఎందుకంటే అవి చాలాసేపు ఒకే రకమైన వేగాన్ని కొనసాగించగలవు. అంటే మన కార్లు, మోటారు సైకిళ్లు నగరంలో, హైవేపై ఇచ్చే ఇంధన సామర్థ్యంలో అదే వ్యత్యాసం రైలు విషయంలోనూ జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. రైలు రకం, బోగీల సంఖ్య ఇతర అవసరాలు వంటి అంశాలపై ఆధారపడి భారతీయ రైల్వే వ్యవస్థలో రైళ్ల మైలేజీ మారుతుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, September 14, 2024, 9:18 [IST]
English summary
Diesel trains mileage calculation full details in telugu
Read more on: #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+