కోరిక తీర్చుకోవడానికి పోలీస్ కారునే కొట్టిసిన ఘనుడు.. చివరికి ఏం జరిగిందంటే?

భారతదేశంలో రోజురోజుకి దొంగతనం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ దొంగతనం కేసులు ఏ పార్కింగ్ ప్రదేశాల్లోనో, రాత్రిల్లో ఇంటిబయట పార్క్ చేసిన వాహనాలను దొగతనం చేసి ఉండటం గురించి ఇప్పటికే చాలా కథనాల్లో తెలుసుకుని ఉంటారు. అయితే ఇటీవల కర్ణాటకలో ఒక విచితమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కోరిక తీర్చుకోవడానికి పోలీస్ కారునే కొట్టిసిన ఘనుడు.. చివరికి ఏం జరిగిందంటే?

నివేదికల ప్రకారం, కర్ణాటక రాష్ట్రంలో ఒక పోలీస్ స్టేషన్‌లో పార్క్ చేసిన ఒక కారు దొగతనం చేయబడింది. వినడానికి ఇది కొంత విచిత్రంగా ఉన్న, ఇది మాత్రం నిజం. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హల్ చల్ చేస్తోంది. అయితే చివరకు దీనికి కారకుడైన వ్యక్తి పోలీస్ స్టేటన్ లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

కోరిక తీర్చుకోవడానికి పోలీస్ కారునే కొట్టిసిన ఘనుడు.. చివరికి ఏం జరిగిందంటే?

ఈ సంఘటన అనిగేరి పోలీస్ స్టేషన్ లో జరిగినట్లు తెలిసింది. నిందితుడిని అన్నిగ్రీ టౌన్‌షిప్‌లో ఉండే నాగప్పగా పోలీసులు గుర్తించారు. అతను ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని వయసు 45 సంవత్సరాలు. అయితే అతనికి ఎప్పటినుంచో పోలీస్ కారు నడపాలని ఆసక్తి ఉండది. ఈ కారణంగా గత మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అనిగేరి పోలీస్ స్టేషన్ వెలుపల ఆగి ఉన్న పోలీసు జీపును ఓ వ్యక్తి తీసుకెళ్లిపోయాడు. ఆ టైంలో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు స్టేషన్ లోపల ఉన్నారు.

కోరిక తీర్చుకోవడానికి పోలీస్ కారునే కొట్టిసిన ఘనుడు.. చివరికి ఏం జరిగిందంటే?

దొగలించబడిన ఈ కారులో నిందితుడు దాదాపు 112 కిలో మీటర్లు ప్రయాణం చేశాడు. అయితే జీప్ కనిపించకపోవడంతో పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనిజేరి పట్టణానికి 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటేబెన్నూర్ హవేరీ ప్రాంతంలో జీపును నడిపిన నిందితుడు చాలాసేపు రోడ్డు పక్కన దానిని ఆపి అందులో పడుకున్నాడు.

కోరిక తీర్చుకోవడానికి పోలీస్ కారునే కొట్టిసిన ఘనుడు.. చివరికి ఏం జరిగిందంటే?

ఆ సమయంలో అక్కడి ప్రజలు ఆ కారులో ఉన్నది పోలీస్ కాదని నిర్దారించుకుని, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నాగప్పకు కర్ణాటక రాష్ట్రమంతా పర్యటించిన అనుభవం ఉంది. పక్క రాష్ట్రాలకు కూడా వాహనాలు నడిపాడు. కావున ఇతనికి డ్రైవింగ్ గురించి మంచి అనుభవం ఉంది.

కోరిక తీర్చుకోవడానికి పోలీస్ కారునే కొట్టిసిన ఘనుడు.. చివరికి ఏం జరిగిందంటే?

దొంగలించబడిన వాహనం మహీంద్రా బోలెరోగా గుర్తించబడింది. దొంగలించబడిన సమయంలో ఆ కారుకి తాళం కూడా కారులోనే ఉంది. ఈ కారణంగా అతడు అవలీలగా దానిని తీసుకెళ్లిపోగలిగాడు. అయితే ప్రజల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన పోలీసులు అది పోలీస్ వాహనం అని గుర్థించి, ఆనిగేరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోరిక తీర్చుకోవడానికి పోలీస్ కారునే కొట్టిసిన ఘనుడు.. చివరికి ఏం జరిగిందంటే?

అనిగెరె పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు కారుని సొతం చేసుకున్నారు. అయితే చివరికి పోలీసులు అతనిని విచారించారు. ఈ విచారణలో అతడు దొంగలించినట్లు నిర్దారణ అయ్యింది. అయితే మోట్పెన్నూరుకు ఎందుకు వెళ్లాడు? అందుకు గల కారణం మాత్రం బయటపెట్టలేదు.

కోరిక తీర్చుకోవడానికి పోలీస్ కారునే కొట్టిసిన ఘనుడు.. చివరికి ఏం జరిగిందంటే?

పోలీసులు నాగప్పపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నాగప్ప పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అయితే అరెస్టయిన నాగప్ప ఒక మానసిక రోగిలా కనిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దొంగతనం అతని మొదటి నేరమని పోలీసులు తెలిపారు. అయితే పోలీస్ కారు నడపాలనే కోరిక మాత్రం నెరవేరింది. కానీ అతడు జైలుపాలయ్యాడు.

కోరిక తీర్చుకోవడానికి పోలీస్ కారునే కొట్టిసిన ఘనుడు.. చివరికి ఏం జరిగిందంటే?

ఇక మహీంద్రా బొలెరో విషయానికి వస్తే, ఇది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం మహీంద్రా కారు. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటివరకు కూడా మంచి అమ్మకాలను పొందుతోంది. దీనికి ప్రధాన కారణం బొలెరో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బిఎస్-6 బొలెరో మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి బి 4, బి 6 మరియు బి 6 (ఓ). ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం కొత్త బొలెరో బి 6 (ఓ) టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 8.99 లక్షలు.

కోరిక తీర్చుకోవడానికి పోలీస్ కారునే కొట్టిసిన ఘనుడు.. చివరికి ఏం జరిగిందంటే?

ఇదిలా ఉండగా ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ బడ్జెట్ ఎస్‌యూవీ మహీంద్రా బొలెరోలో కంపెనీ ఓ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సరికొత్త డిజైన్ అప్‌డేట్స్ మరియు లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ తమ కొత్త 2021 మహీంద్రా బొలెరోను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహీంద్రా బ్రాండ్ నుండి చాలా కాలంగా మార్కెట్లో ఉండి, అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో బొలెరో ఒకటిగా కొనసాగుతోంది.

Article Published On: Friday, February 18, 2022, 15:16 [IST]
English summary
Driver steals police mahindra bolero to fulfill his dream
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+