ఎంచక్కా ట్రాఫిక్ పోలీసు టోపీ ధరించి, లాఠీ తీసుకుని బైకుతో ఉడాయించాడు

Written By:

మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు సభ్య సమాజాం సిగ్గుపడేలా అసజమైన పనులు చేస్తుంటారు. కానీ ఇలాంటి వాటికి ఓ లిమిట్ ఉంటుంది. అయితే కర్ణాటకలోని ఓ మందు బాబు మరి కాస్త ధైర్యం చేసి పోలీస్ బైకు మరియు టోపీ కొట్టేస్తే ఎలా ఉంటుందో అని ప్రయత్నించి చూశాడు. మొత్తానికి ఓ కిలోమీటర్ వరకు పోలీసుకు చిక్కకుండా ట్రాఫిక్ పోలీసుకు చుక్కలు చూపించాడు.

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు

కర్ణాటకలోని హసన్ నగరంలో ఫుల్‌గా మందు కొట్టి ఇంటికి పయనమైన మందు బాబుకి రోడ్డు మీద తాళాలతో సహా బైకు, ట్రాఫిక్ కానిస్టేబుల్ టోపీ మరియు లాఠీ కనిపించాయి. తాపీగా టోపీ ధరించి, లాఠీని చేతుల్లోకి తీసుకుని పోలీసు బైకును నడుపుకుంటూ వెళ్లిపోయాడు. మొదట్లో అందరూ పోలీసే అనుకున్నప్పటికీ, తీక్షణంగా చూస్తే నవ్వుకుంటూ రోడ్డు మీద అడ్డ దిడ్డంగా రైడ్ చేయడంతో బాగా తాగి ఉన్నాడు గుర్తించారు.

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు

అయితే సదరు పోలీసు కానిస్టేబుల్ ఇతగాడిని సుమారుగా కిలోమీటర్ దూరం పాటు చేధించి, చివరికి పట్టుకున్నాడు. పోలీసు చేతికి చిక్కిన తరువాత కూడా అలాగే నవ్వుతూ నానా యాగీ చేసాడు. తాగిన మైకంలో బైకు తనదే అనుకున్నాడో... లేదంటే తాగిన మైకంలో ఏం చేసినా పట్టించుకోరని తెలిసి ఇలా టోపి ధరించి మరీ పోలీసు బైకు ఎత్తుకెళ్లాడో...

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు

ఈ వ్యక్తి రోడ్డు మీద పోలీసు బైకు ఎత్తుకెళ్లడాన్ని చూసిన తోటి వాహనాదారులు సూపర్ స్టార్ రజనీ కాంత్ అంటూ ఉత్సాహపరచడంతో అతను మరింత రెచ్చిపోయాడు.

మద్యం కిక్కు తలకెక్కితే అర్థం కాకుండా ఎలా వ్యవహరిస్తారో అని చెప్పడానికి ఈ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో ద్వారా వీక్షించగలరు...

English summary
Read In Telugu: Drunk Guy Steals Police Bike In Karnataka
Story first published: Thursday, July 13, 2017, 18:17 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark