Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏడు రోజులుగా కారులోనే నిద్రించిన డాక్టర్, ఎందుకో తెలుసా.. ?
భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి వేలాది మంది భారతీయులను ప్రభావితం చేసింది. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని ఆపడానికి వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కరోనా బాధితులకు తమ వంతు సహాయం చేస్తూ వారికి నయం చేయడానికి రాత్రి పగలు కష్టపడుతున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు చురుకుగా చికిత్స చేస్తున్న వైద్యుడు తన కుటుంబం తన వల్ల వైరస్ భారిన పడకుండా ఉండాలనే ఆలోచనతో తన ఇంటికి కూడా వెళ్లకుండా కారులోనే నిద్రించాడు. దీనిని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. !

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ "సచిన్ నాయక్" తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి తన ఇంటికి కూడా వెళ్లకుండా కారులో ఉంటున్నాడు. ఈ డాక్టర్ వైద్యం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి కూడా వెళ్లకుండా తన కారులోనే నిద్రిస్తాడు.

డాక్టర్ సచిన్ నాయక్ తన మారుతి సుజుకి ఇగ్నిస్ వెనుక భాగాన్ని నిద్రపోవడానికి అనుకూలంగా మార్చుకున్నాడు. అతను ఒకవేళ ఆ వ్యాధి బారిన పడినప్పుడు వారిని సురక్షితంగా ఉంచడానికి డాక్టర్ తనను తాను కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు.
MOST READ: లాక్డౌన్ లో బయటికి వచ్చిన క్రికెటర్ కి జరిమానా, ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?

కరోనావైరస్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సోకుతుంది. వ్యాధి సోకినా కొన్ని రోజుల తర్వాత మాత్రమే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పిపిఇ) మరియు సేఫ్టీ మాస్క్‌ల కొరత ఉన్న ఈ కాలంలో, వైద్యులు తమను ఒంటరిగా ఉంచడానికి మరియు వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కారణంగానే సచిన్ నాయక్ తన కుటుంబంతో నేరుగా మాట్లాడాడు. అతడు ఫోన్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా మాట్లాడుతాడు.

డాక్టర్ సచిన్ నాయక్ దీని గురించి మాట్లాడుతూ హాస్పిటల్లో రోగులకు చికిత్స చేస్తున్నాము. మేము మా ఇంటికి వెళ్ళేటప్పుడు వైరస్ ని తీసుకువెళ్లే అవకాశం ఉంది. కాబట్టి కరోనా వైరస్ నుండి నా కుటుంబాన్ని కాపాడటానికి నేను ఇక్కడ కారులో ఉంటున్నాను అన్నారు.
MOST READ: టాటా సఫారీ & నానో కార్ అమ్మకాలను నిలిపివేసిన టాటా మోటార్స్, ఎందుకంటే.. ?

అంతే కాకుండా దాదాపు కారులోనే 7 రోజులుగా ఉంటున్నానని కూడా తెలిపాడు. గత ఏడు రోజులుగా కారులో ఉండి నిద్రపోతున్నానని ఇప్పటికి ఇంటికి వెళ్లి నాలుగు రోజులు అయ్యిందని, ఇంకా ఒకటి లేదా రెండు రోజుల్లో ఇంటికి వెళ్తానని చెప్పాడు.

ఒక డాక్టర్ ఈ విధంగా అలోచించి కారులోనే ఉండటం అనేది ప్రశంసించదగ్గ విషయమే, కాబట్టి ఇతనిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహన్ ప్రశంసించాడు. ఆ డాక్టర్ కి చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపాడు.
MOST READ: కారు కొనడానికి ముందు ఏం చేయాలో తెలుసా.. !

సచిన్ నాయక్ కారులో ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలను చదివేవాడు. ప్రస్తుత ప్రభుత్వం రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు మరియు నర్సులకు వసతి కల్పించడానికి చాలా వసతులను కల్పిస్తోంది. డాక్టర్ సచిన్ మరియు అలాంటి వాటిని ఉపయోగించుకోవాలని అతను మాత్రమే కాకుండా పలువురు వైద్యులు త్వరలో అటువంటి వాటిని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్న ఇటలీ, స్పెయిన్ మరియు యుఎస్ఎతో సహా అనేక దేశాలలో, పిపిఇ కిట్లు లేకపోవడం వల్ల వైద్యులు మరియు నర్సులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. భారతదేశం కూడా ఎక్కువ కిట్లను ఉపయోగించినట్లైతే వైద్యులను మరియు కరోనా బాధితులకు సేవ చేసేవారిని రక్షించుకునే అవకాశం ఉంది.
MOST READ: కొత్త డిజైన్ తో రానున్న 2021 బెనెల్లి టిఎన్టి 600 ఐ మోటార్ సైకిల్