జర్మన్ బ్రాండ్ కారు కొన్న ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్.. దీని రేటెంతో తెలుసా?

సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల సినీ డైరెక్టర్ మరియు మ్యూజిక్ కంపోజర్ 'విశాల్ భరద్వాజ్' మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) కారును కొనుగోలు చేశారు.

నివేదికల ప్రకారం విశాల్ భరద్వాజ్ మరియు ఆయన భార్య రేఖా భరద్వాజ్ ఇద్దరూ కలిసి మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'జీఎల్ఈ' కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో వీరిరువురు కలిసి బెంజ్ కారును డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. ఈ కారు డెలివరీను మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ సంతోష్ అయ్యర్ చేశారు.

Vishal Bhardwaj Mercedes Benz GLE

ముంబయిలోని కంపెనీ డీలర్‌షిప్‌ ప్రారంభించిన తరువాత సంతోష్ అయ్యర్.. విశాల్ భరద్వాజ్ మరియు రేఖా భరద్వాజ్‌లకు కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు కీ అందించారు. ఈ కారు ధర రూ. 96.65 లక్షలు (ఎక్స్ షోరూమ్. ఆన్ రోడ్ ధర రూ. 1 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఇది ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన లగ్జరీ కారు. ఈ కారణంగానే చాలామంది ప్రముఖులు ఈ కార్లను కొనుగోలు చేస్తుంటారు.

విశాల్ మరియు రేఖా భరద్వాజ్ బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది భారతదేశంలో బ్రాండ్ యొక్క రెండో అత్యంత ప్రజాదరణ పొందిన SUV. ఈ మోడల్ స్థానికంగా అసెంబుల్ చేయబడింది. ఈ లగ్జరీ కారు లాంగ్ వీల్‌బేస్ వెర్షన్‌లో వస్తుంది. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి మంచి పనితీరును అందిస్తుంది.

Vishal Bhardwaj Mercedes Benz GLE

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ SUVలో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 265 Bhp పవర్ మరియు 550 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 6.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 230 కిమీ వేగవంతం అవుతుంది.

మంచి డిజైన్ కలిగిన ఈ కారు మంచి ఫీచర్స్ పొందుతుంది. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ వంటి వాటితో అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది. ఇందులోని స్టీరింగ్ వీల్ ఎస్ క్లాస్ కారులో మాదిరిగా ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

Mercedes-Benz GLE LWB

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ SUVలో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లు ఉంటాయి. ఇందులో మసాజ్ ఫంక్షన్ మరియు వెంటిలేషన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లతో పాటు.. 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ట్రాన్స్పరెంట్ బానెట్ ఫంక్షనాలిటీ, పనోరమిక్ సన్‌రూఫ్, సన్ బ్లైండ్‌ వంటి మరెన్నో లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ ఇండియా మెరుగైన అండర్ బాడీ రక్షణతో ఒక ఆఫ్ రోడ్ ప్యాకేజీని కూడా విక్రయిస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, May 23, 2024, 11:14 [IST]
English summary
Director vishal bhardwaj buys the mercedes benz gle car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+