తప్ప తాగి పోలీసులపై చేయి చేసుకున్న మహిళ.. రోడ్డుపై పూనకాలతో హల్చల్, వైరల్ గా మారిన వీడియో

దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిషిద్ధం. మద్యం తాగి వాహనాలు నడిపితే ట్రాఫిక్ పోలీసులు జరిమానా లేదా శిక్ష విధించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఓ మహిళ మద్యం తాగి వాహనం నడపడమే కాకుండా ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మద్యం సేవించడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే కొందరు మద్యం తాగిన అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రం కిక్కు ఎక్కువై రోడ్డు అని కూడా చూడకుండా నానా రభస చేస్తూ అందరికీ ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి.

Drunk-Woman

గుజరాత్‌లో ఓ మహిళ.. మద్యం తాగి కారు నడపడమే కాకుండా.. పోలీసులు ఆపినందుకు పబ్లిక్‌లో రోడ్డుపై సీన్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా పోలీసులతో గొడవకు దిగింది. ఈ వీడియోను కొందరు X (ట్విట్టర్లో) లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

గుజరాత్‌లో ఇటీవల ప్రభుత్వం మద్యపాన నిషేధం విధించిన సంగతి తెలిసింది. అయితే ఈ నిబంధనలను తుంగలో తొక్కి వడోదర రోడ్లపై మహిళ హంగామా సృష్టించింది. పోలీసులపై మహిళ గట్టిగా అరవడం, వారిని దూషించడం, పోలీసులపై చేయి చేసుకోవడం సదరు వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

Drunk-Woman

ఇటీవల గుజరాత్‌లో వడోదరలోని గోత్రి గోకుల్ నగర్ సమీపంలో పోలీసులు రొటీన్ చెకింగ్ చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై ఘోర ప్రమాదంలో చాలా మంది చనిపోవడంతో.. ప్రభుత్వం ఇటీవల ఈ సాధారణ తనిఖీలు ప్రారంభించారు. అందులో భాగంగా పోలీసులు ఓ మహిళ కారును ఆపారు.

బ్లాక్ కలర్ కియా సోనెట్ సబ్-కాంపాక్ట్(Kia Sonet SUV) ఎస్‌యూవీని నడుపుతున్న మహిళ విపరీతంగా మద్యం సేవించి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆమెను కారులోంచి దిగాల్సిందిగా కోరారు. అయితే మహిళ అందుకు నిరాకరించింది. అంతే కాకుండా రోడ్డుపై ఉన్న పోలీసు అధికారులను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసింది.

Drunk-Woman

అది గమనించిన ఓ మహిళా పోలీసు అధికారి ఆమె చేతిలో నుంచి ఫోన్ లాక్కుకున్నారు. దీంతో మద్యం మత్తులో ఉన్న మహిళ రోడ్డుపై కేకలు వేయడం ప్రారంభించింది. మహిళా పోలీసు అధికారి వద్ద నుంచి తన ఫోన్ తీసుకోవడానికి ఆమెతో వాగ్వాదానికి దిగింది.

ఇంతలో ఆ మహిళా అధికారి ఆ ఫోన్‌ను అక్కడే మగ పోలీసు అధికారికి అందజేశారు. దీంతో ఆ మహిళ ఆ అధికారిని కూడా దుర్భాషలాడటం ప్రారంభించింది. అంతే కాకుండా తన ఫోన్ తీసుకోవడానికి యత్నించింది. అధికారులతో గొడవపడి చివరకు ఆ మహిళ తన ఫోన్‌ను తిరిగి తీసుకుంది.

అనంతరం సదరు మహిళ అంతటితో ఆగకుండా డ్యూటీలో ఉన్న అధికారులను అభ్యంతరకరమైన పదజాలంతో దుర్భాషలాడటం ప్రారంభించింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. దీంతో రాత్రి రోడ్డుపై మహిళ హల్ చల్ చేస్తుండటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆమెను స్టేషన్‌కు తరలించేందుకు ఇద్దరు మహిళా అధికారులు పోలీసు వ్యానులో కూర్చోబెట్టారు.

అయినా ఆ మహిళ ఆగకుండా పోలీసులను దుర్భాషలాడుతూనే ఉంది. దీంతో సహనం నశించిన మహిళా అధికారి ఒకరు ఆమెను కొట్టారు. దానితో కోపంతో ఊగిపోయిన ఆ మహిళ.. పోలీసులు అని కూడా చూడకుండా మరో మహిళా పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, August 29, 2023, 14:58 [IST]
English summary
Drunk woman slapping and abusing police officers video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+