Chandrayaan-3 క్షణక్షణం ఉత్కంఠ.. చంద్రుడిపై రేపు ఏం జరగనుంది?

చంద్రయాన్‌-3 మిషన్‌.. అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ సత్తాను ప్రపంచానికి (Chandrayaan-3) తెలియజేసింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి జూలై 14న సుమారు 140 కోట్ల భారత ప్రజల ఆశలను చంద్రయాన్‌-3 నింగిలోకి మోసుకెళ్లింది. సుమారు 40 రోజుల అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6:04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండ్‌ అయింది.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. దీంతోపాటు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ చేసిన రష్యా, అమెరికా, చైనాల తర్వాత భారత్‌ చోటు సంపాందించింది. ఈ విజయంతో భారత్ కీర్తి ప్రపంచవ్యాప్తంగా అయింది. అంతరిక్ష పరిశోధనల్లో ఇది కీలకమైలుగా నిలిచింది.

chandrayaan-3 lander and rover

ఆగస్టు 23న చంద్రయాన్‌-3 విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ అయింది. అనంతరం సుమారు నాలుగు గంటల అనంతరం విక్రమ్‌ ల్యాండర్‌లోని (VikramLander) ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టింది. అప్పటి నుంచి సుమారు రెండు వారాలు (లూనార్‌ పగలు) పాటు చంద్రుడి ఉపరితలంపై వివిధ రకాల పరిశోధనలు చేసింది. అ సమాచారాన్ని ఇస్రోకు పంపింది.

ఆ సమయంలో ప్రజ్ఞాన్‌ రోవర్ (Pragyan Rover) చంద్రుడి ఉపరితరంపైన 100 మీటర్ల దూరం ప్రయాణించినట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్‌, ఆక్సిజన్‌ సహా ఇతర మూలకాలు ప్రజ్ఞాన్‌ రోవర్ గుర్తించినట్లు తెలిపింది. దాంతోపాటు చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల్లో మార్పులును కూడా గుర్తించినట్లు పేర్కొంది.

chandrayaan-3 lander and rover

సెప్టెంబర్‌ 2 తేదీన ప్రజ్ఞాన్‌ రోవర్‌ పేలోడ్‌లను ఆఫ్ చేసిన ఇస్రో స్లీప్‌మోడ్‌లోకి పంపింది. సెప్టెంబర్ 3న హాప్‌ ఎక్స్‌పరిమెంట్‌ని చేపట్టింది. ఇందులో భాగంగా విక్రమ్ ల్యాండర్ ఇంజిన్లను మండించి, సుమారు 40 సెంటీ మీటర్ల ఎత్తు, 30-40 సెంటీమీటర్ల దూరంలో మరోసారి సురక్షితంగా ల్యాండింగ్‌ చేసింది. చంద్రుడిపై నుంచి కొన్ని శాంపిల్స్‌, మానవ సహిత యాత్రలకు హాప్‌ ఎక్స్‌పరిమెంట్‌ ప్రోత్సాహం ఇస్తుందని ఇస్రో భావిస్తోంది.

అనంతరం 4వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపై పగటి సమయం ముగుస్తున్న సమయంలో విక్రమ్‌ ల్యాండర్‌ పే లోడ్స్‌ను కూడా ఆఫ్‌ చేసి.. స్లీ్ప్‌ మోడ్‌లోకి పంపింది. ఆ ప్రాంతంలో తిరిగి సూర్యోదయం కాగానే విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి సూర్యరశ్మిని గ్రహించేలా అన్ని ఏర్పాట్లు చేసింది.

chandrayaan-3 lander and rover

అయితే చంద్రుడిపై రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా క్షీణిస్తాయి. సుమారు -200 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ల్యాండర్‌, రోవర్‌లోని సున్నితమైన విభాగాలు సహా ఎలక్ట్రానిక్‌ పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 22 (శుక్రవారం)న చంద్రుడిపై మళ్లీ సూర్యోదయం కానుంది. అయితే ఇస్రో మాత్రం ల్యాండర్‌, రోవర్‌లు తిరిగి పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

చంద్రుడిపై సూర్యోదయం కాగానే ల్యాండర్‌, ప్రజ్ఞాన్ సోలార్‌ ప్యానల్‌ ద్వారా సూర్యరశ్మిని గ్రహించి తిరిగి పని ప్రారంభిస్తాయని, మరో 14 రోజులపాటు ఈ రెండు మరిన్ని పరిశోధనలు చేస్తాయని ఇస్రో విశ్వాసం వ్యక్తం చేస్తోంది. లేకుంటే భారత రాయబారిగా చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోతాయని గతంలోనే ప్రకటన చేసింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, September 21, 2023, 14:10 [IST]
English summary
Does chandrayaan 3 lander and rover work again after september 22
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+