సూపర్‌కార్లను టాక్సీలుగా మార్చిన దుబాయ్ వ్యాపారి!

By Ravi

మన దేశంలో టాక్సీలు అంటే టక్కున అంబాసిడర్, పద్మిని, ఇండికా వంటి కార్లు గుర్తుకు వస్తాయి. కానీ, దుబాయ్‌లో మాత్రం టాక్సీ అనగానే ఫెరారీ, లాంబోర్గినీ, రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి కార్లు గుర్తుకు రానున్నాయి. ప్రపంచంలో కెల్లా అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన దుబాయ్‌లో ఓ వ్యాపారి ప్రపంచంలో కెల్లా అత్యంత అరుదుగా లభించే సూపర్, లగ్జరీ కార్లతో టాక్సీ సేవలు ప్రారంభించాడు.

పర్యాటకులను అత్యధికంగా ఆకట్టుకునే దేశాల్లో దుబాయ్ కూడా ఒకటి. అలాంటి పర్యాటక ఆధారిత మరియు ధనిక దేశంలోని వారికి కాస్తంత సూపర్ టాక్సీ ఫీల్‌ను కలిగించేందుకు రోల్స్ రాయిస్, బెంట్లీ, ఫెరారీ, లాంబోర్గినీ, మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి క్లాస్ లీమోజైన్ వంటి పలు సూపర్‌కార్లు మరియు ఆల్ట్రా లగ్జరీ కార్లను సూపర్‌టాక్సీలుగా ఆఫర్ చేయనున్నారు.

super car taxi dubai

నవంబర్ 19 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్న దుబాయ్ మోటార్ ఫెస్టివల్‌లో కూడా ఈ సూపర్‌టాక్సీలను ప్రదర్శనకు ఉంచనున్నారు. వారాంతపు రోజుల్లో ఈ సూపర్ టాక్సీ‌‌సేవలను ప్రారంభించనున్నారు. టూరిస్టులు ఎక్కువగా వచ్చే షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రదేశాల్లో ఈ సూపర్‌టాక్సీలను నియమించనున్నారు.

ఈ సూపర్‌టాక్సీలలో కస్టమర్లు రౌండ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, ఒక మార్గానికి మాత్రమే చార్జ్ చేస్తారు, రెండవ మార్గాన్ని ఉచితంగా ఆఫర్ చేస్తారు. దేశంలోని ఏ ఇతర టాక్సీ కంపెనీ ఆఫర్ చేయని రీతిలో ఈ సూపర్‌కార్ టాక్సీలు టూరిస్టులకు, దుబాయ్ వాసులకు ఓ అద్భుతమైన, అందమైన ప్రయాణ అనుభూతిని మిగుల్చుతాయని దుబాయ్ మోటార్ ఫెస్టివల్ డైరెక్టర్ జిన్ టావెన్ ఓంగ్ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Saturday, November 8, 2014, 17:32 [IST]
English summary
Dubai has been in the news for their obsession with supercars. The latest sensation, the supercars that operate as taxis, will offer free rides for tourists and residents. The supercar taxi fleet has cars like Rolls Royce, Bentley, Ferrari, Lamborghini and even an AMG G Class Limo!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+