మహిళా డ్రైవర్‌కు ఆటో గిఫ్ట్‌గా అందించిన డ్రైవర్ జమున చిత్ర బృందం: ఐశ్వర్య రాజేశ్ చేతుల మీదుగా..
ప్రముఖ నటి 'ఐశ్వర్య రాజేశ్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. ఎందుకంటే రాంబంటు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేసిన ఈమె కౌస్యల్య కృష్ణమూర్తి సినిమాతో బాగా పాపులర్ అయింది.
ఐశ్వర్య రాజేశ్ ఇటీవల విడుదలైన డ్రైవర్ జమున అనే సినిమాలో నటించిన విషయం తెలిసింది. ఈ సినిమాలో ఈమె డ్రైవర్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. కాగా ఇటీవల ఐశ్వర్య రాజేశ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చాలా మంది మహిళ ఆటో డ్రైవర్లను కలిశారు. ఇందులో ఒక మహిళకు ఆటోని చిత్ర బృందం గిఫ్ట్ గా కూడా ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఐశ్వర్య రాజేష్ తో మహిళ ఆటో డ్రైవర్లు తమ అనుభవానలు కూడా పంచుకున్నారు. ఆ ఆటో డ్రైవర్లు వారు జీవితంలో ఎలాంటి కష్టాలను అనుభవించారు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఐశ్వర్య రాజేష్ ఈ సందర్భంగా 40 మంది మహిళా ఆటో డ్రైవర్లను ఒకే స్టేజి మీద కలుసుకుంది. ఇందులో ఒక మహిళా ఆటో డ్రైవర్ ని చిత్ర బృందం ఎంపిక చేసి ఆటో ఒక ఆటో ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
చిత్ర బృందం ఎంపిక చేసిన మహిళకు ఒక కొత్త ఆటో కూడా గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఈ కొత్త ఆటోకి సంబంధించిన 'కీ' (తాళం) ఐశ్వర్య రాజేష్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్ర బృందం ఆ మహిళ ఆటో డ్రైవర్ కు ఆటో ఇవ్వడంతో ఆమె కొంత సేపు షాక్ కి గురైంది.
డ్రైవర్ జమున చిత్ర యూనిట్ చేసిన ఈ పనికి పలువురు సోషల్ మీడియా ద్వారా అభినందిస్తున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం మరియు అభినందనీయం. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు అరుదుగా జరుగుతుంటాయి. గతంలో సమంత ఒక మహిళా ఆటో డ్రైవ్ కి కార్ గిఫ్ట్ ఇచ్చింది. సమంత అందించిన ఆ కారు ఖరీదు రూ. 7.50 లక్షలు అని కారు అందించిన షో రూమ్ యాజమాన్యం తెలిపింది.
సాదరంగా ఏదైనా సినిమా మంచి విజయం సాధిస్తే ప్రొడ్యూసర్లు హీరోలకు లేదా డైరెక్టర్లకు ఖరీదైన కార్లు లేదా ఇతర గిఫ్ట్స్ అందించడం గురించి గతంలో చదువుకున్నాం. అయితే డ్రైవర్ జమున చిత్ర బృందం దానికి భిన్నంగా ఒక పేద మహిళకు ఆటో గిఫ్ట్ గా ఇచ్చింది. నిజానికి ఇలాంటి సంఘటను వెలుగులోకి రావడం చాలా అరుదు. ఇలాంటి కార్యక్రమాలు జరిపితే కొంతమంది పేదలు ఉపాధి పొందుతారు.
డ్రైవర్ జమున చిత్ర బృందం చేసిన విధంగా అందరూ చేసినట్లయితే కొంతమంది జీవితాలు బాగుపడతాయి. చిత్ర బృందాలు కూడా తప్పకుండా దీనిని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాము. మహిళలు కూడా అన్ని రంగాల్లో వృద్దలోకి వస్తున్న సమయంలో ఇలాంటి ప్రోత్సాహాకాలు అవసరం. కొంతమంది ఏ ఆసరా లేకుండా ఎదుగుతుంటారు, అలాంటి వారు జీవితంలో ఎదగటానికి మరియు అభివృద్ధి చెందటానికి వారికి కొంత ఆసరా భరోసా తప్పకుండా అవసరం.
ఇక ఐశ్వర్య రాజేష్ విషయానికి వస్తే మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి సినిమాలలో నటించింది. అయితే ప్రస్తుతం తమిళం మరియు తెలుసు సినిమాల్లో బిజీగా ఉంది, తెలుగులో ఐశ్వర్య రాజేష్ అంత పెద్ద సక్సెస్ సాధించనప్పటికీ నేచురల్ బ్యటీగా అందరి మనసుని దోచేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








