రూ.2 కోట్ల కారులో తళుక్కుమన్న నటి దిశా పటానీ.. ఏంటీ కారు ప్రత్యేకత..!
BMW 7 సిరీస్ కారు ప్రస్తుతం సెలబ్రిటి ఫేవరెట్ కారుగా మారింది. చాలా మంది సినీనటులు ఈ సెడాన్‌ను కొనుగోలు చేశారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి దిశా పటానీ కొనుగోలు చేశారు. బీఎండబ్ల్యూ 7- సిరీస్ 740i స్పోర్ట్స్ వేరియంట్‌ను కొనుగోలు చేశారు తాజాగా ఈ కారులో ప్రయాణిస్తున్న నటి వీడియో వైరల్ అవుతోంది.
అత్యంత ఖరీధైన కారు ఇదే.. : బీఎండబ్ల్యూ 7- సిరీస్ 740i స్పోర్ట్స్ సెడాన్ ధర రూ.1.78 కోట్లు (ఎక్స్‌షోరూం)గా ఉంది. అదే ఆన్‌రోడ్ ధర రూ.2.05 కోట్లుగా ఉంది. ఈ కారు బ్లాక్ సఫైర్ మెటాలిక్ రంగుల్లో ఉండడాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం దిశా పటానీ వద్ద ఉన్న కార్లలో ఇదే అత్యంత ఖరీదైన కారుగా తెలుస్తోంది.

బాలీవుడ్ నటి దిశా పటానీ కొనుగోలు చేసిన కొత్త బీఎండబ్ల్యూ సెడాన్ 3.0 లీటర్ ఇన్‌లైన్ 6 సిలిండర్ టర్భోఛార్జడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్ఠంగా 375bhp శక్తి, 520Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఈ కారు మైల్డ్ హైబ్రిడ్ సిస్టంను కలిగి ఉంటుంది. మరియు ఈ కారు 5.4 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది.
ఆకర్షణీయమైన డిజైన్ : బీఎండబ్ల్యూ 7- సిరీస్ 740i స్పోర్ట్స్ సెడాన్ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్‌లో ఉన్న కిడ్ని గ్రిల్ ఈ సెడాన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఈ ఫ్రంట్ గిల్ యాక్టివ్ వెంటిలేషన్‌తో వస్తుంది. మరియు ముందువైపు LED లైట్‌లున్నాయి. ఈ సెడాన్ స్ల్పిట్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉన్నాయి.

ఈ బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఇంటీరియర్ విషయానికి వస్తే 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంటియంట్ లైటింగ్ మరియు మసాజింగ్ సీట్లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఈ కారు ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఆల్ LED లైట్లు, 20- అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటాయి.
దిశా పటాని కార్ల కలెక్షన్ : ఇప్పటికే నటి దిశా పటాని రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మరియు మెర్సిడెస్ బెంజ్ S450 కార్లను కలిగి ఉన్నారు. తాజాగా ఆమె గ్యారేజీలో BMW 7 సిరీస్ కారు చేసింది. దిశా పటాని బీఎండబ్ల్యూ కారు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ ఆటోబయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కిన సినిమా ద్వారా దిశా మంచి పేరు తెచ్చుకున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








