అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్

ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ప్రభాస్ ఈ రోజు 'పాన్ ఇండియా స్టార్' గా ఎదిగి పోయాడు. అయితే ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో 'రాజా డీలక్స్' సినిమాలో బిజీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల డైరెక్టర్ మారుతి ప్రభాస్ కారు డ్రైవ్ చేస్తూ కనిపించారు.

ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్

నిజానికి ప్రభాస్ కి కార్లంటే చాలా ఇష్టం, ఇందులో భాగంగానే యితడు ఇప్పటికే లంబోర్ఘిని కారుని కొనుగోలు చేశారు. ఈ కారులోనే ప్రస్తుతం సినిమా షూటింగ్ కి వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఆ సందర్భంలో డైరెక్టర్ మారుతి ప్రభాస్ లంబోర్ఘిని కారుని డ్రైవ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో ప్రభాస్ ఖరీదైన కారుని చూడవచ్చు.

ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్

ప్రభాస్ కొనుగోలు చేసిన ఈ లాంబోర్గినీ అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ ధర సుమారు రూ. 6 కోట్లు వరకు ఉంటుంది. భారతదేశంలో లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ కలిగి ఉన్న సెలబ్రిటీలలో ప్రభాస్ ఒకరుగా ఉన్నారు. ఈ సూపర్ కారు మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా వేగవంతమైన కార్లలో ఈ లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్ ఒకటి కావడం విశేషం.

ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్

ఎక్కువమంది సెలబ్రిటీలు కోరుకునే సూపర్ కార్లలో లాంబోర్గినీ అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ ఒకటి. ఇది ఓపెన్-టాప్‌ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 6.5-లీటర్ V12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 740 hp పవర్ మరియు 690 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో సింగిల్ క్లచ్ 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్

లాంబోర్గినీ అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ యొక్క గరిష్ట వేగం గంటకు 300 కిమీ వరకు ఉంటుంది. ఇది కేవలం 9 సెకన్లలో గంటకు 0 నుంచి 200 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో అనుసంధానించబడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కూడా పొందుతుంది.

ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్

అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో కార్బన్-సిరామిక్ డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ముందు భాగంలో 6 పిస్టన్ కాలిపర్‌లతో 400 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 4 పిస్టన్ బ్రేక్ కాలిపర్‌లతో 380 మిమీ కార్బన్ సిరామిక్ డిస్క్‌ వంగితివి ఉన్నాయి. ఈ సూపర్ కారు అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

లాంబోర్గినీ అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ బరువుని తగ్గించడానికి కంపెనీ ఇందులో కార్బన్ ఫైబర్ మోనోకోక్ చాసిస్ ఉపయోగించింది. కావున ఇది తక్కువ బరువు ఉంటడం వల్ల ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ఇంటీరియర్ డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. మొత్తం మీద ఈ సూపర్ కారు ద్వారా మీరు మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్

ఇక ప్రభాస్ విషయానికి వస్తే, బాహుబలి సినిమాతో పెద్ద హిట్ కొట్టిన తరువాత ఇప్పుడు అది పురుష మరియయు రాజా డీలక్స్‌ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా సలార్ సినిమా కూడా 2023 సెప్టెంబర్ 28 న విడుదల కానున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 31, 2023, 13:56 [IST]
English summary
Director maruti drives prabhas lamborghini video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+