వెంటాండిన కుక్కల భయం.. కారుని ఢీకొట్టి ఎగిరి పడ్డ మహిళలు, వీడియో వైరల్..!
దేశంలో వీధి కుక్కల దాడితో చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై అవి విరుచుకుపడుతున్న తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాహనదారులకు రోడ్డుకు అడ్డుగా రావడం వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన ఓ ప్రమాదం ఇప్పుటు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ హృదయవిదారకర ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..
ఒడిశాలో జరిగిన ఓ ఘటనలో వీధికుక్కల గుంపు కారణంగా ఓ స్కూటర్ పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి పడ్డారు. కుక్కలే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా వీడియో చూస్తే తెలిసిపోతుంది. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా స్కూటర్‌లో ఉన్న వారు కిందపడిగా వారికి గాయాలయ్యాయి. స్కూటర్ ఫ్లోర్‌బోర్డ్‌పై ఓ చిన్నారి నిలబడి ఉండగా, స్కూటర్ నడుపుతున్న మహిళ వెనుక మరో మహిళ కూర్చున్న వీడియో చూడటానికి కాస్త భయానకంగా ఉంది.

ఎగిరి కిందపడ్డారు..
ఇద్దరు మహిళలు ఒక చిన్న పిల్లవాడితో కలిసి తెల్లవారుజామునే ఆలయానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. దాదాపు 6 వీధికుక్కలు స్కూటర్‌ని వెంబడించడం మనం వీడియోలో చూడవచ్చు. నెమ్మదిగా కదులుతున్న స్కూటర్‌ను కుక్కలు ఒంటరిగా వెంబడించాయి. ఈ సమయంలో భయాందోళనకు గురైన మహిళ కుక్కలు కరుస్తాయేమోనన్న భయంతో అదే సమయంలో వేగం పెంచారు.
అదే అతివేగంతో ఆ మహిళ కుక్కలను చూసి కంగారుపడి రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. దీంతో అతను స్కూటర్‌పై నుంచి కిందపడిపోవడంతో రెండు కుక్కలు స్కూటర్ కింద ఇరుక్కుపోయాయి. ఈ ఘటనలో ఓ బాబుతో సహా ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఢీకొనడానికి ముందు వెంబడిస్తున్న కుక్కలు ఢీకొన్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాయి. ఈ ఘటనలో కారు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది.
టెంపుల్ కి వెళ్తుండగా ప్రమాదం..
ఈ ప్రమాద ఘటనపై భాదితురాలు మాట్లాడుతూ.. ఉదయం 6 గంటలకు గుడికి వెళుతుండగా ఆరు నుంచి ఎనిమిది కుక్కలు వెంబడించడం ప్రారంభించాయని చెప్పారు. అప్పుడు స్కూటర్ వేగాన్ని పెంచాలని, లేకుంటే వెనుక కూర్చున్న వ్యక్తిని కుక్కలు కొరికేస్తాయనీ అనుకుని వేగం పెంచినట్లు తెలిపింది. ఇంతలోనే పెను విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో భారీ ప్రమాదం నుంచి వారు తప్పించుకున్నారు.
ఒకవేళ కారుని ఢీకొట్టకపోతే పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఉంటే ప్రమాద తీవ్రత అధికంగా ఉండేదని స్థానికులు చెప్పారు. ఈ ఘటనలో యువతి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. వెంటాడి కుక్కలు కింద పడి గాయాలపాలైన మాట వాస్తవమే కానీ.. హెల్మెట్ ధరించి ఉంటే ఫలితం అంతంత మాత్రంగానే ఉండేది.

ట్రాఫిక్ నియమాలు పాటించండి..
ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించాలని.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పదే పదే చెబుతున్నారు. కానీ వీటిని పాటించకపోవడం వల్ల గాయాల నుంచి బయటపడేవారని చెప్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఇకపై బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ను ధరించాలని లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.
సరదా కోసం కుక్కలను తరచుగా రోడ్లపైకి వస్తాయి. అవి కావాలనే దాడి చేయవు.. కానీ మన భయాందోళన వాటిని దాడికి ప్రేరేపిస్తాయి. కింద పడిన కుక్కలు కంగారు పడి వాటిపై దాడి చేయకుండా వెనక్కి రావడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి కుక్కలు మిమ్మల్ని వెంబడించినప్పుడు, మీరు భయపడకుండా వెంటనే వాహనాన్ని ఆపివేయండి, అప్పుడు అవి కూడా వెంబడించడం మానేసి తమ ప్రదేశానికి వెళ్లిపోతాయి.

మచ్చిక చేసుకోండి..
కొన్నిసార్లు కుక్కలు వెంబడించడానికి ఇతర కారణాలు ఉన్నాయి. అరుదైన సందర్భాల్లో మనం కుక్కతో ఆడుకున్నప్పుడు దాని సువాసన మనపై లేదా వాహనంపై ఉన్నప్పుడు, రోడ్లపై కుక్కలు దానిని గుర్తించి మనల్ని వెంబడిస్తాయి. కుక్కలు తమ ప్రాంతంలోని జంతువులను వదిలి బయటి కుక్కలను శత్రువులుగా భావించడమే దీనికి కారణం. కాబట్టి అవి వెంబడిస్తాయి. కానీ అవి మమ్మల్ని కాటు వేయవు. కాబట్టి వెంటనే వాహనాన్ని ఆపివేస్తే ప్రమాదాలను నివారించవచ్చు.
కుక్కలను పెంచుకునే వారికి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. అయితే కొందరికీ కుక్కలంటే ఉండే సాధారణ భయం కారణంగా భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ చూడబోయే వీడియోలో స్కూటర్ పై వెళ్తున్న వారు ఎగిరిపడిన విధానం వారి భయాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి వాటిపై అవగాహన ఉంటే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








