మరో టారిఫ్ బాంబ్ వేసిన ట్రంప్.. దెబ్బకు తలలు పట్టుకున్న కంపెనీలు..నవంబర్ 1 నుంచి అమలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ బాంబులు ఆగడం లేదు. దీపావళి బాణసంచా మాదిరిగా ట్రంప్ ఒకదాని తర్వాత ఒకటి టారిఫ్ బాంబులను పేలుస్తున్నారు. అమెరికా ఫస్ట్ అని వాదిస్తున్న ట్రంప్ ఇప్పుడు ఇంకో కొత్త టారిఫ్‌లను ప్రకటించారు. నవంబర్ 1 నుండి అన్ని దిగుమతి చేసుకున్న ట్రక్కులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. విదేశీ పోటీ నుండి అమెరికాను రక్షించడానికి తాను ఈ టారిఫ్‌ను విధిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్ మేడ్ ఇన్ అమెరికాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెరికన్ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆయన దిగుమతులపై టారిఫ్‌ను పెంచుతున్నారు. ఆయన అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి టారిఫ్‌లను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆయన నవంబర్ 1 నుండి భారీ ట్రక్కుల దిగుమతిపై 25 శాతం టారిఫ్‌ను ప్రకటించారు. భారీ ట్రక్కులతో పాటు మీడియం ట్రక్కులపై కూడా 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు తెలిపారు.

Donald Trump s New Tariff Bomb 25 Duty on Imported Heavy Trucks from November 1

ట్రంప్ మొదట ఈ సుంకాన్ని అక్టోబర్ 1 నుండి అమలు చేస్తామని హెచ్చరించారు.. కానీ ఇప్పుడు దానిని ఒక నెల పాటు వాయిదా వేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‎లో పోస్ట్ చేస్తూ.. నవంబర్ 1, 2025 నుండి, ఇతర దేశాల నుండి యునైటెడ్ స్టేట్స్ లోకి వచ్చే అన్ని మీడియం, హెవీ ట్రక్కులపై 25% టారిఫ్ విధించబడుతుంది" అని రాశారు.

ట్రంప్ ఈ చర్య ప్రధాన ఉద్దేశ్యం అమెరికన్ ట్రక్కుల తయారీదారులను విదేశీ పోటీ నుండి రక్షించడం. ఈ సుంకం పిటర్‌బిల్ట్, కెన్‌వర్త్, ఫ్రైట్‌లైనర్ వంటి అమెరికన్ కంపెనీలకు లాభం చేకూరుస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ టారిఫ్ అమెరికాకు పెద్ద ఎత్తున ట్రక్కులను ఎగుమతి చేసే దేశాలకు పెద్ద ఎదురుదెబ్బ.

Donald Trump s New Tariff Bomb 25 Duty on Imported Heavy Trucks from November 1

తన ఈ నిర్ణయంతో అమెరికన్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుందని ట్రంప్ వాదిస్తున్నారు. ట్రంప్ ఈ నిర్ణయంతో డెలివరీ ట్రక్కులు, చెత్త ట్రక్కులు, ట్రాన్సిట్, షటిల్, స్కూల్ బస్సులు, ట్రాక్టర్-ట్రైలర్ ట్రక్కులతో పాటు హెవీ-డ్యూటీ కమర్షియల్ వెహికల్స్ దిగుమతులు కూడా ఖరీదైనవిగా మారతాయి.

ఈ నిర్ణయం అమెరికాకు హెవీ వెహికల్స్, ట్రక్కులు ఎగుమతి చేసే దేశాలపై ప్రభావం చూపుతుంది. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కమర్షియల్ విభాగం ప్రకారం.. ఈ కొత్త టారిఫ్ మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ, ఫిన్‌లాండ్ వంటి దేశాలపై అత్యధిక ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అమెరికా అత్యధికంగా హెవీ వెహికల్స్ కొనుగోలు చేసే టాప్ 5 దేశాలు ఇవే.

Donald Trump s New Tariff Bomb 25 Duty on Imported Heavy Trucks from November 1

ట్రంప్ ఈ నిర్ణయంతో విదేశీ కంపెనీల దిగుమతులు ఖరీదైనవిగా మారతాయి. ఎగుమతులు తగ్గితే అమెరికన్ కంపెనీలకు అవకాశాలు వస్తాయి. ఈ నిర్ణయం అమెరికన్ ఆటో పరిశ్రమకు బలాన్ని ఇస్తుంది. ఫోర్డ్, టెస్లా వంటి కంపెనీలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. టెస్లా ఎలన్ మస్క్ కంపెనీ అని మనకు తెలుసు. మస్క్, ట్రంప్ సంబంధాలు ప్రస్తుతం అంత మంచిగా లేనప్పటికీ ఎన్నికల సమయంలో ప్రపంచంలోని అత్యంత ధనిక వ్యక్తి, టెస్లా యజమాని ట్రంప్‌కు చాలా సహాయం చేశారు.

యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకారం.. అమెరికాలో దాదాపు 20 లక్షల మంది భారీ ట్రక్కుల డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు మెకానిక్స్, సహాయక సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఈ సుంకం దిగుమతి చేసుకున్న ట్రక్కుల ధరలను గణనీయంగా పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీని చివరి భారం వినియోగదారులు, ట్రక్కింగ్ కంపెనీలపై పడవచ్చు. అయితే ఈ నిర్ణయం అమెరికన్ దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే ట్రంప్ వాణిజ్య వ్యూహంలో భాగం.

More from DriveSpark

Article Published On: Tuesday, October 7, 2025, 12:56 [IST]
English summary
Donald trump s new tariff bomb 25 duty on imported heavy trucks from november 1
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+