INDIA పేరు మారిస్తే.. వాహనాల నంబర్‌ ప్లేట్లు కూడా మారతాయా..?

దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మారుస్తారంటూ మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి పంపిన G20 ఆహ్వాన పత్రికలో 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌'గా పేరు కనిపించిన నుంచి అనేక వర్గాలు ఈ అంశంపై తన స్పందనను తెలియజేస్తున్నాయి. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

అయితే దేశం పేరులో మార్పు వస్తే వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్‌లో మార్పులు వస్తాయా లేదా అనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటికే దేశంలో BH- భారత్‌ సిరీస్‌ నంబర్‌ ప్లేట్‌ జారీ చేస్తుండగా, అన్ని వాహనాలకు ఇదే సిరిస్‌ నంబర్‌ ప్లేట్‌ వస్తుందా లేదా అనే ప్రశ్న కూడా వాహనదారుల్లో తలెత్తింది. అయితే పేరు మార్పును కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

india name change effect on vehicle number plates

దేశం పేరును మారిస్తే దేశవ్యాప్తంగా చాలా చోట్ల దేశం పేరును మార్చాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలో ఏవైనా రెండు రాష్ట్రాల మధ్య తరచూ ప్రయాణించే వాహనాల కోసం భారత ప్రభుత్వం BH పేరుతో కొత్త రకం నంబర్‌ ప్లేట్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సాఫీగా ప్రయాణం సాగించవచ్చు.

ప్రస్తుతం దేశంలో రవాణా రంగాన్ని పాలసీ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం, ఆదాయ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రవాణా రంగాన్ని నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఎలాంటి నంబర్‌ ప్లేట్లు అందించాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. దీని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలు నంబర్‌ పేట్లను జారీచేస్తున్నాయి.

india name change effect on vehicle number plates

ప్రస్తుతం జారీ చేస్తున్న నంబర్‌ ప్లేట్లలో తొలుత రాష్ట్రానికి సంబంధించిన గుర్తు, తర్వాత ఆర్టీవో కార్యాలయం నంబర్‌ ఉంటాయి. ఈ రెండింటి తర్వాత సీరియల్‌ కోడ్‌ ఉంటుంది. ఈ నంబర్‌లో దేశానికి సంబంధించిన గుర్తులు ఎక్కడా కనిపించవు. కాబట్టి దేశం పేరులో మార్పు వచ్చినా.. వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం BH సిరీస్‌ నంబర్‌ ప్లేట్‌ను అర్హులకు అందజేస్తోంది. అయితే భవిష్యత్‌లో దీనినే అధికారిక నంబర్‌ ప్లేట్‌గా మార్చినా ఆశ్యర్య పోవాల్సిన అవకాశం లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నంబర్‌ ప్లేట్లను కేటాయిస్తోంది.

india name change effect on vehicle number plates

ఇటీవల తీసుకొచ్చిన కొత్త సిరీస్‌ ప్లేట్లను ఎక్కువగా జారీచేస్తే.. ఆ వాహనం ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో భాగమైతే గుర్తించడం కష్టమవుతుంది. ప్రస్తుతం ఉన్న నంబర్‌ ప్లేట్లలో రాష్ట్రం, ప్రాంతాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. ఏదైనా అత్యవసర సమయంలో వాహనాల యజమానులను సులభంగా ట్రాక్ చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన నంబర్ ప్లేట్ ఉంటే ట్రాకింగ్‌ కష్టమవుతుంది.

ఒకవేళ దేశం పేరు మార్చితే.. అందుకు అనుగుణంగా వాహనాల రిజిస్ట్రేషన్‌ మార్చడం చాలా శ్రమతో కూడుకున్న పని. అందుకు చాలా సమయం సహా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే వాహనాల నంబర్‌ ప్లేట్ల మార్పులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ప్రకటన చేయలేదు.

india name change effect on vehicle number plates

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 6, 2023, 13:55 [IST]
English summary
Does india name change effect on vehicle number plates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+