సరైన పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా; ఎక్కడంటే?

సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం, భారత రోడ్లపై సంచరించే వాహనాలు తప్పనిసరిగా పియుసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. భారత రోడ్లపై తిరిగే వాహనాలు ఎక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలను విడుదల చేసి, పర్యావరణానికి హాని కల్పించకుండా నియంత్రించేందుకు ఈ పియుసి సర్టిఫికెట్స్ ఉపయోగపడుతాయి.

సరైన పొల్యూన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా; ఎక్కడంటే?

ఏదైనా వాహనానికి సంబంధించిన పత్రాలలో రిజిస్ట్రేషన్ మరియు ఇన్సూరెన్స్ పత్రాలు ఎంత మఖ్యమో, దాని పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికెట్ కూడా అంతే ముఖ్యం. ట్రాఫిక్ స్టాప్స్ సమయంలో ట్రాఫిక్ అధికారులు తనిఖీ చేసే వాహన పత్రాలలో పియుసి సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి, అలా లేకపోయినట్లయితే సదరు వాహన యజమాని నిర్ణీత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

సరైన పొల్యూన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా; ఎక్కడంటే?

అయితే, చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చిక్కుల్లో పడుతుంటారు. అలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో సరైన పియుసి సర్టిఫికెట్ లేని వాహనాలపై భారీ జరిమానాలు విధిస్తున్నారు. చెల్లుబాటు అయ్యే పియుసి లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై రూ. 10,000 వరకూ జరిమానాను విధిస్తున్నారు.

సరైన పొల్యూన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా; ఎక్కడంటే?

అంతేకాదు, ఏదైనా వాహనానికి సంబంధించి చెల్లుబాటు అయ్యే పియుసి లేకపోయినట్లయితే, సదరు వాహన యజమానికి 6 నెలల జైలు శిక్ష లేదా 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయటం కూడా చేయవచ్చు.

సరైన పొల్యూన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా; ఎక్కడంటే?

ఈరోజే పియుసి సెంటర్‌లో పరీక్ష చేయించుకోండి..

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (DTC) గత ఆదివారం జారీ చేసిన పబ్లిక్ నోటీసులో, డ్రైవర్లు తమ వాహనం యొక్క PUC సర్టిఫికెట్‌ను వీలైనంత త్వరగా రెన్యువల్ చేసుకోవాలని కోరారు. నకిలీ పియుసి సర్టిఫికెట్ లేదా అసలు పియుసి సర్టిఫికెట్ లేకుండా పట్టుబడితే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీలో రవాణా శాఖ ద్వారా అనుమతి పొందిన సుమారు 900 కి పైగా కాలుష్య పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటిని నగరవ్యాప్తంగా విస్తరించిన పెట్రోల్ పంపులు మరియు వర్క్‌షాప్‌లలో ఏర్పాటు చేయబడ్డాయి.

సరైన పొల్యూన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా; ఎక్కడంటే?

చలికాలం రావడానికి ముందే జాగ్రత్తలు

దేశ రాజధాని ఢిల్లీని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో కాలుష్యం కూడా ఒకటి. మరోవైపు శీతాకాలం కూడా సమీపిస్తున్న నేపథ్యంలో, రోడ్లపై తిరిగే వాహనాలు కాలుష్య ఉద్గారాలను తక్కువగా విడుదల చేసేవిగా ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి మరియు గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ పేర్కొంది. అన్ని వాహన యజమానులు తమ వాహనాలను చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్‌తో నడపమని కోరింది.

సరైన పొల్యూన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా; ఎక్కడంటే?

ఏదైనా వాహనం, దాని సైలెన్సర్ గుండా విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి వివిధ కాలుష్య కారకాల యొక్క మోతాదును తెలుసుకునేందుకు సదరు వాహనాల యొక్క ఉద్గార ప్రమాణాలను క్రమానుగతంగా పరీక్షించబడతాయి, ఈ పరీక్షలో మంచి ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే వాటికి పియుసి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

సరైన పొల్యూన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా; ఎక్కడంటే?

ఇదివరకు చెప్పుకున్నట్లుగా, సెంట్రల్ మోటార్ వాహనాల చట్టం, 1989 ప్రకారం వాహనాలకు తప్పనిసరిగా పియుసి సర్టిఫికేట్ ఉండాలి. రైడర్ లేదా డ్రైవర్ తన వాహనం యొక్క పియూసి ఉద్గార స్థాయిని తనిఖీ చేసుకునేందుకు మరియు దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను పొందేందుకు ఎంపిక చేసిన పెట్రోల్ పంపుల వద్ద మరియు ఆటోమేటెడ్ పియుసి సెంటర్ల వద్ద ఈ సేవలను పొందవచ్చు. కొత్త సవరణల ప్రకారం, వాహనాలు ఇప్పుడు వాటి ఉద్గార పరిమితులను దాటినట్లయితే, సదరు వాహనాలకు తిరస్కరణ స్లిప్ జారీ చేయడం జరుగుతుంది.

సరైన పొల్యూన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా; ఎక్కడంటే?

అన్ని రకాల RTO సేవలను ఆన్‌లైన్ చేసిన ఢిల్లీ సర్కార్!

ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీఓల) వద్ద పెరుగుతున్న రద్దీని మరియు కోవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని, ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కొన్ని రకాల RTO సేవలను ఆన్‌లైన్ చేసింది. ఇందులో 33 సేవలు ఉన్నాయి. వీటిలో డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, చిరునామా మార్పు, కొత్త కండక్టర్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎన్ఓసి, ఇండస్ట్రియల్ డ్రైవింగ్ పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ రీప్లేస్‌మెంట్, రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ ఎన్ఓసి, గూడ్స్ వెహికల్ కోసం కొత్త పర్మిట్, పర్మిట్ రెన్యూవల్, డూప్లికేట్ పర్మిట్, సరెండర్ పర్మిట్, పర్మిట్ ట్రాన్స్‌ఫర్ మొదలైనవి ఉన్నాయి.

సరైన పొల్యూన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా; ఎక్కడంటే?

ఒకే దేశం ఒకే పియుసి సర్టిఫికెట్..

కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గడచిన జూన్ 2021లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పియుసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్ దేశవ్యాప్తంగా ఒకే తరహాలో ఉండేలా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే, కొత్తగా జారీ చేయబోయే పియుసి మరియు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జారీ అయ్యే పియుసి సర్టిఫిరెట్ రెండూ ఒకేలా ఉంటాయి. ఈ పియుసి టెస్ట్‌లో విఫలమైన వాహనాల కోసం తిరస్కరణ స్లిప్ (రిజెక్షన్ స్లిప్)ను కూడా కేటాయిస్తారు.

సరైన పొల్యూన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10,000 జరిమానా; ఎక్కడంటే?

ఏదైనా వాహనంలో నిర్ధిష్ట పరిమితికి మించి ఎక్కువ కర్బన ఉద్గారాలు వెలువడితే, అలాంటి వాహన యజమానులకు ఈ రిజెక్షన్ స్లిప్‌ని ఇస్తారు. ఈ స్లిప్ పొందిన వారు తమ వాహనాన్ని సర్వీస్ చేయించడానికి లేదా వేరే ఏదైనా పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్‌లో మరోసారి వాహనం యొక్క కాలుష్య స్థాయిలను చెక్ చేసుకునేందుకు ఈ స్లిప్‌ని ఉపయోగించవచ్చు.

Most Read Articles

English summary
Driving without valid puc may put you behind the bars up to 6 months or fine up to rs 10 000 or both
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X