టైర్లే కదా అని నిర్లక్ష్యం చేయకండి..! ఈ చిట్కాలను పాటిస్తే టైర్లు పేలడాన్ని అరికట్టవచ్చు..!!

కారు చక్కగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన ఇంజన్ ఎంత అవసరమో ఆరోగ్యకరమైన టైర్లు కూడా అంతే అవసరం. ఏ వాహనంలోనైనా సరే టైర్లు చాలా కీలకమైన భాగాలు. అయితే, చాలా మంది వీటి గురించి తరచుగా పట్టించుకోరు. ఫలితంగా ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. ఆటోమొబైల్ భద్రతలో టైర్ల ప్రాముఖ్యత చాలా ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఇది రహదారితో నేరుగా సంబంధం కలిగి ఉన్న వాహనం యొక్క ఏకైక భాగం. కాబట్టి, వాహనాల టైర్ల విషయంలో వాటి వినియోగదారులు తప్పనిసరిగా ప్రత్యేక జాగ్రత్త వహించాలి.

టైర్లే కదా అని నిర్లక్ష్యం చేయకండి..! ఈ చిట్కాలను పాటిస్తే టైర్లు పేలడాన్ని అరికట్టవచ్చు..!!

వాహన టైర్ల విషయంలో అప్రమత్తంగా లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు ఓ కారు వేగంతో ప్రయాణిస్తూ, ఆ సమయంలో అకస్మాత్తుగా కారు టైర్లలో ఒకటి పగిలిపోయిందని ఊహించుకోండి. ఇది కేవలం ఊహే అయినప్పటికీ, అది చాలా భయపెట్టేదిగా ఉంటుంది. టైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే, నిజ జీవితంలో అది ఓ విపత్తుగా పరిణించే ప్రమాదం ఉంటుంది. అయితే, ఈ చిన్న చిట్కాలను మరియు ముందస్తు జాగ్రత్తలను పాటించడం ద్వారా మీరు ఈ ప్రమాదం నుండి గట్టెక్కవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం రండి.

టైర్లే కదా అని నిర్లక్ష్యం చేయకండి..! ఈ చిట్కాలను పాటిస్తే టైర్లు పేలడాన్ని అరికట్టవచ్చు..!!

టైర్లో గాలిని క్రమం తప్పకుండా చెక్ చేయండి

టైర్ల జీవితం కాలం పెరగాలన్నా, టైర్లు త్వరగా పంక్చర్ కాకుండా ఉండాలన్నా, వాహనాల మైలేజ్ పెరగాలన్నా వాటిలో ఎల్లప్పుడూ తగినంత గాలి ఉండటం ఎంతో అవసరం. కాబట్టి, వాహనాన్ని బయటకు తీసిన ప్రతిసారి టైర్లపై ఓ లుక్కేయడం చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వలన టైర్ల పరిస్థితి గురించి మనకు ఓ అవగాన వస్తుంది. టైర్లలో గాలి తగ్గినట్లుగా అనిపిస్తే, వెంటనే వాటిలో తగిన మోతాదులో గాలిని నింపించాలి. మీ సమీపంలో ని పంక్చర్ షాపులో అయినా సరే లేదా మీ వద్ద ఉండే ఎయిర్ పంప్ కిట్ సాయంతో అయినా సరే ఈ పని చేయవచ్చు.

టైర్లే కదా అని నిర్లక్ష్యం చేయకండి..! ఈ చిట్కాలను పాటిస్తే టైర్లు పేలడాన్ని అరికట్టవచ్చు..!!

ఈ రోజుల్లో విక్రయించబడే అనేక మోడ్రన్ కార్లు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) తో వస్తున్నాయి. ఇది టైర్లలో ఉండే గాలి పీడనాన్ని డ్రైవర్‌కు తెలియజేస్తుంది. ఇందుకోసం టైర్లలో ప్రెజర్ సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. ఇవి టైర్లలోని గాలి వత్తిడిని కొలిచి, డ్యాష్‌బోర్డులోని స్క్రీన్‌పై ప్రదర్శింపజేస్తాయి. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్. అయితే, అన్ని కార్లలో ఇలాంటి ఫీచర్ అందుబాటులో లేదు. కానీ, థర్డ్ పార్టీ యాక్ససరీ రూపంలో దీనిని మీ కారులో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కారులోని నాలుగు టైర్లలో ఎల్లప్పుడూ గాలి ఒకే మోతాదులో ఉండేలా చూసుకోవాలి.

టైర్లే కదా అని నిర్లక్ష్యం చేయకండి..! ఈ చిట్కాలను పాటిస్తే టైర్లు పేలడాన్ని అరికట్టవచ్చు..!!

