విమానాలకు హెడ్‌లైట్లు ఉంటాయా.??.. దీని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసుకోండి.!!
విమాన ప్రయాణాలు(Flight Journeys) అంటే ఇష్టపడని వారుండరు. అదే విధంగా విమానం ఎలా పనిచేస్తుంది.. ఎలా ఎగురుతుంది.. అందులోని ఇంజిన్ విశేషాలేంటి.. ఇవే కాకుండా విమానానికి సంబంధించి చాలా విషయాలను మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అయితే విమానాల హెడ్‌లైట్ల గురించి మీకు తెలుసా.. అసలు వీటికి హెడ్‌లైట్లు ఉంటాయా అనే డౌట్ కూడా మీకు రావచ్చు.
సాధారణంగా రోడ్డుపై తిరిగే ప్రతి వాహనానికి హెడ్‌లైట్(Airplanes Headlights) తప్పనిసరిగా ఉంటుంది. రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు వాహన హెడ్‌లైట్లు సరిగా పనిచేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే మరి ఆకాశంలో ఎగిరే విమానాల సంగతి ఏంటి.. వీటికి హెడ్‌లైట్లు ఉంటాయా అంటే.. ఉంటాయనే సమాధానం వస్తుంది.

రోడ్డుపై ప్రయాణించే వాహనాల మాదిరిగానే విమానాలకు కూడా హెడ్‌లైట్లు ఉంటాయి. కానీ రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనాల్లో హెడ్‌లైట్లను ఉపయోగించే విధంగా విమానాల్లో హెడ్‌లైట్లను ఉపయోగించరు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విమానం హెడ్‌లైట్లను ఉపయోగిస్తారు. ఆ ప్రత్యేక పరిస్థితులు ఏంటి.. ఈ కథనంలో తెలుసుకుందాం..
విమానాలకు హెడ్‌లైట్లు ఎందుకు ఉంటాయి: విమానం హెడ్‌లైట్‌లు(Airplanes Headlights Purpose) రోడ్డుపై ఉన్నప్పుడు కార్లపై చూసే వాటిలానే ఉంటాయని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఆ ఊహ నిజం కాదు. విమానాలు హెడ్‌లైట్‌లను కలిగి ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలు ఉంటాయి. విమానాలు రన్‌వేపైకి దిగడానికి సిద్ధమవుతున్నప్పుడు ఇతర విమానాలను ఢీకొనకుండా ఉండేందుకు పైలట్‌లు హెడ్‌లైట్లను ఆన్ చేస్తారు.

విమానాలు హెడ్‌లైట్స్‌తో ఎగురుతాయా.?: టేకాఫ్ అయ్యేటప్పుడు పైలట్లు విమానాల హెడ్‌లైట్‌లను ఆన్ చేస్తారు. ఎయిర్ ట్రాఫిక్, 10,000 అడుగుల దిగువన ఎగురుతున్నప్పుడు మరియు టేకాఫ్‌లు మరియు ల్యాండింగ్‌ల సమయంలో విమాన హెడ్‌లైట్లను ఆన్ చేస్తారు.
ఫ్లైట్ లెవెల్స్‌ను మార్చేటప్పుడు కూడా పైలట్‌లు తమ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో హెడ్‌లైట్‌లను ఆన్ చేస్తారు. అంతే కాకుండా ఇతర విమానాలకు విజిబిలిటీలను పెంచడంలో హెడ్‌లైట్లు సహాయపడతాయి. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టులో ఉన్న సిబ్బందితో కమ్యూనికేట్ చేయడం సర్వసాధారణం కోసం విమానంలో హెడ్‌లైట్లను ఆన్ చేస్తారు.
విమానం ఇతర విమానాలు లేదా వాహనాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పుడు పైలట్లు విమానం హెడ్‌లైట్లను ఆన్ చేస్తారు. ఎప్పుడైనా ఒక విమానం ఆకాశంలోకి టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయినప్పుడు సాధారణంగా పైలట్లు తమ ల్యాండింగ్ లైట్లను ముందుగా ఆన్ చేసి సిబ్బందికి సిగ్నల్స్ ఇస్తార.
విమానంలో హెడ్‌లైట్‌లను ఏమని పిలుస్తారు: విమానాల్లోని హెడ్‌లైట్‌లను సాధారణంగా ల్యాండింగ్ లైట్లుగా పేర్కొంటారు. పైలట్లు ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్నప్పుడు హెడ్‌లైట్లను ఉపయోగిస్తారు. కాగా రాత్రి సమయంలో మొదటిసారిగా విమాన ప్రయాణం చేసేటప్పుడు.. ఆకాశంలోని చీకటిని, నక్షత్రాలను విమానం విండోలలోంచి చూడటానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.
అయితే ఇక్కడే ప్రయాణికులకు ఓ సందేహం కూడా వస్తుంది. రాత్రి సమయాల్లో విమానాన్ని నావిగేట్ చేయడం పైలట్లకు కష్టంగా ఉంటుంది కదా.. ఇందుకోసమే నావిగేషన్, వాతావరణ సెన్సార్ల ద్వారా పైలట్లు సురక్షితంగా విమానాలను నావిగేట్ చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తారు. కాగా సాధారణ హెడ్‌లైట్‌లతో పోల్చితే విమానం హెడ్‌లైట్‌లు చిన్నగా, తక్కువగా ఉంటాయి. అవి 8 అంగుళాల వెడల్పుతో 600-వాట్ బల్బులతో ప్రకాశవంతంగా ఉంటాయి.
కాగా విమానం ఎగురుతున్నప్పుడు పైలట్‌లు మేఘాలను ఎదుర్కొన్నప్పుడు, వారు మేఘాలను చూడలేరు. ఇలాంటి సమయాల్లో వారికి మార్గనిర్దేశం చేసేందుకు నావిగేషనల్ వనరులను సూచించిన విధంగా పైలట్లు చర్యలు తీసుకుంటారు. వాటిలో ఎయిర్‌స్పీడ్ డిస్‌ప్లే, కంపాస్ మరియు ఆర్టిఫిషియల్ హోరిజోన్ వంటి ఫీచర్లు ఉంటాయి.


Click it and Unblock the Notifications








