షారుక్ ఖాన్ చిత్రం "దిల్వాలే" లోని కారు ఛేసింగ్ సన్నివేశాలు.

By Anil

మనం సినిమాలు చూస్తున్నప్పుడు, అక్కడక్కడ కార్ సీన్లు, కార్ ఛేసింగ్ మరియు కార్లకు చెందిన స్టట్లు ఉంటాయి కదా. అందులో మన కథానాయకుని తెగ మురిసిపోతుంటాం. నిజానికి ఆ స్టంట్లు మన కథానాయకులు చేసుంటారని మీరు భావిస్తున్నారా?

నిజానికి డైరెక్టర్లు కొంత మంది ప్రత్యేక స్టంట్ టీంలను ఉపయోగించి వీటిని చిత్రీకరిస్తారు. తెర ముందు మనల్ని ఆనందపరచడానికి వారి జీవితాలను రిస్క్‌లో పెట్టి మరి ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తుంటారు. మన బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి చెన్నై ఎక్స్‌ప్రెస్ ద్వారా మనకు బాగా సుపరిచితం అయ్యాడు.

ఇతని ఖాతాలో మరొక చిత్రం "దిల్వాలే" నిర్మితమవుతోంది. కథానాయకుడు షారుక్ ఖాన్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అతి భయంకరమైన కార్ స్టంట్లు మరియు ఛేసింగ్‍‌లు ఉన్నాయి. వీటిని వీడియో మరియు ఫోటోల రూపంలో డ్రైవ్‌‌స్పార్క్ క్రింది కథనం ద్వారా అందిస్తోంది.

 షారుక్ ఖాన్ చిత్రం

హాలివుడ్‌లో జేమ్స్‌బాండ్ రూపొందించిన సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చూశారా? అందులో విపరీతమైన కార్ స్టంట్లను మనం చూడవచ్చు. అచ్చం ఇదే తరహాలో ఈ దిల్వాలే చిత్రంలో స్టంటులు మరియు చేసింగ్‌లు భారీగా ఉండే విధంగా రూపొందిస్తున్నారు.

 షారుక్ ఖాన్ చిత్రం

ఈ సినిమాలో మూడు అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించారు. ఇందులో ఛేసింగ్‌లు మరియు స్టంట్ల కోసం జాగ్వార్, హమ్మర్ యస్‌యువి, ఆడి మరియు బిఎమ్‌డబ్ల్యూ వంటి కార్లను ఉపయోగించారు

 షారుక్ ఖాన్ చిత్రం

ఈ చిత్రంలో అత్యంత భయంకరమైన స్టంట్ల చిత్రీకరణ కోసం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సుప్రసిద్దులైన బల్గేరియా మరియు సౌత్ ఆఫ్రికా స్టంట్ టీమ్‌లతో చిత్రీకరించారు. ఇందులో దాదాపుగా 200 మంది ఆర్టిస్ట్‌లు తమ ప్రాణాలను లెక్కచేయకుండా పాల్గొన్నారు.

 షారుక్ ఖాన్ చిత్రం

ఈ చిత్ర డైరక్టర్ రోహిత్ శెట్టి, స్టంట్లను ప్రారంభించే ముందుగా ట్రయల్‌ కోసం బొమ్మ కార్లను ఉపయోగించి టీమ్ మొత్తానికి వివరించాడు. తరువాత అనేక భద్రత అంశాలతో స్టంట్ల చిత్రీకరణ ప్రారంభించాడు.

 షారుక్ ఖాన్ చిత్రం

నిజమైన కార్ స్టంట్లు నిజంగా , ప్రత్యక్షంగా చూసిన వారి గుండెల్లో గుబులు పుట్టింస్తుంది. అందులో కూడా ఒక స్కేటింగ్ ఆర్టిస్ట్ తన స్కేటింగ్ బోర్డ్ ఆధారంతో డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఎంతో రిస్క్‌తో ఈ భయంకర స్టంట్ల ఫోటోలను తీశాడు.

షారుక్ ఖాన్ చిత్రం

మీరు ఈ వీడియోను చూసినట్లయితే, స్టంట్లలో పాల్గొన్న వారు ఒళ్లు గగుర్పొడుచే విధంగా చేశారు. ఇది నిజంగా వారి ప్రాణాలకు ప్రమాదకరం, ఈ సందర్బంగా ఏదయినా అనుకోని సంఘటన జరిగితే వారి ప్రాణాలకే ముప్పు.

షారుక్ ఖాన్ చిత్రం

సెలబ్రిటి కారు ఛేసింగ్ అనేది ప్రస్తుతం సినిమాలలో ఎంతో ముఖ్యమయినది. ఈ దిల్వాలే చిత్రంలో క్లైమాక్స్‌లో జరిగే ఈ ఛేసింగ్ మరియు స్టంట్లు ఆద్యంతం ఆశక్తిగా ఉంటాయి.

షారుక్ ఖాన్ చిత్రం

ఈ సినిమా కేవలం షారుక్ అభిమానులకు మాత్రమే కాదు, స్టంట్లను, ఛేసింగ్‌లను ఇష్టపడే వారు కూడా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేయవచ్చు. కారణం ఇందులో అత్యంత ఖరీదైన కార్లతో జరిగే ఛేసింగ్‌లు భారీగా ఉంటాయి

షారుక్ ఖాన్ చిత్రం

ఈ సినిమాను అతి త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అందులో భాగంగా దీని చిత్రీకరణ సమయంలో గల స్టంట్‌ వీడియోను విడుదల చేశారు. దీని ద్వారా ఎక్కువ మంది ఈ సినిమాను అవకాశం ఉంటుందని వారి అభిప్రాయం.

షారుక్ ఖాన్ చిత్రం

దాదాపుగా 12 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేశారు. దీని ద్వారా చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి ఈ స్టంట్ల‌కు ఎలా దర్శకత్వం వహించాడో మీరు తెలుసుకోవచ్చు.

షారుక్ ఖాన్ చిత్రం
  1. బాలీవుడ్ తారలు, వారి కార్ నెంబర్ల వెనకున్న రహస్యాలు.....!!
  2. రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!

More from DriveSpark

Article Published On: Wednesday, December 16, 2015, 15:26 [IST]
English summary
Dilwale Film Car Chasing Scenes Making Video Released
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+