Vande Bharat వందే భారత్‌ రైళ్లను ఎలా తయారు చేస్తున్నారో తెలుసా.. ?

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ భారత్‌ సొంతం. వేగం, సౌకర్యాల పరంగా భారత్ రైల్వేవ్యవస్థ ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉంది. ఈ పరిస్థితులను మెరుగుపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 75 రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యం నిర్దేశించుకుంది.

తొలిసారిగా ఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్‌- వారణాసి మార్గంలో 2019 ఫిబ్రవరి 15న వందే భారత్‌ రైలును ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రైళ్లకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 17 రైళ్లను ప్రవేశపెట్టారు. అయితే ఈ రైళ్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు.

Vande Bharat trains

చెన్నైలోని పెరంబలూరు ఐసీఎఫ్‌ ఫ్యాక్టరీలో వందే భారత్‌ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ రైళ్ల కోసం ప్రత్యక విభాగం ఉంది. ప్రస్తుతం వందే భారత్‌ రైలు ఇంజిన్‌ నుంచి కోచ్ వరకు పూర్తి చేసేందుకు 2 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.

సాధారణ రైళ్లలో 24 కోచ్‌లు ఉంటాయి. అదే వందేభారత్‌లో కేవలం 16 బోగీలు మాత్రమే ఉంటాయి. కార్లు, సహా ఇతర వాహనాలను తయారుచేసినప్పుడు తొలుత ఫ్రేమ్‌ను సిద్ధం చేస్తారు. అలాగే వందే భారత్‌ రైళ్లను తయారుచేస్తున్నప్పుడు కూడా తొలుత ఫ్రేమ్‌ను తయారుచేస్తారు. అనంతరం ఫ్రేమ్‌పై ఇతర నిర్మాణాలు చేపడతారు. అదే సమయంలో మరో బృందం రైలు కోచ్‌ సైడ్‌ వాల్స్‌ను సిద్ధం చేస్తుంది. ఆటోమేటిక్‌ రోబోట్‌ లేజర్‌ టెక్నాలజీని వినియోగిస్తారు.

Vande Bharat trains

వెల్డింగ్‌ పని పూర్తియిన తర్వాత కోచ్‌ సైడ్‌ వాల్‌కు రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు పాస్‌ అయితేనే అసెంబ్లీ లైన్‌కు పంపిస్తారు. అనంతరం కూడా కొన్ని వెల్డింగ్‌ పనులు ఉంటాయని ఫ్యాక్టరీ కార్మికులు చెబుతున్నారు. అదేవిధంగా సీట్ల ఫిక్సింగ్ చేయడం, హ్యాంగర్లు.. కోచ్‌ పూర్తి ఆకారం వచ్చాక అమర్చబడతాయి. ఈ పనులు అన్ని ముగిశాక పెయింటింగ్‌కు పంపిస్తారు. పెయింట్‌ పని పూర్తయ్యాక ఇంజిన్‌, సీట్లు, ఇతర ప్యానల్లను అమర్చే పని ప్రారంభిస్తారు.

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వందే భారత్‌ అనేక అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. వందే భారత్‌ ఆటోమేటిక్ డోర్ల నియంత్రణ పూర్తిగా డ్రైవర్‌ వద్దనే ఉంటుంది. ప్లాట్‌ఫారమ్‌ ఉన్న చోట మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. మరియు తలుపులు మూసిన అనంతరమే రైలు ప్రారంభం అవుతుంది.

Vande Bharat trains

వందే భారత్‌ రైలు 160 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు. కానీ మనం దేశంలో రైల్వే ట్రాక్‌ల గరిష్ఠ వేగం ప్రస్తుతం 130 కి.మీ మాత్రమే ఉంది. ప్రస్తుతం సుమారు 30 వేల కిలో మీటర్ల మేర ట్రాక్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు సమాచారం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 7, 2023, 13:39 [IST]
English summary
Do you know how vande bharat trains are manufacturing in chennai icf
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+