న్యూ ఇయర్‌లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

ప్రపంచదేశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంతో అట్టహాసంగా జరిగేవి. కానీ ఈ సారి కరోనా మహమ్మారి వల్ల భారతదేశంలో కొత్త సంవత్సర వేడుకలు చెప్పుకోదగ్గ విధంగా జరగలేదు. దీనికి ప్రధాన కారణం ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమికూడటం వల్ల కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందనే కారణంతో ప్రభుత్వాలు ఎన్నో కట్టు దిట్టమైన ఆంక్షలు విధించాయి.

భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

కొత్త సంవత్సర వేడుకల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా మద్యం తాగి రోడ్లపై రేసింగ్ వంటి వాటిలో పాల్గొనడమే కాకుండా, పబ్లిక్ ని కూడా బాగా ఇబ్బందిపెట్టేవారు. ఈ సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరిగి ఎంతోమంది గాయపడటమే కాకుండా, ప్రాణాలను సైతము కోల్పోతారు. ప్రతి సారి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో లెక్కకు మించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యేవి, కానీ ఈ సారి దీనికి పూర్తిగా భిన్నంగా మారింది.

భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగిన 35 మందిని మాత్రమే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మునుపటి సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా తగ్గిప్యాయని తెలుస్తోంది. గతేడాది నూతన సంవత్సర వేడుకల్లో దాదాపు 677 మంది మద్యం తాగి ముంబైలో చిక్కుకున్నారు.

MOST READ:యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చిక్కుకున్న వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలపాటు నిలిపివేసినట్లు కోర్టు ఆదేశాలను జరీ చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం తాగి ద్రియే చేసిన కేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా వైరస్ విస్తరిస్తుందనే నేపథ్యంలో ముంబైలో నైట్ కర్ఫ్యూ అమలు చేయబడింది.

భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

ముంబైలో ఈ కర్ఫ్యూ రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుంది. ఈ సమయంలో అనవసరంగా ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని ప్రజలకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ నైట్ కర్ఫ్యూ జనవరి 5 వరకు అమల్లో ఉంటుంది.

MOST READ:కొత్త సంవత్సరంలో కొత్త పనికి శ్రీకారం చుట్టిన జగన్ ప్రభుత్వం.. అదేంటో తెలుసా !

భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

ప్రస్తుతం ముంబైలో నైట్ కర్ఫ్యూ ఉన్నందు వల్ల ప్రజలు తొందరగా ఇల్లు చేరుకోవాలని పోలీసులు తెలిపారు. ఈ కర్ఫ్యూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను తగ్గిస్తుందని పోలీసులు ప్రకటించించారు. నైట్ కర్ఫ్యూ వల్ల ముంబై వీధులు జన సంచారం లేకుండా బోసిపోయాయి.

భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై పోలీసులు అవగాహన పెంచుతున్నారు. అంతే కాకుండా మద్యం తాగి వాహనం నడిపే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఈ కఠినమైన నిబంధనలు కొత్త సంవత్సరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా తగ్గిపోతాయి.

MOST READ:కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో రోడ్డుప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం మద్యం తాగి డ్రైవ్ చేయడం. నూతన సవత్సరం కారణంగా ఎక్కువమంది ప్రజలు మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలను కోరి తెచ్చుకుంటారు. కాబట్టి న్యూ ఇయర్ రోజు పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఈ ఏడాది దేశంలోని చాలా నగరాల్లో కరోనా వైరస్ కారణంగా నూతన సంవత్సర వేడుకలకు ఆంక్షలు విధించారు.

భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

ముంబై ఒక్కటి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చాలా నగరాలలో న్యూ ఇయర్ వేడుకలకు ఎక్కువ ఆంక్షలు విధించారు. కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించకూడదనే నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భారతదేశంలోని చాలా నగరాలు 2020 డిసెంబర్ 31 రాత్రి ప్రజా రవాణా లేకుండా నిర్మానుష్యంగా మారాయి. కర్ణాటక కూడా దీనికి మినహాయింపు కాదు. డిసెంబర్ 31 మధ్యాహ్నం 12 నుండి బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేయబడింది. ఏది ఏమైనా ఈ కట్టు దిట్టమైన ఆంక్షలు వల్ల ప్రమాదాలు చాలా తగ్గిపోయే అవకాశం ఉంది.

MOAT READ:గుడ్ న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ చూడండి

Note: Images used are for representational purpose only.

Most Read Articles

English summary
Drink And Drive Cases Reduced This Time On 31st December. Read in Telugu.
Story first published: Saturday, January 2, 2021, 9:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X