Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుడ్ న్యూస్.. కరోనా టెస్టింగ్ కోసం ఇప్పుడు డ్రైవ్-త్రూ ల్యాబ్
కరోనా వైరస్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా అపారమైన నష్టాన్ని కలిగించింది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఈ భయంకరమైన వైరస్ ని నయం చేయడానికి చాలా ఇబ్బందులు మరియు సవాళ్లు ఎదుర్కొంటున్నారు.

వైద్య రంగంలో అభివృద్ధి చెందిన చాలా అగ్ర దేశాలు కూడా ఈ వైరస్ పరిష్కారం కోసం కష్టపడుతున్నాయి. ఈ కారణంగానే ప్రపంచంలోని చాలా దేశాలు తమ పౌరులను ఇంటి నుండి బయటికి రాకూడదని తెలిపారు. అంతే కాకుండా ప్రజలందరూ సామజిక దూరాన్ని కూడా పాటించాలని తెలిపారు.

ఈ నేపథ్యంలో భారతదేశంలో లాక్ డౌన్ వంటి చర్యలు తీసుకుంటున్నారు. భారతదేశంలో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందటం వల్ల 2020 ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించే అవకాశం కూడా ఉంది.

భారతదేశంలోని కొన్ని హాస్పిటల్స్ మాత్రమే కరోనావైరస్ నివారణకు పాటు పడుతున్నాయి. ఎందుకంటే సరైన వైద్య పరికరాలు అందుబాటులో లేనందున కొన్ని పెద్ద వైద్యశాలలో మాత్రమే కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. భారతదేశం వంటి అధిక జనాభా కలిగిన దేశంలో, ఇప్పుడు అందుబాటులో ఉన్న సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితులను పరిష్కరించడానికి ఆయా రాష్ట్రాలు కొత్త ప్రయోగశాలలను మరియు కృత్రిమ హాస్పిటల్స్ తయారు చేస్తున్నాయి. కరోనా ఎక్కువగా విస్తరిస్తున్న తరుణంలో కరోనా పరీక్షా వస్తు సామగ్రిని దిగుమతి చేసుకోవడంతో పాటు వీటిని తయారు చేయడంలో కూడా కొన్ని ఆటో పరిశ్రమలు పాటుపడుతున్నాయి.

కరోనా అధికంగా విస్తరిస్తున్న నేపథ్యంలో డాక్టర్ డాంగ్స్ ల్యాబ్ కరోనా కోసం డ్రైవ్-త్రూ ప్రయోగశాలను అభివృద్ధి చేసినట్లు సమాచారం అందింది. భారతదేశంలో కరోనా కోసం అభివృద్ధి చేసిన మొదటి డ్రైవ్-త్రూ ల్యాబ్ ఇది.

ఈ సమాచారం ANI వెబ్‌సైట్ ద్వారా అందించబడింది. అదనంగా కంపెనీ మొబైల్ ల్యాబ్ గురించి మరింత సమాచారం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు. తనిఖీ కోసం వచ్చిన వారి నమూనాలను కారులోనే నిల్వ చేస్తారు. వారు ఏ కారణం చేతనైనా కారు నుండి దిగవలసిన అవసరం లేదు.

డ్రైవ్-త్రూ అంటే ఏమిటి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. డ్రైవ్-త్రూ అంటే వచ్చిన కారులోనే శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఈ రకమైన ల్యాబరేటరీస్ విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఇప్పుడు మనదేశంలో ఢిల్లీలో మాత్రమే ఉంది.

డాక్టర్ డాంగ్స్ ల్యాబ్‌కు అవసరమైన అన్ని పరికరాలు ఇందులో ఉంటాయి. ఇది ఒక చిన్న గుడారం లాగా రూపొందించబడింది. నమూనాలను ఇచ్చిన తర్వాత వోచర్‌ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. నమూనా నివేదిక తీసుకోవడానికి ప్రయోగశాలకు రావాల్సిన అవసరం కూడా లేదు.
టెస్ట్ చేసిన రిపోర్టులు ఇమెయిల్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా పంపబడతాయి. ఈ ప్రత్యేక ప్రయోగశాలలో పనిచేసే సిబ్బందికి వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన భద్రత కల్పించారు. సిబ్బందికి రక్షణ దుస్తులు, పరికరాలు మరియు క్రిమిసంహారక మందులు అందిస్తారు.

డాక్టర్ డాంగ్స్ ల్యాబ్ నుండి ఈ సేవ పొందడానికి మీరు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కరోనా వైరస్‌తో పోరాడుతున్న ప్రభుత్వానికి అనేక విధాలుగా సహాయం చేయడానికి చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో డాక్టర్-డాంగ్ ల్యాబ్‌కు డ్రైవ్-త్రూ టెస్టింగ్ ల్యాబ్ కూడా చాలా సహాయపడుతుంది.