కారులో హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ ఉందా.. ఎంత భద్రతను ఇస్తుందో తెలుసా?

ప్రస్తుతం కార్లు కొనుగోలు చేస్తున్న వారిలో చాలా మంది మైలేజ్‌ సహా భద్రతా ఫీచర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా కార్ల తయారీ సంస్థలు కూడా ప్రయాణికుల భద్రత కోసం అనేక సెక్యూరిటీ ఫీచర్లు అందిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌. ఈ ఫీచర్‌ నిటారుగా ఉన్న రోడ్లపై సురక్షితమైన ప్రయాణానికి సహకరిస్తుంది.

హిల్‌ డిసెంట్ కంట్రోల్‌ ఫీచర్‌ వాహనం నిర్ణీత వేగంలోపు ఉన్న సందర్భంలో పనిచేస్తుంది. ఏటవాలు రోడ్లపై వాహనంలో సురక్షితంగా ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌తోపాటు ట్రాక్షన్‌ కంట్రోల్‌, యాంటీ లాక్‌ బ్రేక్ ఇదే పనితీరును కనబరుస్తాయి. సాధారణ రోడ్లపైకి వచ్చినప్పుడు హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌ను (HDC) ఆఫ్‌ చేసిన వాహన వేగాన్ని పెంచవచ్చు.

Hill descent control must know the features

వాహనాల్లో ఉండే ADAS వంటి భద్రతా ఫీచర్లు మాదిరిగానే.. HDC కూడా డ్రైవర్‌ మ్యాన్యువల్‌గా చేసే పనులను ఆటోమేట్‌ చేస్తుంది. అంటే ఏటవాలు రోడ్లపై వాహనం ట్రాక్షన్‌ కోల్పోకుండా వాహన వేగాన్ని నియంత్రిస్తుంది. సాధారణంగా డ్రైవర్లు బ్రేకులతో ట్రాక్షన్‌ను సాధిస్తారు. HDC, ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ కూడా ఇదే తరహా పనిచేస్తాయి.

హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌ ABSతో ఇంటర్‌ఫేస్‌ చేయగలదు. డ్రైవర్‌ అవసరం లేకుండా వాహనాన్ని నియంత్రించగలదు. ప్రతి వీల్‌ను నియంత్రించవచ్చు. మరియు ట్రాక్షన్‌ను కోల్పోకుండా చూస్తుంది. కార్ల సంస్థలకు అనుగుణంగా ఈ హిల్‌ డిసెంట్‌ కంట్రోల్ ఫీచర్‌ కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ పనిచేయాలంటే వాహన వేగం నిర్ధిష్ట పరిమితి కంటే తక్కువగా ఉండాలి. అయితే చాలా మంది నిపుణులు ఈ వేగం 24-32km మధ్య ఉండాలని సూచిస్తారు.

Hill descent control must know the features

ఉదాహరణకు నిస్సాన్‌ ఫ్రాంటియర్‌.. గేర్‌ సిట్టింగ్‌పై ఆధారపడి ఉంటుంది. HDCని యాక్టివేట్‌ చేసేందుకు ముందు వాహనం తప్పనిసరిగా ఫార్వర్డ్‌ లేదా రివర్స్ గేర్‌లో ఉండాలి. అయితే అన్ని షరతులు అమల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ అవుతుంది. కారు తయారీ సంస్థ బట్టి, బటన్‌ సెంటర్ కన్సోల్‌, ఇన్ర్టుమెంట్‌ క్లస్టర్‌ కింద లేదా మరెక్కడైనా ఉండవచ్చు.

నిస్సాన్‌ వంటి కొన్ని వాహన తయారీ సంస్థ సాధారణ బటన్‌కు బదులుగా రాకర్ స్విచ్‌ని ఉపయోగిస్తున్నారు. యాక్టివేషన్‌ తర్వాత, ప్రతి సిస్టమ్‌ కొద్దిగా భిన్నంగా పనిచేస్తుంది. కొన్ని క్రూయిజ్‌ కంట్రోల్‌ బటన్‌ ద్వారా కూడా వేగాన్ని నియంత్రించవచ్చు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న చాలా కార్లలో స్టాండర్డ్‌ సెక్యూరిటీ ఫీచర్లను తయారీ సంస్థ అందిస్తున్నాయి.

హై అండ్‌ మోడళ్లు అదనపు ఎయిర్‌బ్యాగ్స్ ABS, ADAS సహా మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. ప్రమాదాల జరగకుండా ఈ ఫీచర్లు చాలా వరకు ప్రయాణికులను కాపాడుతున్నాయి. క్రాష్‌ టెస్టులు సహా ఈ సెక్యూరిటీ ఫీచర్ల ఆధారంగా కార్లు రేటింగ్‌ను పొందుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, August 19, 2023, 19:37 [IST]
English summary
Do you know about hill descent control must know the features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+