57 ఏళ్ల వయసులో కారులో 8000 కి.మీ ప్రయాణం.. 28 రోజుల్లో 3 దేశాల్లో పర్యటన

జీవితంలో ఒక్కసారైనా విదేశాలకు వెళ్లాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కొందరు చదువు కోసమో లేదంటే ఉద్యోగం కోసమే, లేదా ఫారిన్‌ టూర్‌పై విదేశాలకు వెళ్తుంటారు. చాలా మంది ఈ కలను త్వరగా సాకారం చేసుకుంటే.. మరికొందరికి ఏళ్లు పడుతుంది. అయితే మరికొందరి ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి.

విదేశాలకు వెళ్లాలంటే ఎక్కువగా విమానాల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. కానీ నేటి యువత రొటీన్‌కు భిన్నంగా ఆలోచిస్తూ తమ కార్లలో వరల్డ్‌ టూర్‌కు వెళుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో 50 ఏళ్లు పైబడిన వారు ఇలాంటి సాహసం చేయడం చాలా అరుదు. తాజాగా అలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

Doctor-Completes-8000-KM-Road-Trip

కర్ణాటకకు చెందిన ఓ వైద్యుడు 57 ఏళ్ల వయసులో ప్రసిద్ధ ఆఫ్ రోడ్ SUV మహీంద్రా థార్‌లో మూడు దేశాల్లో 8000 కిలోమీటర్లు ప్రయాణించారు. ముఖ్యంగా చైనాకు కారులోనే వెళ్లారు. సీట్ లిమిటెడ్ మరియు మహీంద్రా అడ్వెంచర్ సహకారంతో వాండర్ బియాండ్ బౌండరీస్ ఈ రైడ్‌ను నిర్వహించింది.

కర్ణాటకలోని కలబురగికి చెందిన ప్రఖ్యాత డాక్టర్ శరద్ తంగా, బెంగళూరు, అమెరికా, హైదరాబాద్ మరియు హుబ్లీ నుంచి పది మంది స్నేహితులతో కలిసి 28 రోజుల రోడ్ ట్రిప్‌ను ప్రారంభించారు. వయస్సు కేవలం శరీరానికి మాత్రమేనని మనసుకు కాదని మరోసారి నిరూపించారు.

Doctor-Completes-8000-KM-Road-Trip

డాక్టర్ శరద్ తంగా తన స్నేహితులతో కలిసి ఆగస్టు 2న ముంబయి నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ మీదుగా 5వ రోజు నేపాల్ రాజధాని ఖాట్మండుకి చేరుకున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాలను సందర్శించిన అనంతరం తొమ్మిదవ రోజు చైనా చేరుకున్నారు. అక్కడ 20 రోజుల పాటు గడిపారు.

ఈ బృందం చైనాలోని 108 హెయిర్‌పిన్ రోడ్ మరియు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌తో సహా అనేక ప్రదేశాలను సందర్శించింది. 45 కి.మీ టన్నెల్ రోడ్డు మార్గంలో కూడా వీరు ప్రయాణించారు. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్ శరద్ తంగా వెల్లడించారు.

Doctor-Completes-8000-KM-Road-Trip

ఒకసారి 15 గంటల పాటు కారు నడిపినట్లు తెలిపారు. చైనాలో రోడ్లు చాలా మంచి స్థితిలో ఉన్నాయన్నారు. అక్కడి ప్రజలు సమయపాలన పాటిస్తారని చెప్పారు. చైనీయుల కళలు మరియు సంస్కృతితో పాటు వారి జీవితం గురించి తెలుసుకోవడానికి ఈ రోడ్‌ టూర్‌ చేసినట్లు చెప్పారు.

దేశీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న మహీంద్రా థార్ వినియోగదారుల్లో మంచి ఆదరణను కలిగి ఉంది. మహీంద్రా థార్ 3 డోర్ వేరియంట్‌లో రూ.10.54 లక్షల నుండి రూ.16.78 లక్షల ఎక్స్ షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది.

4 సీటర్ వేరియంట్‌లలో లభించే మహీంద్రా థార్ 2 లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది 4WD (ఫోర్ వీల్ డ్రైవ్), RWD (రేర్ వీల్ డ్రైవ్) టెక్నాలజీని కలిగి ఉంది. ఇంకా 15.2 kmpl మైలేజ్‌ని అందిస్తుంది.

మహీంద్రా థార్ పొందిన ఫీచర్ల విషయానికొస్తే ఈ కారు 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ AC మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. భద్రతా ఫీచర్లను పరిశీలిస్తే, ఇది ఎయిర్ బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) సహా వివిధ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, September 11, 2023, 20:47 [IST]
English summary
Doctor completes 8000 km with his friends by road on mahindra thar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+