Just In
Don't Miss
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Movies
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మద్యం మత్తులో మహిళపై కారు నడిపిన పోలీస్ ఇన్స్పెక్టర్, తర్వాత ఏం జరిగిందంటే?
ప్రపంచంలో ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న దేశాలలో భారతదేశం ఒకటి. ట్రాఫిక్ నిబంధనలను ప్రజలు పాటించేలా చేయడానికి జరిమానాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 1 నుండి కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలు చేసింది.

ఈ చట్టం ప్రకారం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లకు రూ. 10,000 జరిమానా విధించబడుతుంది. అంతే కాకుండా తాగిన డ్రైవర్లకు పోలీసులు కఠినమైన శిక్షలు కూడా విధిస్తున్నారు.

ఈ తరహాలోనే ఒక సంఘటన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఖాజీపూర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న చిల్లా గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు కారకుడు 56 ఏళ్ల సబ్ ఇన్స్పెక్టర్ అయిన యోగేంద్రగా గుర్తించబడ్డాడు, ఈ సంఘటన సమయంలో మద్యం మత్తులో ఉన్నాడు.
MOST READ:పరుగులుపెడుతున్న మహీంద్రా బొలెరో అమ్మకాలు, కారణం ఏంటో తెలుసా !

ఒక చట్టబద్దమైన పోలీసు అధికారి మద్యం మత్తులో ఒక మహిళపై కారును నడిపాడు. ఈ సంఘటన మొత్తం సిసిటివిలో రికార్డ్ చేయబడింది. ఈ వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీరు ఒక మహిళ రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. మహిళను ఢీ కొన్న వాహనం అక్కడే ఆగుతుంది.

పోలీస్ కారు ఢీ కొన్న వెంటనే ఆ మహిళ రోడ్డు మీద పడిపోతుంది. అక్కడ ఉన్న వారు ఆమెను రక్షించడానికి పరుగెత్తుతారు. కానీ కారు ఆ మహిళా మీదుగానే ముందుకు వెళ్తుంది. కారు డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు వెళ్తాడు. దీంతో మహిళ కొంత దూరం ముందుకు కదులుతుంది.
MOST READ:మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే
అక్కడికక్కడే ఉన్నవారు కారు డ్రైవర్‌ను పట్టుకుంటున్నారు. గాయపడిన మహిళ చికిత్స కోసం ఆసుపత్రి చేర్చారు. ఈ మహిళ ప్రస్తుతం ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ ఘటనకు కారకుడైన పోలీస్ అధికారిని సంబంధించి అధికారులు అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అని తేలింది. తాగి కారు నడుపుతున్న నిందితుల విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. సాధారణంగా దేశ రాజధాని నగరం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘింస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఒక బాధ్యతాయుతమైన అధికారంలో ఉండే పోలీసులు ఈ విధంగా చేయడం మరింత ప్రమాదాలకు గురిచేస్తుంది.
MOST READ:బైక్స్ కొనాలనుకునే వారికి కొత్త ఫైనాన్స్ స్కీమ్ : హోండా