పిజ్జాలను డెలివరీ చేసే 'డోమినోకాప్టర్'
సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కోసం, తీవ్రవాదులను హతమార్చడం కోసం మానవరహిత విమానాలు 'డ్రోన్'లను అమెరికా ఉపయోగిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు ఈ తరహా డ్రోన్లను పిజ్జాలను డెలివరీ చేసేందు కోసం ఉపయోగించనున్నారు. ప్రముఖ అమెరికన్ రెస్టారెంట్ చెయిన్ డొమినోస్ పిజ్జా (Domino's Pizza) ఈ సరికొత్త డెలివరీ విధానానికి శ్రీకారం చుట్టింది. వేడి వేడి పిజ్జాలను వినియోగదారుల గడప ముందుకు చేర్చేందుకు ఈ ఆక్టోకాప్టర్ డ్రోన్‌లను ఉపయోగించనున్నారు.
ప్రముఖ ఇంగ్లీష్ క్రియేటివ్ ఏజెన్సీ టి ప్లస్ బిస్కట్స్ (T + Biscuits) ఈ వినూత్నమైన ఐడియాకు ప్రాణం పోసింది. 'డొమికాప్టర్' (DomiCopter)గా పిలువబడే ఈ ప్రోటోటైప్ ప్రస్తుతం రెండు లార్జ్ పిజ్జాలను స్టోర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రదేశానికి కేవలం పది నిమిషాల్లోనే డెలివరీ చేయగలదు. భవిష్యత్తులో డొమికాప్టర్లు పిజ్జాలను జిపిఎస్ సాయంతో ఆటోమేటిక్‌గా కస్టమర్లకు డెలివరీ చేస్తాయి. కాగా.. ప్రస్తుత డొమికాప్టర్లను మాత్రం డ్రోన్ విమానాలలో అనుభవజ్ఞులైన వారిచే రిమోట్ కంట్రోల్ సాయంతో నియంత్రించడం జరుగుతుంది.
ఈ డొమికాప్టర్‌కు ఎనిమిది బ్లేడ్లు (ఫ్యాన్ రెక్కలు) ఉంటాయి. ఇందులో పిజ్జాలను వేడిగా ఉంచేందుకు థెర్మల్ ఇన్సులేషన్ బ్యాగ్‌ను ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేక వాహనాన్ని ఏరోసైట్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. డ్రోన్‌లలో ఇదొక రకం. నేల నుంచి సుమారు 126 మీటర్ల ఎత్తులో ఎగిరించేందుకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు. ఇది పిజ్జా బాయ్ కన్నా వేగంగా వేడి వేడి పిజ్జాలను డెలివరీ చేయగలదు. మరి బాగుంది కదూ ఈ ఫ్లయింగ్ పిజ్జా...!
డోమికాప్టర్ (వీడియో)
ప్రముఖ ఇంగ్లీష్ క్రియేటివ్ ఏజెన్సీ టి ప్లస్ బిస్కట్స్ (T + Biscuits) ఈ వినూత్నమైన ఐడియాకు ప్రాణం పోసింది. 'డొమికాప్టర్' (DomiCopter)గా పిలువబడే ఈ ప్రోటోటైప్ ప్రస్తుతం రెండు లార్జ్ పిజ్జాలను స్టోర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రదేశానికి కేవలం పది నిమిషాల్లోనే డెలివరీ చేయగలదు.


Click it and Unblock the Notifications








