భారత్‌లో వాహనాల్లో లిఫ్ట్ ఇవ్వడం కూడా నేరమని తెలుసా.. ?
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు కొంచెం సరళంగా ఉంటుంది. అయితే భారత్‌లో చాలా మందికి తెలియని కొన్ని కఠిన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయనప్పటికీ ఉనికిలో ఉన్నాయి. అయితే మనకు తెలియని నిబంధనలు కారణంగా జరిమానా విధించిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.
ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా పార్కింగ్ చేయడం కూడా నేరమని మీకు తెలుసా.. అవును ఇటువంటి నిబంధన కూడా ఉంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రూ.100 జరిమానా విధించే అవకాశం ఉంది. పార్కింగ్ ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే అవగాహన లేకపోవడంతో చాలా తక్కువ మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదుచేస్తారు.

ప్రయాణం చేస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రథమ చికిత్స అందించడంతో డ్రైవర్ విఫలం అయితే, వారికి మూడు నెలలవరకు జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నిబంధన ప్రతి వాహనంలో ప్రథమ చికిత్స పరికరాలు ఉండే విధంగా నిర్ధారణ చేస్తుంది. అయితే ఈ నిబంధన కోల్‌కతా, చెన్నై నగరాల్లోనే ఉనికిలో ఉంది.
ఢిల్లీ, NCR (జాతీయ రాజధాని ప్రాంతం) ప్రాంతాల్లో కారులో సిగరెట్ కాల్చిడం చట్టవిరుద్ధం. అలాగే పార్కింగ్ ప్రాంతాల్లో ఉన్న వాహనాల్లో కూర్చొని సిగరెట్ కాల్చినా నిబంధనలు ఉల్లఘించినట్టే. ఇందుకు పోలీసులు రూ.100 వరకు జరిమానా విధించవచ్చు. ఈ నిబంధన కారణంగా బహిరంగ ప్రాంతాల్లో సిగరెట్ కాల్చడాన్ని నియంత్రించవచ్చు.

ఇతరుల వాహనాలను అవసరాల కోసం వినియోగించుకుంటున్నప్పుడు, కచ్చితంగా వాహన యజమానికి విషయం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు స్నేహితుడు వాహనాన్ని తీసుకుంటే.. ఆ వాహనం అతని పేరు మీద ఉంటే ఎటువంటి సమస్యలేదు. అదే అతని తండ్రి పేరుమీద రిజిస్ట్రర్ అయితే మాత్రం.. అతనికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది.
తనిఖీల సమయంలో ఇలాంటి ఘటనల కారణంగా పట్టుబడితే మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా విదించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన చెన్నైలో ఉంది. దొంగతనాలను నిరోధించడమే లక్ష్యంగా చెన్నై నగరంలో ఈ తరహా నిబంధన విధించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కొన్ని కార్లలో టీవీలు లేదా వీడియో ప్లేయింగ్ పరికరాలను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. అయితే ముంబైలో వాహనాల డ్యాష్‌బోర్డులో ఇలాంటి పరికరాలను ఇన్‌స్టాల్ చేయడం చట్టవిరుద్ధం. పోలీసులు తనిఖీల్లో పట్టుబడితే గరిష్ఠంగా రూ.100 జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఇటువంటి పరికరాల కారణంగా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం తక్కువగా ఉంటుంది.
రోడ్లు లేదా పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను ఆన్ చేసి (Idle) వదిలివేయడం కూడా నేరం. ఈ ఘటన కింద రూ.100 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వాహన ఇంధనం ఆదా చేయడానికి లేదా పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ నిబంధన ఉపయోగపడుతుంది.

మనం చాలా సమయాల్లో ఇతర వాహనాల్లో లిఫ్ట్ అడిగి.. ప్రయాణాలు చేస్తుంటాం. అయితే తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరం. అపరిచిత వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తే.. మీ వాహనం టాక్సీగా ఉపయోగించినట్లు పరిగణించబడుతుంది. ఈ నిబంధన కింద రోడ్డు పక్కన వారికి లిఫ్ట్ ఇవ్వడం అనుమతించబడదు. దొంగతనాలు లేదా ప్రైవేటు వాహనాల దుర్వినియోగం కాకుండా ఈ నిబంధన పరిరక్షిస్తుంది.


Click it and Unblock the Notifications








