BMW అంటే తెలుసా.. దాన్ని మీరు స్పష్టంగా పలకలేరని తెలుసా..?

మీకు నచ్చిన కారు ఏంటి అంటే, కొనేంత స్తోమత మనకు ఉన్నా లేకున్నా కొన్ని పేర్లు చకచకా చెప్పేస్తాం. ఆ లిస్ట్‌లో BMW కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కారు ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. అయితే మీకు అసలు BMW అంటే ఏంటో తెలుసా.. ఆ కారు పూర్తి పేరు ఎప్పుడైనా తెలుసుకొనే ప్రయత్నం చేశారా..? ఒకవేళ పూర్తిపేరు తెలుసుకున్న దాన్ని స్పష‌్టంగా పలకలేరని మీకు తెలుసా..?

ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్‌ సహా ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ సంస్థ తన కార్లను విక్రయిస్తుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఉదాహరణకు సొంత కారు ఉన్నవారికి మనం మీరు ఏ కారు వినియోగిస్తున్నారని అడిగితే వారు కారు మోడల్‌ సహా చెప్తారు. మహేంద్రా కారు వారు వినియోగిస్తుంటే XUV 700, XUV 500 ఇలా మోడల్‌ పేరు చెబుతారు.

bmw

అదే Tata సంస్థ కార్ల వినియోగదారులు Nexon లేక Altroz వంటి కార్లును వినియోగిస్తుంటే ఆ పేర్లనే చెబుతారు. కానీ టాటా కారును వినియోగిస్తున్నా అని మాత్రం చెప్పరు. అదే మీరు BMW కారు వినియోగిస్తున్నవారు మాత్రం మోడల్‌తో సంబంధం లేకుండా కేవలం బీఎండబ్ల్యూ అనే చెబుతారు. అంటే ఆ కారు ఏ పేరుతో లాంచ్‌ చేసినా అందరూ సంస్థ పేరునే చెబుతారు. ఆ పేరు అంత ఫేమస్‌ మరి.

అయితే BMW పేరుతో చాలా కార్లు రోడ్లుపైకి వస్తున్నా.. అందులో ఆ కారు మోడల్‌ ఏంటో చాలా మందికి తెలియదు. అయితే BMW 3 సిరిస్‌, BMW 5 సిరిస్‌, BMW X5, BMW X1, BMW 7 సిరిస్‌, BMW XM, BMW i4 వంటి చాలా కార్లే ఉన్నాయి. కానీ చాలా వరకు బీఎండబ్ల్యూ అనే చెబుతారు.

బీఎండబ్ల్యూ జర్మనీకి చెందిన కార్లు, బైక్స్ తయారీ సంస్థ. 1916లో జర్మనీలోని మ్యూనిచ్ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటైన మొదట్లో విమానాల ఇంజిన్లను తయారుచేసేది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో అంటే 1917 నుంచి 1918 మరియు 1933 నుంచి 1945 సంవత్సరం మధ్యకాలంలో ఈ సంస్థ విమానాల ఇంజిన్లను తయారుచేసేది.

బీఎండబ్ల్యూ, మినీ, రోల్స్‌ రోయిస్‌ పేర్లతో ఈ సంస్థ కార్లను విక్రయిస్తుంది. మోటార్‌ సైకిళ్లను BMW మెక్సికో బ్రాండ్‌తో విక్రయాలు చేస్తోంది. జర్మనీ సహా బ్రెజిల్‌, చైనా, ఇండియా, మెక్సికో, నెదర్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్‌, అమెరికాలో ఈ సంస్థ తన కార్లను ఉత్పత్తి చేస్తోంది.

అసలు బీఎండబ్ల్యూ అంటే జర్మనీ భాషలో.. బేయిరిస్చే మోటోరెన్‌ వర్కే జిఎంబీహెచ్‌ (Bayerische Motoren Werke GmbH), అంటే ఇంగ్లీష్‌లో బవేరియన్ ఇంజిన్‌ వర్క్స్ కంపెనీ అని అర్థం. BMW సంస్థ బవేరియా రాష్ట్రంలో ఏర్పాటుచేశారు కనుక మొదటి పదంగా దాన్ని ఉంచారు. స్వతహాగా ఇంజిన్‌ తయారీ సంస్థ కాబట్టి రెండో పదం మోటర్‌. 1981లో సంస్థ పేరులో కొద్ది మార్పులు చేశారు. ప్రస్తుతం BMW - Bayerische Motoren Werke GmbH తోనే సంస్థ తన కార్యకలాపాలను సాగిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 25, 2023, 11:23 [IST]
English summary
Do you know BMW full form and many unable to pronounce correctly
Read more on: #automobile #bmw
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+