రైల్వే స్టేషన్లలో బోర్డులు పసుపు, నలుపు కలర్స్‌లో ఎందుకుంటాయో తెలుసా..? కారణం ఇదే..!
మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేశారా.. రైలు వెళ్తున్న సమయంలో పరిసరాలను గమనించే అలవాటు మీకు ఉందా.. అలాగే స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో అక్కడున్న గుర్తులు, వాటికున్న రంగుల అర్థాలేంటో తెలుసా, ఎప్పుడైనా తెలుసుకొనే ప్రయత్నం చేశారా.. ఏ స్టేషన్‌కు వచ్చామో తెలుసుకొనే బోర్డు పసుపు రంగులోనే ఎందుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.. పై పశ్నలకు మీకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదవండి.
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. దేశంలోని ప్రజలు సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు రైల్వేలను ఎక్కువగా ఎంచుకుంటారు. ఇలా లక్షలాది ప్రజలను రైల్వే గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. మీరు రైలు ప్రయాణం చేసినప్పుడు అక్కడున్న స్టేషన్ పేరు తెలిపే బోర్డు పసుపు రంగులో ఉండడం మీరు గమనించారా.. దానిపై పేర‌్లు నలుపు రంగులో ఉండటాన్ని గుర్తించారా..?

రైల్వే స్టేషన్‌లో ఉన్న ఈ రంగుల వెనుక శాస్త్రీయ కారణం ఉంది. ప్రస్తుతం ఉన్న ఏడు రంగుల్లో విజిబిలిటి స్పెక్ట్రమ్‌లోని Wave lenth (తరంగదైర్ఘ్యం) ఆధారంగా పసుపు రంగు మూడో స్థానంలో ఉంది. అంటే ఎంత తరంగదైర్ఘ్యం ఉంటే అంత దూరం నుంచి ఆ రంగును మనం గుర్తించవచ్చు.
ఎరుపు రంగు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అందువల‌్లనే ఎరుపు రంగు లైట్లను ట్రాఫిక్స్ సిగ్నల్స్ వద్ద వినియోగిస్తున్నారు. అయితే ఇది చదివాక.. ఎరుపు రంగును స్టేషన్ సైన్ బోర్డుల్లో ఎందుకు ఉపయోగించడం లేదని సందేహం మీకు కలిగే ఉంటుంది.
పసుపు రంగు యొక్క లేటరల్ పెరిఫెరల్ విజన్ ఎరుపు రంగు కంటే 1.24 రెట్లు ఎక్కువ. అంటే పసుపు రంగు మీ కంటి చూపు మార్గం (సరళ రేఖ)లో లేకపోయినా, చాలా దూరం నుంచి గమనించవచ్చు. దాంతోపాటు పసుపు రంగు చీకటిలో లేదా పొగమంచు వాతావరణంలోనూ కూడా గుర్తించవచ్చు. ఎందుకంటే వాతావరణంలో ఎరుపు రంగు కంటే పసుపు రంగు ఎక్కువగా వ్యాపిస్తుంది.
పసుపు, నలుపు రంగులు పరస్పర విరుద్దమైన రంగులు, అందువల్ల పసుపు బోర్డుపై నలుపు రంగుతో అక్షరాలను రాస్తారు. ఇది దూరం నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. మరియు రైలును నడుపుతున్న లోకో పైలట్ కూడా దూరం నుంచి బోర్డు, దానిపై రాసిన పదాలను గమనించి, అందుకు అనుగుణంగా రైలు వేగాన్ని నియంత్రిస్తారు.
ప్రయాణికులు నిశితంగా గమనిస్తే రైల్వే ట్రాక్‌ల పక్కన కూడా కొన్ని గుర్తులు ఉంటాయి. రైల్వే లోకోపైలెట్, సిబ్బంది కోసం ఇది ఉంటాయి. అయితే సాధారణ ప్రజలకు ఇవి అర్థం కావడం కొంచెం కష్టం. W/L, C/Fa వంటి చిహ్నాలు దారి మధ్యలో కనిపిస్తాయి.
W/L ఇంగ్లీష్‌లో, C/Fa హిందీలో రాసి ఉంటాయి. అంటే లోకోపైలెట్‌కు ఇది విజిల్ ఇండికేటర్. అంటే క్రాసింగ్‌లకు సుమారు 250 మీటర్ల దూరం ముందుగానే ఈ గుర్తులు కనిపిస్తాయి. అప్పుడు లోకోపైలెట్ విజల్ వేయాల్సి ఉంటుంది. మరియు W/B అని కూడా రాసి ఉంటుంది. అంటే ముందు బిడ్జి ఉందని లోకోపైలెట్ తెలుస్తుంది. అప్పుడు కూడా లోకోపైలెట్ విజిల్ వేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








