రీల్స్ కోసం వాహనాలతో స్టంట్లు చేస్తున్నారా.. అయితే మీరు తప్పకుండా ఇది చదవాల్సిందే..!
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఏ రేంజ్‌లో ఉందో అందరికి తెలిసిందే. భారత్‌లో జనాభా కంటే కూడా ఫోన్లే ఎక్కువగా ఉన్నాయి. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన కూడా క్షణాల్లో అందరికి చేరుతుంది. సోషల్ మీడియాలో ఒక్కసారి ఫేమస్ అయితే చాలు ఆటోమెటిక్‌గా పెద్ద సెలబ్రిటీ హోదా వచ్చేస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అందుకే చాలా మంది రీల్స్ పేరుతో వీడియోలను తీస్తూ వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. ఇటీవల కాలంలో ఈ రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఈ మధ్య ఒక వ్యక్తి తన మహీంద్రా థార్‌తో ఏకంగా రైల్వే ట్రాక్‌పై స్టంట్స్ చేశాడు. ఇలా చేస్తున్న క్రమంలో ఎదురుగా రైలు రావడంతో వెంటనే తన వాహనాన్ని ట్రాక్ నుంచి దింపడానికి ప్రయత్నించాలని చూడగా, అది సాధ్యం కాలేదు.
వెంటనే అక్కడి స్థానికులు, పోలీసులు వచ్చి థార్‌ను ట్రాక్ నుంచి ప్రక్కకు తప్పించడానికి సహాయపడి పెద్ద ప్రమాదం జరగకుండా అతనికి సహయపడ్డారు. రీల్స్ పేరుతో తమ వాహనాలతో పిచ్చి పిచ్చి స్టంట్లు చేస్తూ తీర తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంత మంది సోషల్ మీడియాలో ఏదో విధంగా ఫేమస్ కావడానికి కార్లతో ఇష్టం వచ్చినట్లు రాష్ డ్రైవింగ్ చేయడం, పలు స్టంట్లు చేయడం లాంటివి చేస్తున్నారు.

ఇలా వాహనాలతో స్టంట్లు చేస్తున్న సమయంలో ఏదైనా పొరపాటు జరిగినట్లయితే, పెద్ద అనర్థాలు జరుగుతాయి. ఉదాహరణకు ఇటీవల కేరళ రాష్ట్రంలో కొంతమంది రీల్స్ కోసం తమ కారుతో స్టంట్లు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనానికి మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, కేరళలో కాసర్‌గోడ్‌లోని కుంబ్లా పట్టణంలో స్టంట్లు చేస్తుండగా మహీంద్రా థార్‌కు ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.
ఒక గ్రౌండ్‌లో కొంతమంది యువకులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం థార్‌ను వేగంగా తిప్పడం కారణంగా క్రింద నెలకు, టైర్లకు మధ్య రాపిడి ఎక్కువ జరిగి టైర్లకు మంటలు చెలరేగాయి. వెంటనే థార్ మొత్తానికి మంటలు వ్యాపించాయి. అదృష్టం కొద్ది యువకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వాహనం జనసందడి ఉన్న ప్రాంతంలో కాకుండా ఖాళీగా ఉన్న ఏరియాలో ఉండటం వలన పెద్ద ప్రమాదం తప్పింది.

వాహనానికి మంటలు అంటుకున్న వెంటనే అగ్నిమాపక, సహాయక సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. స్టంట్ల సమయంలో టైర్లకు ఎక్కువ రాపిడి జరిగి ఘర్షణ కారణంగా మంటలు వచ్చినట్టు ప్రాథమిక సమాచారం ఉంది. మంటల్లో కాలిపోయిన వాహనాన్ని ఇటీవలే కొత్తగా కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు.
రీల్స్ కోసం ఇలా వాహనాలతో స్టంట్లు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. ఇలాంటి వాటికి పాల్పడటం కారణంగా కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. అందుకే వాహనాలను తమ ప్రయాణాలకు మాత్రమే ఉపయోగించాలి, కానీ ఇలా రీల్స్ కోసం స్టంట్లకు వాడటం అత్యంత ప్రమాదకరం. ఇప్పటికే ప్రభుత్వం, పోలీసులు డేంజర్ స్టంట్ల గురించి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి.

కాబట్టి ఇలాంటి సంఘటనలు అయిన చూసి వాహనాలను కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా విన్యాసాలు చేయడం అత్యంత ప్రమాదకరం అని గుర్తుంచుకోవాలి. ఈ స్టంట్లు డ్రైవర్‌తో పాటు ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టెస్తాయి. తమ కార్లు, బైకులతో పిచ్చి పిచ్చి స్టంట్లకు పాల్పడినట్లయితే మోటారు వాహనాల చట్టం, రోడ్డు భద్రతా చట్టం ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారు.


Click it and Unblock the Notifications








