దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన వేగవంతమైన జర్మన్ లగ్జరీ కార్స్: పూర్తి వివరాలు

సాధారణంగా పోలీస్ ఫోర్స్ లో ఉపయోగించే వాహనాలు చాలా వరకు మహీంద్రా, ఫోర్స్ వంటి వాహనాలను వినియోగిస్తారు. ఏ విషయం దాదాపు అందరికి తెలుసు, అయితే కొన్ని దేశాల్లో లగ్జరీ కార్లను తమ పోలీస్ ఫోర్స్ లో ఉపయోగిస్తారు. ఇటువంటి లగ్జరీ కార్లను ఉపయోగించే దేశాల్లో దుబాయ్ ఒకటి.

దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన వేగవంతమైన జర్మన్ లగ్జరీ కార్స్: పూర్తి వివరాలు

దుబాయ్ పోలీస్ ఫోర్స్ లో ఖరీదైన వాహనాలను వినియోగిస్తారు. ఇందులో భాగంగానే ఇటీవల క్రైమ్ ఫైటింగ్ ఫ్లీట్‌లో రెండు ఆధునిక ఆడి ఆర్8 కార్లు చేరాయి. ఇకపైన వీరు తమ ఫోర్స్ లో ఈ ఖరీదైన లగ్జరీ కార్లను వినియోగించనున్నారు. జర్మన్ లగ్జరీ బ్రాండ్ యొక్క ఈ పర్ఫామెన్స్ వాహనాలను ఇటీవల దుబాయ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శన తర్వాత దుబాయ్ పోలీసులు ఈ రెండు ఆడి ఆర్8 కూపే పర్ఫామెన్స్ కార్లను తమ ఫ్లీట్‌లో చేర్చారు.

దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన వేగవంతమైన జర్మన్ లగ్జరీ కార్స్: పూర్తి వివరాలు

జర్మన్ కంపెనీకి చెందిన ఈ కొత్త ఆడి ఆర్8 కూపే పర్ఫానెన్స్ కార్ల విషయానికి వస్తే, ఇందులో వి10, 5.2-లీటర్ ఇంజన్‌ని ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 540 బిహెచ్‌పి పవర్‌ అందిస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 320 కిమీ వరకు ఉంటుంది. అంతే కాకుండా ఆడి ఆర్8 కూపే కేవలం 3.7 సెకన్లలో గంటకు 100 కిమీ వరకు వేగవంతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన వేగవంతమైన జర్మన్ లగ్జరీ కార్స్: పూర్తి వివరాలు

అత్యధిక వేగంతో ప్రయాణించే ఈ కార్లను పోలీస్ ఫోర్స్ లో చేర్చడం వల్ల వేగంగా తప్పించుకునే దొంగలను కూడా సులభంగా పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కావున నేరస్థులను సకాలంలో పెట్టుకోవచ్చు. కొత్త ఆడి ఆర్8 లగ్జరీ కార్లు అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన వేగవంతమైన జర్మన్ లగ్జరీ కార్స్: పూర్తి వివరాలు

ఈ పోలీసు కారును ఉపయోగించడం వల్ల ఎవరైనా వేగంగా కారు నడపడం ద్వారా పోలీసుల నుండి తప్పించుకునే అవకాశాలు తగ్గుతాయి. దుబాయ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో ఫ్రీ-బ్రీత్ వి10 ఇంజన్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంది. ఇందులోనుంచి వచ్చే అసమానమైన ధ్వని, త్వరిత శక్తి ప్రతిస్పందన మరియు టర్నింగ్ సమయంలో కూడా అత్యుత్తమ పనితీరు మొత్తం చాలా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.

దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన వేగవంతమైన జర్మన్ లగ్జరీ కార్స్: పూర్తి వివరాలు

దుబాయ్ పోలీసుల వద్ద ఇప్పుడు ఆడి ఆర్8 కార్లతో కలిపి మొత్తం 33 సూపర్ కార్లు ఉన్నాయి. ఆడి కంపెనీ నుంచి ఇటీవల వచ్చిన ఈ కారు అత్యంత వేగవంతమైన కారు. కానీ దుబాయ్ పోలీస్ ఫ్లీట్‌లో ఇది అత్యంత వేగవంతమైన కారు మాత్రం కాదు. ఎందుకంటే దుబాయ్ పోలీసుల వద్ద ఇప్పటికే బుగట్టి వేరాన్ మరియు ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ వంటి అనేక విలాసవంతమైన మరియు సూపర్ ఫాస్ట్ కార్లు ఉన్నాయి.

దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన వేగవంతమైన జర్మన్ లగ్జరీ కార్స్: పూర్తి వివరాలు

ఇవి మాత్రమే కాకుండా దుబాయ్ పోలీస్ ఫోర్స్ లో అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన పోర్షే, ఫెరారీ, బెంట్లీ మరియు మెక్‌లారెన్ మోడల్‌లు కూడా ఉన్నాయి. ఈ కార్లన్నీ దుబాయ్ పోలీసులకు నేరస్థులను పట్టుకోవడంలో బాగా సహాయపడతాయి. దుబాయ్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జమాల్ సలేమ్ అల్ జల్లాఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన వేగవంతమైన జర్మన్ లగ్జరీ కార్స్: పూర్తి వివరాలు

దుబాయ్ ఎమిరేట్ యొక్క పటిష్టమైన భద్రతను ప్రోత్సహించడానికి మరియు ప్రపంచంలోని సురక్షితమైన గమ్యస్థానాలలో ఒకటిగా దాని హోదాను కొనసాగించడానికి పోలీసులు చాలా ఆసక్తిగా ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించడంలో దుబాయ్ పోలీసులు ప్రసిద్ది చెందారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. పోలీస్ ఫోర్స్ నేరస్తులను పెట్టుకోవడంలో మరియు శిక్షించడంలో కూడా చాలా కఠినంగా ఉంటారు. కావున నేరస్థులను సకాలంలో పట్టుకోవడానికి ఈ ఖరీదైన కార్లు చాలా అనుకూలంగా ఉంటాయి.

దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన వేగవంతమైన జర్మన్ లగ్జరీ కార్స్: పూర్తి వివరాలు

దుబాయ్ పోలీస్ ఫోర్స్ స్టైలిష్ మరియు శక్తివంతమైన కార్లను ఉపయోగించి నేరాలను పరిశోధించే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతే కాకుండా పోలీసు శాఖ కూడా వీధుల్లో గస్తీని ఏరియల్ మార్గాల ద్వారా పరిశీలిస్తోంది, తద్వారా రహదారి భద్రతను కూడా మెరుగుపరుస్తుంది. ఇవన్నీ అక్కడి ప్రజల భద్రతను నిర్థారిస్తాయి.

దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన వేగవంతమైన జర్మన్ లగ్జరీ కార్స్: పూర్తి వివరాలు

ప్రస్తుతం ప్రపంచమే అభివృద్ధివైపు పరుగులు తీస్తున్న సమయంలో నేరస్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనిని నివారించడానికి ప్రతిదేశం కూడా అనేక కఠినమైన చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రస్తుతం పోలీస్ ఫోర్స్ లో బైకులు మరియు కార్లకంటే కూడా డ్రోన్లు ఎక్కువగా ఉపయోగపడతాయి. కావున ఇప్పుడు చాలా దేశాల్లో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇవి రహస్య గుడారాలను మరియు రహస్యంగా తప్పించుకునే దొంగలను పసిగట్టడంలో పోలీసులకు సహాయపడతాయి.

దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన వేగవంతమైన జర్మన్ లగ్జరీ కార్స్: పూర్తి వివరాలు

మనదేశంలోని పోలీస్ ఫోర్స్ లో ఎక్కువగా టాటా మోటార్స్ యొక్క కార్లు, ఫోర్స్ మోటార్స్ కార్లు మరియు ఇన్నోవా కార్లు ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో రోడ్డు మార్గాల్లో ప్రయాణించడానికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి, కావున మనదేశంలో ఇలాటి వాహనాలను ఎక్కువ సంఖ్యలో వినియోగిస్తుంటారు.

Most Read Articles

English summary
Dubai police added two new audi r8 coupe to its fleet details
Story first published: Thursday, November 25, 2021, 15:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X