ఖరీదైన బైక్ కొన్న ప్రముఖ తమిళ డైరెక్టర్ 'వెట్రిమారన్': ధర రూ. 17 లక్షలకు పైమాటే..

సాధారణంగా సినీ పరిశ్రమలోని వారు, పొలిటికల్ లీడర్స్ మరియు పారిశ్రామిక వేత్తలు మొదలైన సంపన్నులు ఖరీదైన లగ్జరీ కార్లు మరియు బైకులను కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి వాటికి సంబంధించిన సమాచారాలను ఇదివరకు కూడా మనం చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు 'వెట్రిమారన్' ఒక ఖరీదైన బైక్ బిఎండబ్ల్యు కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

ఖరీదైన బైక్ కొన్న ప్రముఖ తమిళ డైరెక్టర్ 'వెట్రిమారన్': ధర రూ. 17 లక్షలకు పైమాటే..

ఇప్పటికే తమిళ సినీపరిశ్రమలో అజిత్ మరియు విజయ్ సేతుపతి వంటి ప్రముఖులు బిఎండబ్ల్యు బైకులను కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో దర్శకుడు 'వెట్రిమారన్' కూడా చేరిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఖరీదైన బైక్ కొన్న ప్రముఖ తమిళ డైరెక్టర్ 'వెట్రిమారన్': ధర రూ. 17 లక్షలకు పైమాటే..

తమిళ ప్రజలకు 'వెట్రిమారన్‌' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతడు అసురన్‌, పొల్లధవన్‌, వడ చెన్నై వంటి పలు హిట్‌ చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఇతడు 'విడుతాలై' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో సూరి, భవాని శ్రీ, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కొత్త రకం సినిమాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ దర్శకుడు వెట్రిమారన్ అని అంటారు. నిజ జీవితాలను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరిస్తాడని కూడా అతడికి పేరుంది.

ఖరీదైన బైక్ కొన్న ప్రముఖ తమిళ డైరెక్టర్ 'వెట్రిమారన్': ధర రూ. 17 లక్షలకు పైమాటే..

'వెట్రిమారన్‌' కొనుగోలు చేసిన ఈ బిఎండబ్ల్యు బైక్ ధర సుమారు రూ. 17 లక్షలకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఇతని గ్యారేజిలో ఇప్పటికే చాలా ఖరీదైన బైకులు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా కొత్త BMW R NineT స్క్రాంబ్లర్ బైక్ తన గ్యారేజిలో చేర్చాడు. ఈ బైక్ చూడాటానికి ఆకర్షణీయంగా మంచి డిజైన్ కలిగి ఉంటుంది.

ఖరీదైన బైక్ కొన్న ప్రముఖ తమిళ డైరెక్టర్ 'వెట్రిమారన్': ధర రూ. 17 లక్షలకు పైమాటే..

BMW R NineT స్క్రాంబ్లర్ బైక్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 1170 సీసీ బాక్సర్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 108.77 బిహెచ్‌పి పవర్‌ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 116 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది గొప్ప పనితీరుని అందిస్తుంది.

ఖరీదైన బైక్ కొన్న ప్రముఖ తమిళ డైరెక్టర్ 'వెట్రిమారన్': ధర రూ. 17 లక్షలకు పైమాటే..

BMW R NineT స్క్రాంబ్లర్ బైక్‌ యొక్క ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు 265 మిమీ డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉన్నాయి. ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా రైడింగ్ సమయంలో రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఖరీదైన బైక్ కొన్న ప్రముఖ తమిళ డైరెక్టర్ 'వెట్రిమారన్': ధర రూ. 17 లక్షలకు పైమాటే..

ఈ కొత్త స్క్రాంబ్లర్ బైక్‌ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2,175 మిమీ. వెడల్పు 865 మిమీ మరియు ఎత్తు 1,330 మిమీ మరియు వీల్‌బేస్ పొడవు 1,527 మిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క సీటు ఎత్తు 820 మి.మీ వరకు ఉంటుంది. BMW R NineT స్క్రాంబ్లర్ బైక్‌ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్స్.

ఖరీదైన బైక్ కొన్న ప్రముఖ తమిళ డైరెక్టర్ 'వెట్రిమారన్': ధర రూ. 17 లక్షలకు పైమాటే..

సాధారణంగా బిఎండబ్ల్యు బైకులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. కావున ఈ BMW R NineT స్క్రాంబ్లర్ కూడా చాలా ఖరీదైనదిగా ఉంటుంది. ఈ కొత్త బైక్ బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా 2021 ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదలయ్యింది. ఇది భారతీయ మార్కెట్ కి కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా దిగుమతి అవుతుంది. ఈ కారణంగానే ఈ బైక్ ధర ఎక్కువగా ఉటుంది.

ఖరీదైన బైక్ కొన్న ప్రముఖ తమిళ డైరెక్టర్ 'వెట్రిమారన్': ధర రూ. 17 లక్షలకు పైమాటే..

సాధారణంగా భారతదేశంలో పూర్తిగా దిగుమతి చేసుకుని విక్రయించబడే కార్లు మరియు బైక్‌లు వంటి వాహనాలు చాలా ఖరీదైనవి. భారత్‌లో తయారు చేస్తే తక్కువ ధరకే అందుబాటులో ఉటాయి. కావున చాలా కంపెనీలు ఇప్పుడు స్వదేశంలోనే వాహనాలు తయారు చేసి విక్రయిచడానికి ఆసక్తి చూపుతున్నాయి.

ఖరీదైన బైక్ కొన్న ప్రముఖ తమిళ డైరెక్టర్ 'వెట్రిమారన్': ధర రూ. 17 లక్షలకు పైమాటే..

ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ మరియు KK గా ప్రసిద్ధి చెందిన 'కృష్ణకుమార్ కున్నత్' జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన 'ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌' కొనుగోలు చేశారు.

ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ వి6 2.9-లీటర్ టిఎఫ్ఎస్ఐ ట్విన్-టర్బో ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 443 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 15, 2022, 11:22 [IST]
English summary
Director vetri maaran buys bmw r ninet scrambler
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+