Atal Setu భారత్‌లోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన గురించి తెలుసా...? నిర్మాణానికి రూ.17,843 కోట్ల వ్యయం ..!!

భారత్‌లో అతి పొడవైన సముద్ర వంతెనను త్వరలో ప్రారంభం కానుంది. ముంబైలో నిర్మించిన ఈ అటల్ సేతు (ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌) ను ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 12న ప్రారంభించనున్నారు. ముంబైలోని సెవ్రి నుంచి నేవి ముంబయిలోని చిర్లే ప్రాంతాల మధ్య నిర్మాణం చేపట్టారు.

రూ.17 వేలకోట్లతో నిర్మాణం : ఈ అటల్‌ సేతును (Atal setu) 21.8 పొడవునా నిర్మించారు. ఈ వంతెన ప్రారంభం అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 30 కిలోమీటర్ల తగ్గింది. మరియు కేవలం 16 నిమిషాల్లో సెవ్రి నుంచి చిర్లే ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ అటల్‌ సేతును 6 లేన్‌గా నిర్మించారు. 16.50 కి.మీ సముద్రంలో, 5.50 కి.మీ భూమిపైన నిర్మాణం చేపట్టారు. రూ.17,843 కోట్లను నిర్మాణం చేపట్టారు.

india longest sea bridge

వంతెనపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరాలు : ఈ వంతెనపై ప్రతిరోజు 70 వేలకు పైగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అటల్‌ వంతెనపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరాలను అమర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఈ వంతెనపై ప్రయాణం చేసే వాహనాల నుంచి టోల్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారు. కార్లకు రూ.500 చొప్పున వసూలు చేయాలని జపాన్‌ ఇంటర్నేషన్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ ప్రతిపాదనలు పంపింది.

sea bridge atal setu inaugaration date

30 సంవత్సరాలపాటు టోల్‌ ఛార్జీల వసూలు : అయితే పట్టణాభివృద్ధి శాఖ మాత్రం రూ.250 వసూలు చేయాలని నిర్ణయించింది. వంతెన ప్రారంభం నుంచి తొలి 30 సంవత్సరాలకు ఈ వంతెనపై ప్రయాణానికి టోల్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారు. మినీ బస్సుకు ధర రూ.560, 2 యాక్సిల్ ట్రక్కులకు రూ.1,180, 3 యాక్సిల్‌ ట్రక్కులకు రూ.1290, 4-6 యాక్సెల్‌ వాహనాలకు రూ.1850 వసూలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యం : ఈ అటల్‌ సేతు నిర్మాణం 2018లోనే ప్రారంభం అయింది. 2022 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఆలస్యమైంది. నిర్మాణం పూర్తయిన తర్వాత డిసెంబర్‌ 25, 2023లోనే ప్రారంభించాలని భావించారు. అయితే కొన్ని పనులు పెండింగ్‌లో ఉండడం కారణంగా వాయిదా వేసి, జనవరి 12న ప్రారంభించనున్నారు.

mumbai-trans-harbour-link-3

ఈ వంతెనకు మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి పేరు పెట్టారు. ఇది మహారాష్ట్రలోని రెండు ప్రధాన ప్రాంతాలను కలిపే ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానించబడి ఉంటుంది. ఈ అటల్ వంతెన ద్వారా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి జరుగుతుందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, January 5, 2024, 19:07 [IST]
English summary
Do you know about longest sea bridge mumbai trans harbour link
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+