Viral Video పబ్లిక్‌ రోడ్డుపై నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

పబ్లిక్ రోడ్లపై రేసింగ్‌ చేయాలనుకోవడం, మరియు అత్యుత్సాహం ప్రదర్శించడం ఎప్పుడు చాలా ప్రమాదకరం. రోడ్లపై డ్రైవింగ్‌ చేసేటప్పుడు పూర్తిగా దృష్టి అంతా డ్రైవింగ్‌ మీదనే ఉండాలి. అలాగే రోడ్లపై కనిపించిన ప్రతికారును ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నం చేస్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.

ఈ తాజా ఘటనలో వీడియో చూస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలగవచ్చు. ఓ రోడ్డుపై బీఎండబ్ల్యూ ఎక్స్6 కారు వెళ్తోంది. బీఎండబ్ల్యూ కారుతో పోటీ పడి వెళ్లేందుకు వెనుక కారులోని డ్రైవర్ ప్రయత్నం చేస్తాడు. కొంత వరకు అంతా బాగానే వెళ్లిన కారు.. అంతలో అనుకోని ప్రమాదంలో పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

car hits lorry when driver distracted

ఈ ఘటన కేరళలో జరిగినట్లు తెలుస్తోంది. బీఎండబ్ల్యూ కారును అనుసరించేందుకు మరో కారు డ్రైవర్‌ ప్రయత్నం చేశారు. కొంత దూరం వెళ్లాక బీఎండబ్ల్లూ కారు వేగంగా వెళ్లిపోతుంది. వెంబడించిన కారు కాస్త వెనుకబడిపోతుంది. దీంతో వెనుక ఉన్న కారు డ్రైవర్‌.. BMW కారును వెతకడం ప్రారంభించాడు. కాసేపటికి బీఎండబ్ల్యూ కారు కనిపిస్తోంది. బీఎండబ్ల్యూ కారు దగ్గరకు వెళ్లేందుకు వెనుక కారు డ్రైవర్‌ ప్రయత్నం చేస్తాడు.

అదే సమయంలో కారులో ఉన్న వారితోనూ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నట్లు మనం వీడియోలో గమనించవచ్చు. అప్పుడు వెనుకున్న కారు డ్రైవర్‌ దృష్టి కేవలం బీఎండబ్ల్యూ కారుపైనే ఉంది. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ అవ్వడం ఆ డ్రైవర్ గుర్తించలేదు. మరియు ఎదురుగా వస్తున్న వాహనాలు నిలిచిపోవడం కూడా గమనించలేదు.

car hits lorry when driver distracted

ఆఖరి క్షణంలో లారీని గుర్తించిన డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. అయినా కారు పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. ఫలితంగా లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు వేగం తక్కువగా ఉండడం వల్ల పెద్ద గాయాలు కాలేదని తెలుస్తోంది. కారు కూడా స్వల్పంగా డ్యామేజి అయినట్లు తెలుస్తోంది.

వీడియోను సరిగా గమనిస్తే ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై కొద్ది పాటి వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా కారు డ్రైవింగ్‌ చేయాల్సింది. కానీ రోడ్డును రేసింగ్‌ ట్రాక్‌గా భావించి డ్రైవింగ్‌ చేశారు. ఫలితంగా ప్రమాదం బారిన పడ్డారు.

వర్షం కురుస్తున్న సమయంలో ట్రాక్షన్‌ తక్కువగా ఉంటుంది. ఫలితంగా బ్రేకింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. బీఎండబ్ల్యూ X6లో అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉంటాయి. ప్రాథమిక హ్యాచ్‌బ్యాక్‌ కార్లతో పోలిస్తే మెరుగైన ఫీచర్లు కలిగి ఉంటుంది. హై ఎండ్‌ కార్లతో విశాలమైన టైర్లను కలిగి ఉంటాయి. ఫలితంగా మెరుగైన నియంత్రణ కలిగి ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, July 7, 2023, 18:14 [IST]
English summary
Distracted car driver hits lorry which was stopped at traffic signal in kerala video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+