Just In
Don't Miss
- Finance
దారుణంగా పతనమైన బిట్‌కాయిన్, మార్చి నుండి ఇదే వరస్ట్
- Movies
HIT2 అప్డేట్.. ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ అవుట్!.. కొత్త హీరో ఎవరంటే?
- News
ఆ తపన ఉన్నా శరీరం సహకరించలేదు: చిన్నప్పుడు చీరాలలో: ఆ యుద్ధ విద్యలకు ప్రోత్సాహం: పవన్
- Sports
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మద్యం మత్తులో డ్రైవింగ్ వెరీ డేంజర్, కావాలంటే ఈ వీడియో చూడండి
కరోనా వైరస్ ప్రభావం వల్ల భారతదేశంలో లాక్ డౌన్ విధించబడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదటి మరియు రెండవ దశ లాక్ డౌన్ లు పూర్తి కావడంతో ఇప్పుడు మూడవ దశ లాక్ డౌన్ కొనసాగిడుతోంది. భారత ప్రభుత్వం ఈ మూడవదశ లాక్ డౌన్ 2020 మే 17 వరకు ప్రకటించింది.
![మద్యం మత్తులో పామునే కొరికిన మహానుభావుడు : [వీడియో]](/img/2020/05/drunk-mab-bites-snack5-1588771169.jpg)
ఈ మూడవ దశ లాక్ డౌన్ లో భాగంగా చాలా రాష్ట్రాలను గ్రీన్, ఆరంజ్ మరియు రెడ్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లకు కొన్ని మినహాయింపులు కూడా లభించాయి. గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో వాహన సేవలతో పాటు మద్యం దుకాణాలు కూడా ఓపెన్ చేయబడ్డాయి.
![మద్యం మత్తులో పామునే కొరికిన మహానుభావుడు : [వీడియో]](/img/2020/05/drunk-mab-bites-snack1-1588771134.jpg)
మూడవదశ లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు కారణంగా మద్యం షాపులు కూడా ఓపెన్ చేయబడ్డాయి. మద్యం దుకాణాలు ఓపెన్ చేయడంతో మందుబాబులకు పండుగ వాతావరణం మొదలైంది. చాలా రోజుల తరువాత మద్యం షాపులు ఓపెన్ చేయడంతో మందుబాబులంతా మద్యం కోసం ఎగబడ్డారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఎగబడటం చేత సామజిక దూరాన్ని కూడా మరిచిపోయి కిలోమీటర్ల కొద్దీ క్యూలు ఏర్పడ్డాయి.
MOST READ:ఎలక్ట్రిక్ మాస్ట్రో స్కూటర్ విడుదల చేయనున్న హీరో మోటోకార్ప్
![మద్యం మత్తులో పామునే కొరికిన మహానుభావుడు : [వీడియో]](/img/2020/05/drunk-mab-bites-snack4-1588771161.jpg)
మద్యం షాపులు ఓపెన్ అవ్వడంతో చాలామంది ఒళ్ళుతెలియకుండా తాగారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి బాగా తాగి తన మార్గానికి అడ్డువచ్చిందని త్రాచు పాముని కొరికిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఈ విధంగా మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల అనుకోని ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రజలు మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేయకుండా ఉండటం చాలా మంచిది.
![మద్యం మత్తులో పామునే కొరికిన మహానుభావుడు : [వీడియో]](/img/2020/05/snake-6-1588771222.jpg)
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో లాక్ డౌన్ సడలింపులో భాగంగా మద్యం షాపులు ఓపెన్ చేయబడ్డాయి. మందు షాపులు ఓపెన్ కావడంతో 38 ఏళ్ల కుమార్ అనే వ్యక్తి బాగా తాగి బైక్ నడుపుతూ వెళ్తున్నాడు. తనకు మార్గం మధ్యలో ఒక పాము కనిపించింది. తన మార్గానికి అడ్డువచ్చిందని మద్యం మత్తులో ఆ పామును పట్టుకున్నాడు.మద్యం మత్తులో ఉండటం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో అతనికే తెలియకుండా పోయింది.
MOST READ:లాక్‌డౌన్‌లో చిన్న బిడ్డ పుట్టిన రోజుకి పోలీస్ ఎస్కార్ట్, ఎక్కడో తెలుసా ?
![మద్యం మత్తులో పామునే కొరికిన మహానుభావుడు : [వీడియో]](/img/2020/05/drunk-mab-bites-snack6-1588771177.jpg)
మద్యం మత్తులో పామును పట్టుకుని కొరకసాగాడు. తన మార్గానికి అడ్డువచ్చిందని పామును కొరకడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇదే సమయంలో పాము కరవడం ప్రారంభించినప్పుడు ఆ పాము ఆ వ్యక్తి మెడలో ఉంది. ఆ పామును మేడలో చుట్టుకునే మళ్ళీ అతని ప్రయాణం కొనసాగించాడు.
పాములు చాలా విష పూరితాలు కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఆ వ్యక్తి ప్రాణాలకు కూడా ప్రమాదం సంభవించవచ్చు. కాబట్టి ఇటువంటి విషపూరిత సరీసృపాలు నుంచి దూరంగా ఉండాలి. అంతే కాకుండా ప్రజలు వీలైనంత వరకు మందు తాగినప్పుడు వాహనాలు డ్రైవ్ చేయకూడదు.
ఈ విధంగా జరిగిన కొంత సమయం తరువాత అతను రహదారి మధ్యలో ఆగి, చుట్టుపక్కల ఉన్న ప్రజలు అతని వైపు చూస్తుండగా పామును మళ్ళీ కొరకడం ప్రారంభించాడు. కొందరు ఈ సంఘటనను తమ మొబైల్ తో ఫోటోలు తీయడం ప్రారంభించారు.ఏది ఏమైనా ఇటువంటి చర్యలను ప్రోత్సహించకూడదు, ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశాలు ఉంటాయి.
MOST READ:గుడ్ న్యూస్.. కరోనా నుంచి కాపాడే రోబో వచ్చేసింది
![మద్యం మత్తులో పామునే కొరికిన మహానుభావుడు : [వీడియో]](/img/2020/05/drunk-mab-bites-snack2-1588771144.jpg)
ఈ సంఘటన జరిగిన 30 నిమిషాల తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ పాము చనిపోయింది. కుమార్ అనే వ్యక్తికి ఆ పాము విషపూరితమైనది అని తెలియదు. కానీ అతనికి ఏమి ప్రమాదం జరగదని నమ్మకంగా ఉన్నాడు. పాము తనకి ఇబ్బందిగా అనిపించడంతో కోపంతో కొరికానని అతడు చెప్పాడు. ఈ విధంగా జరిగిన తరువాత ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లలేదని కూడా అతడు తెలిపాడు.మద్యం మత్తులో ఇలా చేసినా ఈ వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగి ఉంటె అతని ప్రాణాలను కోల్పోవలసి ఉండేది. కాబట్టి ప్రజలు ఇటువంటి సంఘటనలను పూర్తిగా ఉల్లంఘించాలి.