వివిధ రంగుల్లో ఉండే నెంబర్ ప్లేట్లు దేనిని సూచిస్తాయో తెలుసా?

By N Kumar

రోడ్డు మీద వెళుతున్నపుడు మనం కేవలం ఒక రంగులో ఉన్న నెంబర్ ప్లేట్లను కాకుండా రకరకాల రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్లు గల వాహనాలను గమనిస్తుంటాం. అందులో పసుపు, ఎరుపు, తెలుపు వంటి రంగుల్లో ఎక్కువగా కనబడుతుంటాయి. కొన్ని కార్ల మీద అయితే లేత నీలం రంగులో ఉన్న నెంబర్ ప్లేట్లు కూడా ఉంటాయి. అయితే వివిధ రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్లను ఎందుకు వినియోగిస్తున్నారు అనే సందేహం ఇప్పటికే మీకు మొదలై ఉండవచ్చు. అందుకోసం క్రింది కథనంలో వివిధ రకాల రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్లు మరియు వాటికి చెందిన వివరణలను అందిస్తున్నాము.

తెలుపు రంగు నెంబర్ ప్లేట్

తెలుపు రంగు నెంబర్ ప్లేట్

తెలుపు రంగు ప్లేటు మీద నలుపు రంగులో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే, దీని అర్థం వీటిని కేవలం వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే వినియోగించాలి ఎటువంటి ఇతర వ్యాపార మరియు అద్దెల కోస వినియోగించకూడదు.

Picture Credit: Kienthuc

 పసుపు రంగు నెంబర్ ప్లేట్

పసుపు రంగు నెంబర్ ప్లేట్

పసుపు రంగులో ఉన్న నెంబర్ ప్లేటు మీద నలుపు రంగులో వాహన రిజిస్ట్రేన్ నెంబర్ ఉంటే ఈ వాహనాలను అద్దె మరియు వ్యాపార అవసరలాకు వినియోగిస్తారు. ఇందులో ట్యాక్సీలు, క్యాబ్‌లు మరియు ట్రక్కులు ఉంటాయి. ఇటువంటి వాహనాలకు డ్రైవింగ్ పర్మిట్ కూడా ఉండాల్సి ఉంటుంది.

Picture Credit: Quora

నలుపు రంగు నెంబర్ ప్లేట్

నలుపు రంగు నెంబర్ ప్లేట్

నలుపు రంగు ప్లేటు మీద పసుపు రంగులో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్లయితే ఇటువంటి వాహనాలను వ్యక్తిగతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లే అద్దె వాహనాలు అంటారు. మార్కెట్లో దీనికి కమర్షియల్ యుటిలిటి వెహికల్ అనే పేరు కూడా ఉంది.

Picture Credit: Quora

ఎరుపు రంగు ప్లేటు

ఎరుపు రంగు ప్లేటు

రాష్ట్రపతి మరియు వివిధ రకాల రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గవర్నర్లు మరియు ఇతర ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు ఇటువంటి కార్లలో ప్రయాణిస్తారు. దీనికి ముందు వైపు ఉన్న ఎరుపు రంగు ప్లేట్ మీద బంగారు వర్ణంలో ఉన్న జాతీయ చిహ్నాన్ని ముద్రించి ఉంటారు.

Picture Credit: Niuche

తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్

తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్

తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఎరుపు లేదా తెలుపు రంగులో ఉండి మరియు వాటి మీద అక్షరాలు తెలుపు రంగులో ఉంటాయి. ముఖ్యంగా తాత్కాలికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆంగ్ల అక్షరం టిఆర్ తో ప్రారంభం అవుతుంది. వీటి తత్కాలిక పరిమితి కేవలం నెల రోజులు మాత్రమే. చాలా వరకు డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ మీద వాహనాలు అమ్మడానికి నిరాకరిస్తున్నారు. కేవలం శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే అమ్ముతున్నారు.

మిలిటరీ వాహనాల నెంబర్ ప్లేటు

మిలిటరీ వాహనాల నెంబర్ ప్లేటు

మిలిటరీ వాహనాల నెంబర్ ప్లేట్లు ఇతర వాహనాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి. పై వైపుకు చూచించిఉండే బాణపు గుర్తును ప్రారంభంలో ఇవి కలిగి ఉంటాయి. తరువాత ఉన్న రెండు అంకెలు కూడా దానిని కొనుగోలువ చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. ప్రస్తుతం మిలిటరీ వాహనాలను డిఫెన్స్ మంత్రిత్వశాఖ విభాగం క్రింద రిజిస్ట్రేన్లను చేయిస్తారు.

మిలిటరీ నెంబర్ ప్లేట్ ప్రత్యేకతలు

మిలిటరీ నెంబర్ ప్లేట్ ప్రత్యేకతలు

ఈ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు దేశ మొత్తం మీద ఎటువంటి ప్రదేశాలకైనా వెళ్లవచ్చు. సామాన్య ప్రజానీకాన్ని అనుమతించని ప్రదేశాలకు మరియు నో ఎంట్రీ ఉన్న ప్రదేశాలకు సైతం ఈ వాహనాలకు అనుమతులు ఉన్నాయి. ఈ తరహ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలకు ఎవరి అనుమతులు కూడా అవసరం లేదు.

Picture Credit: Wikipedia

నీలం రంగు నెంబర్ ప్లేట్

నీలం రంగు నెంబర్ ప్లేట్

ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు చేయించుకునే వాహనాలకు లేత నీలం రంగు బోర్డ్ మీద తెలుపు రంగులో అక్షరాలు ఉంటాయి, ఇటువంటి ప్లేటు మీద UN, CC, CD వంటి ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. అంటే వారు ఏ దేశాలకు చెందిన వారో ఇది సూచిస్తుంది. ఉదా: యుఎన్ అనగా యునైటెడ్ నేషన్స్ అంటారు.

Picture Credit: Team BHP

ఆంధ్రప్రదేశ్‌లో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ గురించి

ఆంధ్రప్రదేశ్‌లో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ గురించి

Ap02Z1245 అనే నెంబర్‌ను ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌గా పరిగణిస్తే. ఇందులోని మొదటి రెండు అంగ్ల అక్షరాలు రాష్ట్రాన్ని సూచిస్తాయి. మరియు తరువాత ఉన్న అంకెలను జిల్లా కోడ్‌గా పరిగణిస్తారు. ఆ తరువాత ఉన్న జడ్ అనే అక్షరం ఆ జిల్లా ఉన్న ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని సూచిస్తుంది. వాహనాల రిజిస్ట్రేషనే ద్వారా వచ్చే క్రమానాన్ని బట్టి చివరి నాలుగు అంకెలను కేటాయిస్తారు.

మరిన్ని ఉదాహరణలు.....

మరిన్ని ఉదాహరణలు.....

1 - ఆఫ్ఘనిస్తాన్

2 - అల్జీరియా

7 - బంగ్లాదేశ్

5 - అస్ట్రేలియా

11 - బ్రిటన్

17 - చైనా

52 - నెధర్లాండ్

68 - పాకిస్తాన్

73 - టర్కీ

75 - రష్యా

77 - అమెరికా

102 - ఐలాండ్

109 - ఇజ్రాయెల్

134 - బొట్సవానా

చిట్కాలు .....

కారు బ్యాటరీ షాక్ కొడితే ఏమౌతుంది..?

వంటింటి వస్తువులతోనే కార్ క్లీనింగ్!

Most Read Articles

English summary
Different Types Vehicle Number Plates Its Uses
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X