కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలో తెలుసా.. ఇలా చేస్తే ప్రమాదాలు జరగవు..!
సాధారణంగా చాలా కార్ల బ్యాటరీలు సుమారుగా 5 సంవత్సరాల పాటు ఎటువంటి సమస్యలు లేకుండా పనిచేస్తాయి. అయితే కొన్ని కారణాలు, వినియోగం వల్ల అంతకంటే ముందుగానే బ్యాటరీని మార్చవలసిన అవసరం రావొచ్చు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఆధునిక కార్లలో బ్యాటరీలు సర్జ్ ప్రొటెక్టర్లుగా పనిచేస్తాయి.
ఆధునిక కార్లలో బ్యాటరీలు ముఖ్యమైన విధులు నిర్వర్తిస్తాయి. అయితే బ్యాటరీలో ఏమైనా సమస్య తలెత్తితే గుర్తించడం కొన్నిసార్లు కష్టం, కానీ ఈ కిందన వివరించిన కొన్ని గుర్తుల ద్వారా బ్యాటరీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది. మరియు బ్యాటరీని ఎప్పుడు మార్చాలి అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

స్టార్టర్ క్రాంక్ : కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలి అనేది స్టార్టర్ క్రాంక్ పనితీరు ద్వారా గుర్తించవచ్చు. స్టార్టర్ మోటార్ సాధారణం కంటే కాస్త నెమ్మదిగా క్రాంక్ అవుతుంటే బ్యాటరీ బలహీనంగా ఉందని తొలుత అంచనాకు రావొచ్చు. అయితే ఈ సమస్య కొన్నిసార్లు మాత్రమే రావచ్చు. కానీ బ్యాటరీ సమస్యను ఇది స్పష్టం చేస్తుంది.
టేల్ లైట్లు : కారు స్టార్ట్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత టేల్ లైట్లు కొద్దిగా డిమ్‌గా ఉన్నట్లు అనిపిస్తే.. బ్యాటరీ బలహీనంగా ఉన్నట్లు అంచనాకు రావచ్చు. లైట్లు అదే కాంతితో వెలుగుతుంటే మాత్రం మీకు కొత్త బ్యాటరీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
హెడ్‌లైట్లు: కారు హెడ్‌లైట్లు సాధారణంగా ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఈ లైట్లు కాస్త డిమ్‌గా ఉంటే మాత్రం కారు బ్యాటరీని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తించవచ్చు. అయితే ఆల్టర్‌నేటర్ వల్ల కూడా హెడ్‌లైట్ల కాంతి తక్కువగా ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త బ్యాటరీ కొనుగోలు చేయడం కంటే ముందు నిపుణుడిని సంప్రదించడం మేలు. నిపుణుడు సూచనతో బ్యాటరీ మార్పుపై నిర్ణయం తీసుకోవాలి.

బ్యాటరీ పగుళ్లు లేదా లీక్: కారు బ్యాటరీ వద్ద పగుళ్లు లేదా లీకేజీలను గుర్తిస్తే మాత్రం సాధ్యమైనంత వేగంగా బ్యాటరీని మార్చాల్సి ఉంటుంది. లేదా మరింత డ్యామేజీ జరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కారు షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ప్రమాదాలు జరగక ముందే బ్యాటరీని మార్చాల్సి ఉంటుంది.
బ్యాటరీ హెచ్చరిక లైట్ : ఆధునిక కార్లు సక్రమంగా పనిచేసేందుకు వివిధ రకాలైన సెన్సార్లను కలిగి ఉంటాయి. కారులో బ్యాటరీ అత్యంత కీలకం కాబట్టి.. చాలా కార్లు ప్రస్తుతం బ్యాటరీ హెచ్చరిక లైట్‌ను కలిగి ఉంటున్నాయి. బ్యాటరీలో ఏదైనా సమస్య తలెత్తితే ఈ లైట్ వెలుగుతుంది. అలాంటి సమయాల్లో బ్యాటరీని తక్షణమే మార్చాల్సి ఉంటుంది.
కారులో బ్యాటరీ అత్యంత ముఖ్యమైన విభాగం కాబట్టి... ముందుగానే సమస్యలను గుర్తించాలి. పైన తెలిపిన కొన్ని చిట్కాలు మీరు బ్యాటరీని ఎప్పుడు మార్చాలనే నిర్ణయం తీసుకొనేందుకు ఉపయోగపడతాయి. మీ కారులో ఇటువంటి సమస్యలను గుర్తిస్తే వెంటనే కొత్త బ్యాటరీని కొనుగోలు చేయండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








