అమెరికా అధ్యక్ష పీటమెక్కిన డొనాల్డ్ ట్రంప్ "కార్ కలెక్షన్"

Written By:

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలో కాస్త మేజారిటీతో హిల్లరీ క్లింటన్ పై డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం అస్సలు లేదు అనాలి. ఎన్నికల ప్రచారం ప్రారంభం నుండి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యేకంగా నిలిచాడు.

డొనాల్డ్ ట్రంప్ సామాన్య మానవుడు ఏమీ కాదు, అతనో పెద్ద పారిశ్రామిక వేత్త. ఎన్నో వ్యాపార సంస్థలు, లాభదాయకమైన వెంచర్‌లు మరియు ఆస్తులు ఇతని పేరు మీద భారీగా ఉన్నాయి. ఈ నూతన అమెరికా అధ్యక్షుడికి కార్లంటే భలే పిచ్చి. కార్లను ఎంచుకునే విషయంలో కూడా ఇతనిది ప్రత్యేకమైన అభిరుచి. డొనాల్డ్ ట్రంప్ వద్ద ఉన్న కార్ల వివరాలు..

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ల్యాంబోర్గిని డియాబ్లో విటి

ల్యాంబోర్గిని డియాబ్లో విటి

ల్యాంబోర్గిని డియాబ్లో ప్రస్తుతం కౌంటాక్ మోడల్‌లో రీప్లేస్ అయ్యింది. డియాబ్లో విటి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి వద్ద ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారును ల్యాంబోర్గిని 2000-2001 మద్య మాత్రమే ఉత్పత్తి చేసింది.

డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్

ఇందులో 6.0-లీటర్ సామర్థ్యం గల వి12 ఇంజన్ కలదు. ఇది సుమారుగా 543బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం ఉన్న ల్యాంబోర్గిని కార్లతో పోల్చితే ఈ డియాబ్లో విటి కారును నడపడం కాస్త కష్టమే.

రోల్స్ రాయిస్ ఫాంటమ్

రోల్స్ రాయిస్ ఫాంటమ్

ప్రతి సంపన్న వ్యాపారవేత్త కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ లేకుండా ఉంటుందా ? సంపన్న వ్యక్తి అంటే అతని వద్ద ఒక రోల్స్ రాయిస్ ఉంటే చాలు. అయితే ఇప్పుడు ట్రంప్ వద్ద కూడా రోల్స్ రాయిస్ ఫాంటమ్ కలదు. తన వద్ద ఉన్న సిరీస్ 1 స్థానంలోకి సిరీస్ 2 మార్చుకున్నాడు.

డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్

ఫాంటమ్ కారు రోల్స్ రాయిస్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్. ఈ లగ్జరీ కారులో 6.75-లీటర్ సామర్థ్యం గల వి12 డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 453బిహెచ్‌పి పవర్ మరియు 720ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇది కేవలం లగ్జరీ కారు మాత్రమే కాదు అత్యంత వేగవంతమైనది కూడా కేవలం 6 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్

మెర్సిడెస్ బెంజ్ ఈ ఎస్ఎల్ఆర్ కారును 2003లో పరిచయం చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఈ ఎస్ఎల్ఆర్ కారును మెక్ లారెన్ భాగస్వామ్యంతో రూపొందించింది. ఈ కారులో పక్షి రెక్కల తరహాలో తలుపులు పైకి తెరుచుకుంటాయి. వీటిని 300ఎస్ఎల్ ప్రేరణతో రూపొందించారు.

డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్

సాంకేతికంగా ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్ లో 5.4-లీటర్ సామర్థ్యం గల వి8 ఇంజన్ కలదు, ఇది సుమారుగా 617బిహెచ్‌పి పవర్ మరియు 780ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇందులో కార్బన్ సిరామిక్ బ్రేకులు కలవు, ఇవి ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ అవుతాయి.

రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్

రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్

అత్యంత అరుదైన వింటేజ్ ఆర్ఆర్ మోడల్ ఈ సిల్వర్ క్లౌడ్. రోల్స్ రాయిస్ దీనిని మూడు జనరేషన్లలో విడుదల చేసింది. 1955 నుండి 1966 మధ్య కాలంలో ఈ బాక్స్ రూపంలో ఉన్న సిల్వర్ క్లౌడ్ కార్లను రోల్స్ రాయిస్ ఉత్పత్తి చేసింది.

డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్

భారీ పరిమాణంలో ఉన్న బాడీ డిజైన్, ముందు వైపు ఇంజన్ పై భాగంలో మలుపులు తిరిగిన డిజైన్ కార్ల మీద ప్రయోగం చేస్తున్న కాలాన్ని తలపిస్తుంది. రోల్స్ రాయిస్ మొదటి తరం సిల్వర్ క్లౌడ్‌లో 4.9-లీటర్ సామర్థ్యం ఉన్న వి8, రెండవ తరం కారులో 6.2-లీటర్ ఇంజన్ అందించింది. ఇతర రోల్స్ రాయిస్ ఉత్పత్తుల్లా ఇది అత్యంత వేగవంతమైన కారు.

షెవర్లే సబర్బన్

షెవర్లే సబర్బన్

భారీ సంపన్నుడైన పారిశ్రామిక వేత్త వద్ద బలమైన వాహన శ్రేణి ఉండటం ఎంతో అవసరం అందులో భద్రత పరంగా మంచి వాహనాలను కలిగి ఉండటం మరీ ముఖ్యం. అందుకోసం జనరల్ మోటార్స్‌ మరియు ఫోర్డ్ కు చెందిన ఎస్‌యువిలను ఎంచుకున్నాడు. జనరల్ మోటార్స్ నుండి సబర్బాన్ ఎస్‌యువిని ఎంచుకున్నాడు ట్రంప్.

డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్

షెవర్లే శ్రేణిలో ఉన్న అతి పెద్ద ఎస్‌యువి బ్లాక్ సబర్బాన్. ఇది 5.3-లీటర్ వి8 మరియు 6.2-లీటర్ సామర్థ్యం గల ఇంజన్‌లతో అందుబాటులో ఉంది.

షెవర్లే కమారో

షెవర్లే కమారో

2011 లో షెవర్లే కమరో కారును లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసింది. ఈ కమారో మోడల్ కన్వర్టిబుల్ కారు. దీనిని 1969 నాటి తమ పురాతణ కమారో పేస్ కారు ఆధారంతో రూపొందించారు.

డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్

ఇందులో వి8 ఇంజన్ కలదు. ఇది సుమారుగా 400బిహెచ్‌‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను అనుసంధానం చేశారు. ఇందులో చాలా వరకు అధునాతన ఫీచర్లను అందించారు.

క్యాడిల్లాక్ ఎస్కలాడే

క్యాడిల్లాక్ ఎస్కలాడే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మద్యనే సరికొత్త ఎస్కలాడే కారును తన కార్ల గ్యారేజిలోకి ఎంచుకున్నాడు. ఇది 2014 నుండి అమ్మకాల్లో ఉంది. మునుపటి తరం ఎస్కలాడే కన్నా ఇది అధునాతన శైలిలో ఆకర్షణీయంగా ఉంది. అత్యాధునిక ప్రమాణాలతో ఉన్న ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్

ప్రఖ్యాత వ్యక్తులు మాత్రమే ఎంచుకునే ఈ కారులో 6.2-లీటర్ సామర్థ్యం ఉన్న వి8 ఇంజన్ కలదు, ఇది ఏ రకమైన ఇంధనాన్నైనా తీసుకుంటుంది, ఇది గరిష్టంగా 420బిహెచ్‌పి పవర్ మరియు 624ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

క్యాడిల్లాక్ లిమో

క్యాడిల్లాక్ లిమో

డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత ఫేవరెట్ కారు ఈ క్యాడిల్లాక్ లిమో. ట్రంప్ కోసం ప్రత్యేకంగా ఈ క్యాడిల్లాక్ లిమో కారును అభివృద్ది చేసారు. భారీ మొత్తాన్ని వెచ్చించి తయారు చేయించుకున్న ఈ కారు లోగో మీద ట్రంప్ నామాన్ని కూడా గుర్తింవచ్చు.

డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్

1980 ల కాలంలో డొనాల్డ్ ట్రంప్ ఈ కారును ప్రత్యేకంగా చేయించుకున్నాడు. ఇంటీరియర్ ను అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన ప్యాబ్రిక్ తో డిజైన్ చేయించుకున్నాడు.

 
English summary
Read In Telugu: Donald Trump Car Collection
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark