లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా.. అయితే ఇలాంటి డ్రస్ వేసుకోవద్దు.. ఎందుకంటే?

సమాజంలో చాలా మందికి ఎక్కువగా లాంగ్ డ్రైవ్స్ వెళ్లే అలవాటు ఉంటుంది. లాంగ్ డ్రైవ్ వెళ్లాలంటే ఎన్నెన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని బయలుదేరుతారు. అయితే ప్రయాణంలో ఎలాంటి అవరోధాలు జరగకుండా అన్ని సమకూర్చుకునే వారు, వారి వస్త్రధారణ విషయంలో మాత్రం కొంత ఏమరుపాటుగా ఉండిపోతారు.

లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా.. అయితే ఇలాంటి డ్రస్ వేసుకోవద్దు.. ఎందుకంటే?

నివేదికల ప్రకారం సౌరభ్ శర్మ అనే 30 ఏళ్ల వ్యాపారవేత్త తరచూ లాంగ్ డ్రైవ్‌ల కోసం వెళ్లేవాడు. అలాంటి వ్యక్తి ఇటీవల హాస్పిటల్ లో మంచానికి పరిమితమయ్యాడు. దీనికి ప్రధాన కారణం, లాంగ్ డ్రైవ్ సమయంలో బాగా బిగుతైన బట్టలు ధరించడం అని తెలిసింది.

లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా.. అయితే ఇలాంటి డ్రస్ వేసుకోవద్దు.. ఎందుకంటే?

సౌరభ్ శర్మ ఇటీవల ఢిల్లీ నుండి హృషికేశ్ వెళ్ళాడు. ఈ సందర్భంలో వారి కాలులోని సిరలు బాగా స్తంభించిపోయాయి. ఇటువంటి పరిస్థితిని వైద్య పరిభాషలో డీప్ వైన్ త్రాంబోసిస్ (డివిటి) అంటారు. దీని వల్ల రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం వల్ల రక్త నాళాలు వాటి ఊపిరితిత్తులలోకి వెళ్లి పల్మనరీ ఎంబాలిజం లేదా పల్మనరీ ధమనులలో రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది.

లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా.. అయితే ఇలాంటి డ్రస్ వేసుకోవద్దు.. ఎందుకంటే?

ఇది గుండె మరియు మెదడుతో సహా ప్రధాన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిలిపేస్తుంది. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. సౌరబ్ శర్మకి ఇదే జరిగింది. కావున ఇతడు అపస్మారక స్థితిలో, కుప్పకూలి ఆసుపత్రి పాలయ్యాడు. అతన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేర్చారు, అక్కడ అతనికి లో బ్లడ్ ప్రెజర్ మరియు లో పల్స్ రేటు ఉన్నట్లు కనుగొనబడింది.

లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా.. అయితే ఇలాంటి డ్రస్ వేసుకోవద్దు.. ఎందుకంటే?

అనేక పరీక్షల తరువాత, సౌరభ్ శర్మకు గుండె సంబంధిత వ్యాధులు లేవని ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు. అయితే కొన్ని పరీక్షల తర్వాత సౌరభ్ శర్మ ఎడమ కాలులో డివిటితో బాధపడుతున్నట్లు గుర్తించారు. అతను అపస్మారక స్థితిలో పడిపోయాడు. లాంగ్ డ్రైవ్ కారణంగా పల్మనరీ ఎంబాలిజానికిగురైనట్లు వైద్యులు తెలిపారు.

లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా.. అయితే ఇలాంటి డ్రస్ వేసుకోవద్దు.. ఎందుకంటే?

అతన్ని పరీక్షించిన వైద్యులు, అతను లాంగ్ డ్రైవ్‌కు వెళ్ళినప్పుడు బిగుతైన జీన్స్ వంటి వంటిని ధరించి ఉంటాడని చెప్పారు. లాంగ్ డ్రైవ్ సమయంలో, సౌరభ్ శర్మ టైట్ జీన్స్ ధరించి టాప్ ఎండ్ ఆటోమేటిక్ కారు నడుపుతున్నాడు. ఆటోమేటిక్ కారులో చాలా గంటలు ఎడమ కాలు కదలకుండా, గట్టి జీన్స్ ధరించడం రక్తం గడ్డకట్టడానికి కారణమని తెలిసింది.

లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా.. అయితే ఇలాంటి డ్రస్ వేసుకోవద్దు.. ఎందుకంటే?

లాంగ్ డ్రైవ్ మధ్యలో అక్కడక్కడా తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. అంతే కాకూండా శరీరానికి కావాల్సిన గాలి మొదలైనవి వెళ్ళడానికి అనుకూలంగా ఉండే బట్టలు కూడా ధరించడం. ప్రస్తుతం పాశ్చాత్య సంస్కృతిలో బతికేస్తున్నాం, ఈ కారణంగానే వస్త్రధారణ కూడా దానికి తగినట్లు వేస్తున్నాం. కానీ దానివల్ల వచ్చే అనర్థాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. లేకుంటే ప్రమాదాలను గురికావలసి వస్తుంది.

Most Read Articles

English summary
Long Drive In Tight Jeans Is Very Risky. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X