దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
ప్రముఖ బాలీవుడ్ నటి 'దిశా పటానీ' (Disha Patani) గురించి తెలియని వారు ఉండరంటే.. అతిశయోక్తి కాదు. కానీ ఈమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందనే విషయం చాలామందికి తెలియాల్సిన విషయం. ఈ కథనంలో దిశా పటానీ ఉపయోగించే కార్లను గురించి తెలుసుకుందాం..
ఎంఎస్ ధోని, ఏక్ విలన్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన దిశా పటానీ అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీలలో ఒకరు. ఈమె మొట్ట మొదట ఉపయోగించ కారు హోండా కంపెనీకి చెందిన సివిక్. ఇప్పుడు ఈమె గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. ఇందులో రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ మరియు చేవ్రొలెట్ క్రూజ్ వంటివి ఉన్నాయి.

రేంజ్ రోవర్ స్పోర్ట్
ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో ఒకటైన 'రేంజ్ రోవర్ స్పోర్ట్' దిశా పటానీ గ్యారేజిలో ఉంది. ఈ కారును దిశా పటానీ 2019 కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారు ధర రూ.1.51 కోట్లు. ఇది 3.0-లీటర్ 6-సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 394 బీహెచ్‌పి పవర్ మరియు 550 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్
జర్మన్ బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎస్-క్లాస్ కూడా దిశా పటానీ గ్యారేజిలో ఉంది. రేంజ్ రోవర్ మాదిరిగానే ఇది కూడా మునుపటి తరానికి చెందిన మోడల్ అని తెలుస్తోంది. దీనిని డబ్ల్యు222 జనరేషన్ అని పిలుస్తారు. ఇది 3.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 362 Bhp పవర్ మరియు 500 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.

హోండా సివిక్
హోండా కంపెనీకి చెందిన సివిక్ కూడా దిశా పటానీ గ్యారేజిలో ఉంది. ఖరీదైన లగ్జరీ కార్లను ఉపయోగించడానికి ముందు ఈమె సివిక్ కారును ఉపయోగించేదని తెలుస్తోంది. ఈ కారు తెలుపు రంగులో చూడచక్కగా ఉంటుంది. నిజానికి ఈ కారు అరుదైన హైబ్రిడ్ వెర్షన్. ఇది 95 Bhp పవర్ మరియు 122 Nm టార్క్ అందించే ఇంజిన్ పొందుతుంది. దిశా పటానీ ఈ కారులో చాలా సార్లు కనిపించింది.
చేవ్రొలెట్ క్రూజ్
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన తరువాత దిశా పటానీ 'చేవ్రొలెట్ క్రూజ్' కొనుగోలు చేసింది. ఈమె తన బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమానికి ఈ కారులోనే వచ్చినట్లు సమాచారం. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 163 Bhp పవర్ మరియు 360 Nm టార్క్ అందిస్తుంది.

హిందీ సినిమాల్లో నటనా జీవితం ప్రారంభించిన దిశా పటానీ 2015లో వరుణ్ తేజ్ సరసం లోఫర్ సినిమాలో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఎంఎస్ ధోని జీవిత కథను తెరకెక్కించాడనికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరియు కియారా అద్వానీ కలిసి నటించారు. 216 కోట్ల రూపాయల అంచనాలతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విధంగా తెలుగు సినీ ప్రపంచంలో కూడా తనదైన ముద్ర వేసుకుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








