దేశంలోనే తొలిసారిగా భారీ ఎత్తైన భవనాల మీదుగా మెట్రో ట్రైన్‌ సేవలు.. ఎక్కడంటే.!!

విదేశాల్లో భారీ ఎత్తైన భవనాల మధ్య రైళ్లు పరిగెత్తడం మనం చూశాం. కానీ భారత్‌లో ఇలా భవన అంతస్థుల మధ్యలో నుంచి వెళ్లే రైళ్లను మనం చూడలేదు. రైళ్ల లైన్లకు ప్రత్యేక మార్గాలనే ఏర్పాటు చేస్తారు. కానీ తొలిసారిగా భారత్‌లో కూడా ఇలా భవనాల మధ్య రైళ్లు వెళ్లడాన్ని మనం త్వరలో చూడబోతున్నాం. ఇంతకీ ఇది ఎక్కడ.. పూర్తి సమాచారం ఈ కథనంలో..

సాధారణంగా అపార్ట్‌మెంట్‌లలో బాల్కనీలోంచి నిలబడి ఔట్‌సైడ్‌ వ్యూను చూస్తూ టీ, స్నాక్స్‌ను ఎంజాయ్‌ చేయడం చాలా మంది అలవాటు. మెట్రో రైళ్ల సర్సీసులు అందుబాటులోకి వచ్చాక ఇక సిటీ వ్యూ చాలా అందంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక అపార్ట్‌మెంట్‌లో నుంచే మెట్రో రైళ్లు వెళ్తుంటే.. ఆ ఊహే అందంగా ఉంది కదా.. త్వరలో భారత్‌లో ఇలాంటి వ్యూను ఆనందించవచ్చు.

Metro-Train-Through-12-Storey-Building

తమిళనాడు రాజధాని చెన్నైలో త్వరలో ఎత్తైన భవనాల మధ్య రైళ్ల రాకపోకలు(Chennai Metro Via 12 Storey Building) జరగనున్నాయి. ఈ మేరకు చెన్నై మెట్రో రైల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం చెన్నై మెట్రో ఫేజ్‌ 2లో రైలు నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ దశలో ఈ నోటిఫికేషన్‌ విడుదలైంది.

చెన్నైలోని దాదాపు మూడు ప్రాంతాల్లో ఈ తరహా భవనాల(Metro Trains Through 12 Storey Building) మధ్య డ్రైవర్‌లెస్‌ మెట్రో రైళ్లు ప్రయాణించనున్నట్లు చెన్నై మెట్రో వెల్లడించింది. ఇందుకోసం 12 అంతస్తుల భవనాలను నిర్మించాల్సి ఉంది. మొదటగా తిరుమంగళంలో ఈ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ 12 అపార్ట్‌మెంట్ భవనాల్లోని 3 అంతస్తుల మీదుగా రైళ్ల రాకపోకలు జరగనున్నాయి.

Metro-Train-Through-12-Storey-Building

అయితే ఈ భవనాలు ఎలా ఉంటాయి.. వీటి మీదుగా రైళ్లు ఎలా ప్రవేశించి ప్రయాణిస్తాయి అనే కాన్సెప్ట్ చిత్రాలను చెన్నై మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది. తిరుమంగళం తర్వాత కోయంబేడు, తిరుమలై ప్రాంతాల్లోని 12 అపార్ట్‌మెంట్‌ భవనాల మధ్య రైళ్లు ప్రయాణించేలా చేసే యోచనలో చెన్నై మెట్రో ఉంది.

అయితే ఈ 12 అపార్ట్‌మెంట్ భవనాలు నివాసయోగ్యం కాదని, మెట్రో పరిపాలనకు మాత్రమే ఉపయోగపడతాయని చెన్నై మెట్రో రైల్‌ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. మెట్రో ట్రైన్‌లో ప్రయాణించాలనుకునేవారు ట్రైన్‌ వచ్చే లోపల.. ఓ టీ లేదా కాఫీని ఎంజాయ్‌ చేయొచ్చు. లేదంటే షాపింగ్‌ చేయొచ్చు.

Metro-Train-Through-12-Storey-Building

ఇందుకోసం ఆ 12 అంతస్థుల భవనాల్లో ప్రయాణికులకు ఉపయోగపడే కొన్ని సౌకర్యాలను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ భవనాలు ప్రజా రవాణాకు వేదికగా కూడా ఉపయోగపడతాయని మెట్రో అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. చెన్నైలో ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే యోచలో ప్రభుత్వం ఉంది.

ముఖ్యంగా ఈ భవన నిర్మాణం భవిష్యత్తు దిశగా ఉండనుంది. దీని ఆధారంగా ఈ అపార్ట్‌మెంట్ భవనానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలను ఖాళీ ప్లాట్లుగా పరిగణిస్తున్నారు. కాగా మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్‌ 2 అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. మానవరహితంగా పరుగెత్తడం(Driverless Metro), భవనాల మధ్య ప్రయాణించడం వంటి వినూత్న ప్రయోగాలను చేపట్టనున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, January 4, 2024, 13:23 [IST]
English summary
Driverless metro trains will run through 12 storey building in chennai check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+