రూ.4.9 కోట్ల కారులో కనిపించిన డాలీ చాయ్‌వాలా - వీడియో వైరల్

చాలామందికి లంబోర్ఘిని కారును కొనుగోలు చేయడం ఒక కల. ఇది కొందరి జీవితంలో నిజమవుతుంది, మరి కొందరి జీవితంలో కలగానే మిగిలిపోతుంది. ఇటీవల 'డాలీ చాయ్‌వాలా' లంబోర్ఘిని (Lamborghini) కారులో కనిపించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

సోషల్ మీడియా అతి తక్కువ కాలంలోనే కొంతమంది జీవితాలను మార్చింది. ఈ కోవకు చెందిన వారిలో నాగ్‌పూర్‌కు చెందిన టీ అమ్మే వ్యక్తి డాలీ చాయ్‌వాలాగా పాపులర్ అయిన 'సునీల్ పాటిల్' ఒకరు. ప్రత్యేకమైన డ్రెస్సింగ్ స్టైల్ మాత్రమే కాకుండా టీ తయారు చేసి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. ఇతడు బిల్‌గేట్స్'కు కూడా టీ ఇచ్చి గతంలో నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాడు.

Dolly Chaiwala In Rs 4 9 Crore Lamborghini Huracan

నిజానికి డాలీ చాయ్‌వాలాగా బిల్‌గేట్స్‌కు టీ ఇచ్చినప్పుడు ఆయన బిల్‌గేట్స్‌ అని తనకు తెలియదని, అందరికి టీ ఇచ్చినట్లే ఇచ్చానని ఇప్పటికే వెల్లడించారు. ఆ తరువాత బిల్‌గేట్స్‌ అని తెలిసి ఆశ్చర్యపోయాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా చాయ్ ఇవ్వాలనే కోరిక ఉన్నట్లు కూడా డాలీ చాయ్‌వాలా అన్నారు. కాగా ఇప్పుడు ఖరీదైన లబోర్గిని ద్వారా మరోమారు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాడు.

ఇక అసలు విషయానికి వస్తే డాలీ చాయ్‌వాలా.. ఇటీవల లంబోర్ఘిని హురాకాన్‌ కారు పక్కన నిలబడి తనిఖీ చేయడం చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో డాలీ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. మొదటి వీడియోలో కారు పక్కన నిలబడ్డాడు. రెండో వీడియోలో కారును స్టార్ట్ చేయడం చూడవచ్చు. ఎరుపు రంగులో కనిపిస్తున్న ఈ కారు చూడగానే ఆకర్శించే విధంగా ఉండటం గమనించవచ్చు.

వీడియోలో నిశితంగా పరిశీలిస్తే ఇక్కడ కనిపిస్తున్న కార్ డిటైలింగ్ స్టూడియో హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి పోస్టులో కనిపించే కారు, రెండో వీడియోలో కనిపించే కారు వేరువేరుగా (కలర్స్) ఉన్నట్లు తెలుస్తోంది. రెండో వీడియోలో చాలామంది సూపర్ కారు ఓనర్స్ ప్రతి ఆదివారం చేసే మార్నింగ్ డ్రైవ్ మాదిరిగా తెలుస్తోంది. త్వరలో డాలీ చాయ్‌వాలా కూడా ఓ కొత్త లంబోర్ఘిని కారును కొనుగోలు చేయాలనీ ఆశిస్తున్నట్లు చాలామంది పేర్కొన్నారు.

లాంబోర్గిని యొక్క హురాకాన్ విషయానికి వస్తే.. భారతదేశంలోని చాలామంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్లలో ఇది ఒకటి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేశారు. వీడియోలో గమనిస్తే కారు ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే డాలీ డ్రైవర్ సీటులో కూర్చున్నట్లు, కారు ముందుకు వెళ్లే సమయంలో అతడు కో డ్రైవర్ సీటులో కూర్చున్నట్లు తెలుస్తోంది.

ఖరీదైన ఈ సూపర్ కారును డాలీ డ్రైవ్ చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ కారులో వెళ్తున్నప్పుడు డాలీ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక్కడ కనిపించే కారు హురాకాన్ పాత మోడల్ అని తెలుస్తోంది. ఇది 5.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 638 Bhp పవర్ మరియు 600 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

లంబోర్ఘిని గల్లార్డో స్థానంలో హురాకాన్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. నేడు ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. సినీ ప్రముఖులు, క్రికెటర్లు, ఇతర పారిశ్రామికవేత్తలు ఈ కారును కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే లంబోర్ఘిని హురాకాన్ కార్లను కొనుగోలు చేసిన సెలబ్రిటీలతో శ్రద్ధాకపూర్ కూడా ఉన్నారు. ఈ కారు ధర రూ. 4 కోట్ల నుంచి రూ. 4.99 కోట్ల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 23, 2024, 14:00 [IST]
English summary
Dolly chaiwala in rs 4 9 crore lamborghini huracan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+