Paytm FASTag మార్చి 15 తర్వాత పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ పనిచేస్తుందా.??.. క్లారిటీ ఇచ్చిన పేటీఎం.!!
దేశవ్యాప్తంగా గత కొంత కాలంగా ఫాస్ట్‌ట్యాగ్, Paytm ఫాస్ట్‌ట్యాగ్ చర్చనీయాంశమైంది. ఆర్బీఐ నిబంధనల కారణంగా పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్‌తో వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాగా ఫిబ్రవరి 29 నాటికే ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు గతంలో ఆర్బీఐ ప్రకటించగా.. మళ్లీ ఈ ఏడాది మార్చి 15 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ నెల 15 తర్వాత Paytm FASTag పనిచేస్తుందా లేదా అనే దానిపై అందరికీ సందేహం నెలకొంది. ఈ క్రమంలో దీనిపై పేటీఎం.. తాజాగా తన కస్టమర్లకు స్పష్టతనిచ్చింది. మార్చి 15 తర్వాత కూడా పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ ఖచ్చితంగా పనిచేస్తుందని సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో దీనిపై కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడిస్తూ.. పేటీఎం యాప్‌లో టాప్ అప్ మెసేజ్ ద్వారా సూచిస్తోంది.

ఫాస్ట్‌ట్యాగ్‌పై పేటీఎం ఏం చెప్పింది: ఈ ఏడాది ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలకు సంబంధించి గత నెల 29వ తేదీ వరకు గడువు ఇవ్వగా.. ఆ తర్వాత ఆ తేదీని మార్చి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే గడువు తేదీని పెంచినప్పటికీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి.
పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్‌లో మీరు రీఛార్జ్ చేయడం లేదా డబ్బును యాడ్ చేయడం వంటి వాటిని చేసుకునే అవకాశం ఇక్కడ లేదు. అయితే ఎవరైనా Paytm FASTag ను రద్దు చేసుకోవాలనుకుంటే మాత్రం కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్‌ను సంప్రదించాలని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. మీ ఖాతా రద్దు అయిన తర్వాత.. మీ డబ్బు మీకు రిటర్న్ అవుతుందని వెల్లడించింది.

ముందుగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఫాస్ట్‌ట్యాగ్ వాడేవారు కొంత మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మందికి ఓ సందేహం ఉంది. పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్‌లో సెక్యూరిటీ డిపాజిట్‌గా నిల్వ ఉంచిన డబ్బు తిరిగి కస్టమర్ల అకౌంట్‌లోకి జమ అవుతుందా లేదా అని గందరగోళంలో ఉన్నారు. దీనిపై డౌట్ అక్కర్లేదు.. పేటీఎం నివేదికల ప్రకారం.. కస్టమర్ల ఖాతాలోకి సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని సంస్థ రిటర్న్ చేస్తుంది.
కొత్త ఫాస్ట్‌ట్యాగ్: మీ పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ ఎకౌంట్‌ను క్లోజ్ చేసిన అనంతరం.. కొత్త ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవాలనుకునేవారు.. ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీ వాహనం విండ్ స్క్రీన్ మీద నుంచి FASTag స్టిక్కర్‌ను తప్పనిసరిగా తీసేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ను తీసుకోవాలి.

పేటీఎం మాత్రమే కాకుండా బ్యాంకింగ్‌తో పాటు పలు సంస్థలు కూడా.. దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ సేవలను అందిస్తున్నాయనే సంగతి తెలిసిందే. మీరు ఏ బ్యాంకు నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటున్నారో.. అందులో మీరు కొంత సెక్యూరిటీ సొమ్మును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మీరు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఫాస్ట్‌ట్యాగ్ ఎలా అప్లై చేసుకోవాలి: కొత్తగా ఫాస్ట్‌ట్యాగ్ కోసం అప్లై చేసుకోవాలనుకునే వాళ్లు.. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే సదుపాయం ఉంది. ప్రత్యేకించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) మినహా 32 బ్యాంకుల నుంచి ఫాస్ట్‌ట్యాగ్స్ పొందాలని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ సూచిస్తోంది.

వీటిలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం పేటీఎం వెబ్‌సైట్ లేదా ఆర్బీఐ వెబ్‌సైట్‌లోని (FAQs) జాబితాను ఓ సారి తనిఖీ చేసుకోండి.


Click it and Unblock the Notifications








