వణుకుతూ కారు డోర్ తెరిచిన హీరోయిన్.. లేటెస్ట్ కంగువా సినిమా ఎఫెక్ట్ ఏమైనా పడిందా..?
సినీ తారల నుంచి మొదలుకుని క్రికెటర్లు, పెద్ద వ్యాపారవేత్తలు కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయిందంటే చాలు వెంటనే అది వాళ్ల గ్యారేజీలోకి చేరిపోతుంది. ముఖ్యంగా సినిమా తారలు లగ్జరీ కారుతో బయట కనిపిస్తే, అందరూ కూడా ఈ కారు వివరాల గురించి ఆరా తీస్తుంటారు. తాజాగా ప్రభాస్‌తో కల్కి సినిమాలో నటించిన ప్రముఖ నటి దిశా పటానీ ఒక కొత్త లగ్జరీ కారుతో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ కారు డోర్‌ను ఓపెన్ చేయడంలో కాస్త ఇబ్బంది పడ్డట్టు వీడియోలో కనిపిస్తుంది. సాధారణంగా సెలబ్రిటీల వద్ద అధునాతన ఫీచర్లతో కూడిన లగ్జరీ కార్లే అధికంగా ఉంటాయి. ఇప్పుడు దిశా పటానీతో కనిపించిన మోడల్ BMW 7 సిరీస్ (బీఎమ్‌డబ్ల్యూ).
దిశా పటానీ BMW 7 సిరీస్ కార్ లేటెస్ట్ మోడల్. ఇండియా మార్కెట్లో ఇది అత్యంత డిమాండ్ ఉన్న సిరీస్. పెద్ద వ్యాపారవేత్తలతో పాటు చాలా మంది సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీల వద్ద ఇప్పటికే ఈ కారు ఉంది. దేశీయంగా దీని ప్రారంభ ధర రూ.1.81 కోట్లు. అదే టాప్ వేరియంట్ అయితే రూ.1.84 కోట్ల వరకు ఉంది. ఈ ధరలు ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీవి.

ఇంజిన్ పనితీరు విషయానికి వస్తే, 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 3.0-లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. పెర్ఫామెన్స్ విషయానికి వస్తే రెండింటివి ఒకే విధంగా ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 375 PS పవర్, 520 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, 286 PS పవర్, 650 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఇది చూడటానికి క్లాసిక్ లుక్‌తో చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ రెండు ఇంజిన్ వేరియంట్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో సెటప్ చేయబడి ఉన్నాయి. ఈ కారులో అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. సీట్లు కంఫర్ట్‌గా ఉంటాయి. ఇవి మసాజింగ్ సీట్లతో ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందిస్తాయి. లోపల సీట్ల మధ్య గ్యాప్ కూడా విశాలంగా ఉంటుంది. లోపల అందించిన థీమ్ కూడా సరికొత్తగా ఉంది.

క్యాబిన్‌లో స్మార్ట్ టచ్ కంట్రోలింగ్ ఫీచర్స్ ఉన్నాయి. 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాపిల్ కార్, ఆండ్రాయిడ్ ఆటో, విలాసవంతమైన క్యాబిన్‌లో ఐదు మంది వరకు కూర్చోని ప్రయాణించవచ్చు. యాంబియంట్ లైటింగ్ ,వెనుక సీట్లలో కూర్చున్న వారికి ముందు 5.5-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటివి కూడా ఈ కారులో ఉన్నాయి.
దీనిలో బూట్ స్పేస్ 540 లీటర్ల వరకు ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 74 లీటర్లు. నగర రోడ్లకు అనువుగా BMW 7 సిరీస్య దాదాపు 12.1 కిమీల వరకు మైలేజ్ ఇస్తుంది. ప్రయాణికుల సేఫ్టీ పరంగా కూడా ఈ కారు అత్యంత అనువైనది. ఎయిర్ బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఇంకా మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








