'మారుతి జిమ్నీ'పై మనసుపడ్డ ప్రముఖ డైరెక్టర్ - ఫోటోలు
సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తుంటారని అందరికి తెలుసు. ఈ తరుణంలో ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొథా సినిమా డైరెక్టర్ 'అభిలాష్ జోషి' ఇటీవల మహీంద్రా థార్ ప్రత్యర్థిగా ప్రజాదరణ పొందిన మారుతి జిమ్నీ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అభిలాష్ జోషి కొన్న కారు మోడల్ ఏది, దాని ధర ఎంత? వివరాలు ఏంటి అనే మరింత సమాచారం వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి కార్ల మీద ఎక్కువ మక్కువ ఉన్న అభిలాష్ జోషి వద్ద ఇప్పటికే మిత్సుబిషి, బీఎండబ్ల్యూ వంటి కార్లు కూడా ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈయన గ్యారేజిలోకి మారుతి సుజుకి ఆఫ్ రోడర్ జిమ్నీ కూడా చేరింది. ఇది రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. కఠినమైన రోడ్డులో ప్రయాణించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

ఇప్పటికే భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి జిమ్మీ ఆఫ్ రోడర్ కారు.. మహీంద్రా థార్ SUVకి మాత్రమే కాకుండా ఫోర్స్ గూర్ఖా వంటి వాటికి కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. పరిమాణంలో దాని ప్రత్యర్థులకంటే కొంత చిన్నగా ఉన్నప్పటికీ పనితీరు మాత్రం హుందాగా ఉంటుంది. ఇది మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
మారుతి జిమ్నీ కారు ఫ్లాట్ క్లామ్‌షెల్ బానెట్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, అల్లాయ్ వీల్స్ మరియు 195/80 పరిమాణంలో ఉన్న టైర్లను పొందుతుంది. ఇందులో 9 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ మొదలైన ఫీచర్స్ కూడా ఉన్నాయి.

మారుతి జిమ్నీ కారు 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఐడిల్ స్టార్ట్, స్టాప్ బటన్ పొందితుంది. ఇంజిన్ 104.8 పీఎస్ పవర్ మరియు 134.2 న్యూటన్ మీటర్ తారక్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాబట్టి పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఈ SUV ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతూ కస్టమర్లకు చేరువవుతోంది.
మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అత్యుత్తమ పనితీరును అందించే మారుతి జిమ్నీ.. అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టం (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్ మరియు సైడ్ ఇంపాక్ట్ డోర్ బీమ్స్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.
భారతీయ మార్కెట్లో SUV, MPVలకు మాత్రమే కాకుండా ఆఫ్ రోడర్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఆఫ్ రోడర్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. మంచి అమ్మకాలను పొందుతున్నాయి. ఈ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా. ఫోర్స్ మోటార్స్ మరియు మారుతి సుజుకి కూడా ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్లో మంచి అమాంకాలతో ముందుకు సాగుతున్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








