Dimple Hayathi డింపుల్ హయాతి వీరంగం.. ఏకంగా ఐపీఎస్ అధికారి కారునే ఢీకొట్టిన నటి..
ఖిలాడి, రామబాణం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా పోలీసు కారునే ఢీకొట్టి నానా రచ్చ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. జీవితంలో ఎవరైనా ఎంత పేరు తెచ్చుకున్నా చట్టానికి అతీతులు కారనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టు కాలనీలో ఒకే అపార్ట్‌మెంట్‌లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, నటి డింపుల్ హయాతి నివాసం ఉంటున్నారు. పార్కింగ్ ప్లేస్‌లో ఉంచిన డీసీపీ అధికారిక వాహనం వైట్ టయోటా ఫార్చ్యూనర్ కారును ఆమె వెనుక నుంచి ఢీకొట్టి అనంతరం కాలితో తన్ని రచ్చ చేశారు. ఘటన సమయంలో ఆమెతో పాటు తన స్నేహితుడు డేవిడ్ కారులో ఉన్నారు.

కాగా డింపుల్ హయాతి.. డీసీపీ వాహనాన్ని ఢొకొట్టినప్పుడు రాహుల్ హెగ్డే డ్రైవర్ అక్కడే ఉన్నారు. ఇదేంటి అని డ్రైవర్ చేతన్ కుమార్ ప్రశ్నించగా డింపుల్ హయాతి మండిపడుతూ వైట్ ఫార్చ్యూనర్ కారును కాలితో తన్నారు. దీంతో నటి డింపుల్ హయాతిపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రాహుల్ హెగ్డే డ్రైవర్ ఫిర్యాదు మేరకు హయాతిపై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే విధంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లుగా కేసు నమోదు చేశారు. దీంతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే ఉద్దేశపూర్వకంగా ఆమె ఈ పని చేసినట్లుగా అర్థమవుతోంది. గతంలోనూ వీరిద్దరి సమస్యలు ఉన్నట్లుగా, ఈ తరహా ఘటనలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
ఈ ఘటనలో డింపుల్ హయాతి చాలా దూకుడుగా వ్యవహరించిందని రాహుల్ హెగ్డే కారు డ్రైవర్ పేర్కొన్నారు. గతంలోనూ వీరికి పార్కింగ్ విషయంలో గొడవ జరిగిందని.. నచ్చచెప్పడానికి ప్రయత్నించినా తీరు మార్చుకోలేదని వెల్లడించారు. జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి డింపుల్ హయాతి బయటకు వస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పీఎస్ నుంచి బయటకు వచ్చాక ఆమె తన BMW 5 కారులో స్నేహితుడు డేవిడ్ కలిసి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. గతంలోనూ తన కారుకు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని చెప్పారు. తన వృత్తి బాధ్యతల దృష్ట్యా అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా తనలో మార్పు రాలేదని.. తాజాగా తన బీఎండబ్ల్యూ కారులో వచ్చి తన వాహనాన్ని ఢీకొట్టారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఈ వివాదంపై స్పందించిన నటి డింపుల్ హయాతి సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర ట్వీట్ చేశారు. 'అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన తప్పులను కప్పిపుచ్చలేరు. సత్యమేవజయతే' అని పేర్కొన్నారు. ఇప్పటికే వీరి మధ్య పలు సమస్యలు ఉన్నట్లు ఈ ఘటన ద్వారా అర్థమవుతోంది. విచారణ తర్వాత తప్పెవరిదో తెలిసే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








