దుబాయ్ ఎయిర్‌షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌!

దుబాయ్‌ ఎయిర్‌షో 2023 (Dubai Air show 2023) కోసం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ UAEలో కనువిందు చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారుచేసిన (HAL) ఈ లైట్‌ కాంపాక్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ 2022లో నిర్వహించిన ఎయిర్‌షోలోనూ పాల్గొంది. ఈ సంవత్సరం కూడా ఇవే ఫైటర్‌ జెట్‌లు యూఏఈ వెళ్లాయి. అయితే ఈ ఏడాది సరికొత్త హార్డ్‌వేర్‌ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది.

తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో (Tejas LCA) ఇటీవల చేసిన హార్డ్‌వేర్‌ అప్‌డేట్‌- లాంగ్‌ రేంజ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ మ్యూనిషన్‌ను కలిగి ఉంది. ఈ హార్డ్‌వేర్‌ను యూఏఈలోని అల్‌ తారిక్‌ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఫలితంగా తేజస్‌ పరిధి 45km నుంచి 120km పెంచింది. దీంతో ఈ తరహా యుద్ధ విమానాలు ఎక్కువ లక్ష్యాలను సురక్షితంగా చేరుకొనేలా చేస్తాయి.

Dubai air show 2023

తేజస్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే చిన్న మరియు తేలికపాటి సూపర్‌సోనిక్‌ యుద్ధ విమానంగా ఉంది. భారత ప్రభుత్వానికి చెందిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ మరియు యూఏఈ ప్రభుత్వానికి చెందిన ఎడ్జ్‌, దక్షిణాఫ్రికాకు చెందిన డేనిల్‌ డైనమిక్స్‌ జాయింట్‌ వెంచర్‌గా ఉన్న అల్ తారిక్‌ సంస్థ మధ్య ఈ సంవత్సరం ప్రారంభంలో ఒప్పందం కుదిరింది.

డెనెల్ డైనమిక్స్‌ ప్రకారం.. అల్‌ తారిక్‌ మ్యునిషన్స్‌ వ్యవస్థ అన్ని వాతావరణ పరిస్థితులు, రాత్రి-పగలు ఆపరేషన్‌ సామర్థ్యాలను అందిస్తుంది. GPS/INS గైడెన్స్‌ లేదా ఇమేజింగ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ లేదా సెమీ ఆటోమేటిక్‌ లేజర్‌ను కలిగి ఉంటుంది. అటానమస్‌ టార్గెట్‌ అక్వైజేషన్‌తోపాటు 100 కి.మీ కంటే ఎక్కువ స్టాండ్‌ ఆఫ్‌ పరిధిని కలిగి ఉంటుంది.

Dubai air show 2023 news

అల్‌ తారిక్‌ వ్యవస్థ అనేక మిషన్లు మరియు లక్ష్యాల కోసం ఉపయోగించబడుతుంది. సైన్యం సహా ఇతర కీలక దళాలకు వాయుమార్గం ద్వారా సాయం చేసేందుకు మరియు లోతైన యుద్ధభూముల్లో సాయం చేస్తుంది. మరియు లక్షిత దాడులు చేయడం సహా మరియు వంతెనలు, పారిశ్రామిక ప్రాంతాలు, మౌలిక సదుపాయాల లక్ష్యాలపై దాడి చేయవచ్చు.

వాయు స్థావరాలపై దాడులు చేసేందుకు, గగనతలం నుంచి మిసైల్‌ను లాంచ్‌ చేసేందుకు, రన్‌వేలపై ఉన్న శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌ల దాడులకు ఉపయోగపడుతుంది. దుబాయ్‌ ఎయిర్‌షోలో గత సంవత్సరం పాల్గొన్న తేజస్‌ల కంటే ఈ ఏడాది ఉన్న తేలికపాటి ఫైటర్‌జెట్‌లు మరింత అధునాతనమైనవి, శక్తివంతమైనవి. అయితే కేవలం ఎయిర్‌షో కోసమే తేజస్‌లో అమర్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మోహరించలేదు.

Tejas fighter jet

ఆ దుబాయ్‌ ఎయిర్‌షోలో కోట్ల రూపాయల విలువైన అనేక మల్టీ ఎయిర్‌లైన్‌ అగ్రిమెంట్స్‌ కోసం ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని ఆకర్షించేందుకు మరియు ప్రపంచానికి వీటి సత్తా చూపించేందుకు ఈ కార్యక్రమంలో అనేక సాహస కార్యక్రమాలను నిర్వహించారు. భారత వైమానికి దళం ఇందులో పాల్గొంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, November 18, 2023, 11:16 [IST]
English summary
Dubai air show iaf tejas lca participated in adventure show
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+