చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధిచెందుతోంది, ఇందులో భాగంగానే టెక్నాలజీ కూడా మరింత వేగంగా అభివృద్ధిచెందుతోంది. కావున నిరంతరం కొత్త ఐడియాలు, కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ కొత్త ఉత్పత్తులలో కేవలం బైకులు, కార్లు మాత్రమే కాదు, రోబోట్ లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన పిజ్జా డెలివరీ రోబో గురించి తెలుసుకుందాం.

చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

ప్రస్తుత నిజ జీవితంలో రోబోట్ల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజుల్లో రక్షణ మరియు ఆటోమేషన్‌తో అనేక రోజువారీ అవసరాలను తీర్చడానికి రోబోట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చాలా కంపెనీలు హోమ్ డెలివరీ కోసం రోబోట్లనే వాడుకుంటున్నాయి.

చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

ఇటీవల డొమినోస్ పిజ్జా డెలివరీ కోసం రోబోట్లను ఉపయోగించడం ప్రారంభించింది. నివేదికల ప్రకారం టెక్సాస్‌లోని హ్యూస్టన్ నగరంలో రోమినోల ద్వారా డొమినోస్ పిజ్జా డెలివరీ ప్రారంభమైంది. డెలివరీ కోసం కంపెనీ న్యూరో ఆర్ 2 ఆటోమేటిక్ రోబోట్‌ను ఉపయోగిస్తోంది, ఇది వినియోగదారునికి పిజ్జాను డెలివరీ చేస్తుంది.

MOST READ:2021 టీవీఎస్ అపాచీ RTR 160 4V రివ్యూ.. ఇప్పుడు సూపర్ స్టైల్ & సూపర్ పర్ఫామెన్స్

చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

కస్టమర్లు పిజ్జా ఆర్డర్ చేసిన తర్వాత, కంపెనీ వారికి SMS ద్వారా పిన్ నెంబర్ ఇస్తుంది. రోబోట్ వారి వద్దకు చేరుకున్న తర్వాత, కస్టమర్ రోబోట్ స్క్రీన్‌పై పిన్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత రోబోట్ పిజ్జాను కస్టమర్‌కు అందిస్తుంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఈ రోబోట్‌ను ట్రాక్ చేయవచ్చు.

చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

ఈ రోబోట్ గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రోబోట్ యొక్క వాణిజ్య ఉపయోగం కోసం కంపెనీ యుఎస్ లో అధికారికంగా లైసెన్స్ పొందింది. అంతే కాకుండా రోడ్డుపై కూడా ఇది చాలా సురక్షితం అని ప్రభుత్వంచే ప్రకటించబడింది.

MOST READ:2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ రివ్యూ.. భారత మార్కెట్లో పవర్‌పుల్ ఎస్‌యూవీ

చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

ఈ పిజ్జా డెలివరీ రోబోలో అనేక సెన్సార్లు మరియు రాడార్లు వ్యవస్థాపించబడ్డాయి. దీని సహాయంతో దాని చుట్టూ కదులుతున్న వాహనాలను గుర్తించగలదు. వాహనాలను మాత్రమే కాకుండా ఈ రోబోట్ కాలినడకన వెళ్లే ప్రజలను గుర్తించడంలో కూడా ప్రత్యేకత కలిగి ఉంది

చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

ఈ రోబోట్ రోడ్డుపై చాలా విషయాలను గుర్తించగలదు మరియు అవసరానికి అనుగుణంగా దాని మార్గాన్ని నిర్ణయించగలదు. దీనికి కావాల్సిన సెన్సార్లు ఇందులో ఉన్నాయి. ఇది మాత్రమే కాదు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే లేదా రోడ్డు సరిగ్గా లేకుంటే ఈ రోబోట్ వేరే రోడ్డును కూడా గుర్తించి ప్రయాణించగదు.

MOST READ:బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్‌కి ఇది తప్పని సరి.. లేకుంటే?

చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

ఈ రోబోట్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని డొమినోస్ కంపెనీ పేర్కొంది. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ప్రకారం కంపెనీ రోబోట్ డెలివరీ రంగాన్ని విస్తరిస్తుంది. పెరుగుతున్న డెలివరీ డిమాండ్‌ను తీర్చడానికి ఈ రోబోట్ సరసమైన ఎంపికను అందిస్తుంది అని డొమినోస్ పేర్కొంది.

చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

ఏది ఏమైనా రోబోతో పిజ్జా డెలివరీ అంటే కొంత వింతగా అనిపించినా, ఇది నిజమే, రాబోయే కాలంలో కూడా ఎక్కువ రోబోలు వినియోగంలోకి రానున్నాయి. రోబో పిజ్జా డెలివరీ చేయడం అంటే చాలామంది ఆసక్తి చూపుతారు. కావున ఇది అతి త్వరలో బాగా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది.

MOST READ:ఫేస్ మాస్క్ లేనందుకు గవర్నమెంట్ బస్ డ్రైవర్‌కు జరిమానా; పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Dominos Using Automatic Robots For Pizza Delivery. Read in Telugu.
Story first published: Thursday, April 15, 2021, 13:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X