బ్రేకింగ్ న్యూస్.. వారంలో ఆ రోజు పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. ఎక్కడనుకుంటున్నారా..!!

భారతదేశంలో రోజురోజుకి వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన దీపావళి పండుగ తరువాత ఈ కాలుష్యం తీవ్రత మరింత ఎక్కువైపోయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా వాతావరణంలో గాలి యొక్క నాణ్యత బాగా తగ్గిపోయింది. దీనికి డీజిల్ మరియు పెట్రోల్ వాహనాల వాడకం కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దేశ రాజధాని నగరం ఢిల్లీలో మరింత ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్‌ అమలు చేయాలనీ ఆలోచిస్తోంది.

బ్రేకింగ్ న్యూస్.. వారంలో ఆ రోజు పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. ఎక్కడనుకుంటున్నారా..!!

భారతదేశంలో ఈ వాయు కాలుష్యం తీవ్రత కేవలం ఒక్క ఢిల్లీ నగరంలో మాత్రమే కాకుండా, దేశంలోని ఇతర ప్రధాన నగరాలలో కూడా ఉంది. దక్షిణ భారత రాష్ట్రాలలో కూడా కాలుష్య తీవ్రత ఎక్కువగానే ఉంది. వాతావరణంలో వాయు కాలుష్య నియంత్రణకు దేశంలోని అన్ని రాష్ట్రాలు తగిన చర్యలను తీసుకుంటున్నాయి.

బ్రేకింగ్ న్యూస్.. వారంలో ఆ రోజు పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. ఎక్కడనుకుంటున్నారా..!!

ఇందులో భాగంగానే వాయు కాలుష్య సమస్యను నియంత్రించేందుకు తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను ఉద్యోగులు ప్రతి బుధవారం కార్యాలయానికి తీసుకురాకూడని ఒక నిబంధన అమలుచేసింది. దీనిపై తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు.

బ్రేకింగ్ న్యూస్.. వారంలో ఆ రోజు పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. ఎక్కడనుకుంటున్నారా..!!

తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జరీ చేసిన ఈ నిబంధనల వల్ల రాష్ట్రంలో వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతుందని, తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఉదయన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కావున కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులందరూ ఇంధన వాహనాలను వినియోగించరాదు.

బ్రేకింగ్ న్యూస్.. వారంలో ఆ రోజు పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. ఎక్కడనుకుంటున్నారా..!!

ఈ విధమైన నిర్ణయం వల్ల తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయ ఆవరణలో ప్రతి బుధవారం వాయు కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. దీని వల్ల వాయు కాలుష్యం దాదాపు 20% తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు బదులుగా బుధవారం రోజు బస్సులు, సైకిళ్లు మరియు ఎలక్ట్రిక్ వాహనాలు వంటి పబ్లిక్ వాహనాలను ఉపయోగించవచ్చు.

బ్రేకింగ్ న్యూస్.. వారంలో ఆ రోజు పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. ఎక్కడనుకుంటున్నారా..!!

అయితే ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి వారు అనుమతించారు. తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకున్న ఈ చర్యను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో చాలామంది అభినందిస్తున్నారు. తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న ఈ చర్య తమిళనాడు ప్రభుత్వంలోని ఇతర శాఖలకు మినహాయింపు కాదు. ఈ ఉత్తర్వుల అమలును అధికారులు పకడ్బందీగా పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

బ్రేకింగ్ న్యూస్.. వారంలో ఆ రోజు పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. ఎక్కడనుకుంటున్నారా..!!

భారతదేశంలోని కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఇది చాలామందికి ఆదర్శంగా ఉంటుంది. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుతాయి.

బ్రేకింగ్ న్యూస్.. వారంలో ఆ రోజు పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. ఎక్కడనుకుంటున్నారా..!!

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో భారతదేశంలో త్వరలో మరింత ముందుకు సాగుతుంది. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ఇప్పుడు ప్రభుత్వాలు రాయితీలు కూడా అందజేస్తున్నారు. కావున ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు వంటివి చెల్లించాల్సిన అవసరం లేదు.

బ్రేకింగ్ న్యూస్.. వారంలో ఆ రోజు పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. ఎక్కడనుకుంటున్నారా..!!

అంతే కాకుండా దేశీయ మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న డీజిల్ మరియు పెట్రోల్ ధరల కారణంగా సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. భారత మార్కెట్లో అతి తక్కువ ధరకు లభ్యమయ్యే ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కావున ఎక్కువమంది ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

బ్రేకింగ్ న్యూస్.. వారంలో ఆ రోజు పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. ఎక్కడనుకుంటున్నారా..!!

రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు, ఎలక్ట్రిక్ కార్లతో సహా అనేక ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన కోలుకోలు చేసే వారికీ కేంద్ర ప్రభుతం అందించే ఫేమ్2 స్కీమ్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఢిల్లీ మరియు గుజరాత్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు సబ్సిడీని అందిస్తాయి.

బ్రేకింగ్ న్యూస్.. వారంలో ఆ రోజు పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. ఎక్కడనుకుంటున్నారా..!!

ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉండవు అని చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. అంతే కాకుండా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా అమ్ముడవ్వడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి కంపెనీలకు ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తున్నాయి.

Most Read Articles

English summary
Dont use petrol diesel vehicles on wednesday s tamil nadu pollution control board to employees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X