ఎక్కువ కాలం పాటు కారును పార్క్ చేయవద్దు

ఒకవేళ మీరు ఎక్కువ కాలం పాటు వాహనాన్ని ఉపయోగించకుండా ఒకే ప్రాంతంలో పార్క్ చేసినా కూడా టైర్లు పాడయ్యే అవకాశం ఉంది. కారును ఎక్కువసేపు కదలకుండా పార్క్ చేయడం వల్ల భూమిని తాకే స్థానంలో ఉన్న టైర్ వాల్ కాలక్రమేణా బలహీనపడుతుంది. టైర్ వాల్ బలహీనత కారణంగా నేలను తాకి ఉన్న ప్రాంతంలో టైరు మెత్తగా మారిపోతుంది. ఇలా మెత్తబడిన టైరుతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టైర్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది.

టైర్లే కదా అని నిర్లక్ష్యం చేయకండి..! ఈ చిట్కాలను పాటిస్తే టైర్లు పేలడాన్ని అరికట్టవచ్చు..!!

టైర్లలో మోతాదుకి మించి ఎక్కువ గాలిని నింపకండి

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టైర్ పగిలిపోవడానికి మరొక కారణం వాటిలో అధిక గాలిని నింపడం. చాలా మంది కారులో అధిక లోడ్‌తో ప్రయాణించాలనుకునేటప్పుడు దానికి అనుగుణంగా టైర్లలో ఎక్కువ గాలిని నింపేందుకు ప్రయత్నిస్తుంటారు. వాస్తవానికి, తయారీదారులు రేట్ చేయబడిన లోడ్ రేటింగ్‌కు మించి ఎక్కువ ఎయిర్ ను లోడ్ అంత సురక్షితమైన పద్ధతి కాదు. మీ వాహనంలో భారీ లోడ్‌లను రవాణా చేయడానికి ముందు మీరు మీ కారు టైర్ల యొక్క లోడ్ రేటింగ్‌ను అర్థం చేసుకోవడం చాలా అవసరం.

టైర్లే కదా అని నిర్లక్ష్యం చేయకండి..! ఈ చిట్కాలను పాటిస్తే టైర్లు పేలడాన్ని అరికట్టవచ్చు..!!

ఉబ్బిన టైర్లతో డ్రైవ్ చేయవద్దు

ఉబ్బెత్తుగా ఉన్న టైర్లతో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం మరియు అది ఏ సమయంలోనైనా పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు మాత్రమే ప్రమాదంలో పడకుండా, మీ కారు నుండి పేలిన టైరు కారణంగా రోడ్డుపై వెళ్లే ఇతరులు కూడా ప్రమాదబారిన పడే అవకాశం ఉంది. టైర్లు ఉబ్బడం అనేది టైర్ వాల్ లపై బలహీనమైన విభాగాల కారణంగా ఏర్పడతాయి మరియు టైరులోని గాలి ఆ బలహీనమైన ప్రదేశం గుండా తప్పించుకునే ఒత్తిడిని సృష్టించడం వలన ఉబ్బిన ప్రాంతంలో టైర్లు పేలే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి, టైర్లు ఉబ్బినట్లుగా అనిపిస్తే, తక్షణమే వాటిని మార్చేయండి.

టైర్లే కదా అని నిర్లక్ష్యం చేయకండి..! ఈ చిట్కాలను పాటిస్తే టైర్లు పేలడాన్ని అరికట్టవచ్చు..!!

రీత్రెడెడ్ టైర్లను ఉపయోగించవద్దు

పాత టైర్లను తిరిగి కొత్త వాటిలా కనిపించేందుకు కొందరు వాటిని రీత్రెడ్ చేస్తారు. అంటే, అరిగిపోయిన టైర్లకు తిరిగి గాట్లు పెట్టి కొత్త వాటిలా తయారు చేస్తారు. వాస్తవానికి, రీత్రెడెడ్ టైర్లు కొత్త టైర్ల కంటే చాలా చౌకైనవి మరియు అరిగిపోయిన టైర్ల కంటే కొంచెం మెరుగైనవే అయినప్పటికీ, భద్రతా ప్రమాణాల విషయానికి వస్తే, ఈ టైర్లు కాలక్రమేణా బలహీనపడటం మరియు టైర్ పగిలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి, అవి కొత్త టైర్లకు ఏమాత్రం దగ్గరగా ఉండవు. చవకకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.

Most Read Articles

English summary
Do not neglect your car tires follow these simple tips to avoid a tyre burst while driving
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X