ట్రాఫిక్ పోలీసులకు మీ వాహనాల కీస్, టైర్లలో గాలి తీసే పవర్ ఉంటుందా ? ఇది తెలిస్తే మీ జేబుకు చిల్లు పడదు!

మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుంటే భయపడుతున్నారా? మీ వాహనం కీస్ లాగేసుకుంటారేమో, లేకపోతే టైర్లలో గాలి తీసేస్తారేమో అని ఆందోళన చెందుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ట్రాఫిక్ పోలీసులకు మీ వాహనంపై ఎలాంటి అధికారం ఉంటుందో, ఏ రూల్స్ పాటించాలో ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలిస్తే మీరు ధైర్యంగా ఉండొచ్చు.

ట్రాఫిక్ పోలీసులకు మీ వాహనంపై ఎంత అధికారం ఉంది?
రోడ్డుపై క్రమశిక్షణ, భద్రతను కాపాడటం ట్రాఫిక్ పోలీసుల బాధ్యత. అందుకే వారు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి చలాన్‌లు జారీ చేస్తారు. అయితే, చాలా మందికి ట్రాఫిక్ పోలీసులు వాహనం కీస్ లాగేసుకోవడం లేదా టైర్లలో గాలి తీసేయడం వంటివి చేస్తారేమో అనే అనుమానం ఉంటుంది. కానీ, నిజానికి వారికి అలాంటి అధికారం లేదని మోటార్ వెహికల్ చట్టం చెబుతోంది.

Do Traffic Police Have Authority Over Your Vehicle Know Your Rights

కీస్ లాగడం, టైర్లలో గాలి తీయడం చట్టవిరుద్ధం
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. ఏ ట్రాఫిక్ పోలీసు అధికారికి కూడా మీ వాహనం కీస్ లాగడానికి లేదా టైర్లలో గాలి తీసేయడానికి అధికారం లేదు. ఇలాంటి చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధం. ఒకవేళ మీకు ఇలా జరిగితే, వెంటనే ఆ సంఘటనను వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ రూల్ గురించి చాలామందికి తెలియదు. అందుకే పోలీసులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బెదిరిస్తుంటారు. కానీ, దాని అర్థం మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం మొదలుపెట్టాలని కాదు.

ఎవరు చలాన్ జారీ చేయవచ్చు?
భారతీయ మోటార్ వెహికల్ యాక్ట్, 1932 ప్రకారం.. అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) లేదా అంతకంటే ఉన్నత స్థాయి అధికారులు మాత్రమే చలాన్ జారీ చేయగలరు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వారికి సహాయం చేయడానికి మాత్రమే ఉంటారు. వారికి స్పాట్ ఫైన్ వేసే అధికారం లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఇన్సూరెన్స్, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ (PUC) వంటి డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవడం తప్పనిసరి.

Do Traffic Police Have Authority Over Your Vehicle Know Your Rights

చలాన్ జారీ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, పోలీసులు చలాన్ జారీ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి.

చలాన్ బుక్ లేదా ఈ-చలాన్ మెషీన్: ఫైన్ వేయడానికి పోలీసు అధికారి వద్ద తప్పనిసరిగా చలాన్ బుక్ లేదా ఈ-చలాన్ మెషీన్ ఉండాలి. ఇవి లేకుండా ఫైన్ వేయడం చట్టవిరుద్ధం.

యూనిఫామ్, ఐడీ: ట్రాఫిక్ పోలీస్ అధికారి యూనిఫామ్‌లో ఉండాలి, దానిపై వారి పేరు ఉండాలి. ఒకవేళ వారు సివిల్ దుస్తులలో ఉంటే, వారి ఐడీ కార్డు చూపించమని మీరు అడగవచ్చు.

Do Traffic Police Have Authority Over Your Vehicle Know Your Rights

అధికారం: ఒక హెడ్ కానిస్టేబుల్ గరిష్టంగా రూ.100 మాత్రమే ఫైన్ విధించగలడు. ఏఎస్ఐ లేదా సబ్-ఇన్‌స్పెక్టర్ మాత్రమే రూ.100 కంటే ఎక్కువ ఫైన్ విధించగలరు.

రసీదు: చలాన్ జారీ చేసినప్పుడు, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. మీ దగ్గర ఫైన్ అమౌంట్ లేకపోతే, మీరు దాన్ని తర్వాత కూడా చెల్లించవచ్చు. అలాంటి సందర్భంలో కోర్టు మీకు చలాన్ జారీ చేయవచ్చు. అలాగే, పోలీసు అధికారి మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకోవచ్చు.

వాహనం టోయింగ్ నియమాలు
మీ వాహనం తప్పుడు చోట పార్క్ చేసినా, మీరు వాహనంలో ఉంటే ట్రాఫిక్ పోలీసులు టో చేయలేరు. వాహనంలో ఎవరూ లేకపోతే మాత్రమే టోయింగ్ యాక్షన్ తీసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 23, 2025, 12:30 [IST]
English summary
Do traffic police have authority over your vehicle know your rights
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+