దుబాయ్ పోలీసుల సూపర్ కార్ల జాబితాలోకి బుగాటి వేరాన్
దుబాయ్ పోలీసుల లగ్జరీ, సూపర్ కార్ కలెక్షన్‌కు బ్రేకులు లేకుండా పోతున్నాయి. ఫెరారీ, బెంట్లీ, లాంబోర్గినీ, బిఎమ్‌డబ్ల్యూ మరియు మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ లగ్జరీ కార్లను, సూపర్ కార్లను కలిగి ఉన్న దుబాయ్ పోలీసులు తాజా ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే బుగాటి వేరాన్ కారును తమ అధికారి వాహనంగా నియమించుకొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు దుబాయ్ పోలీసుల లగ్జరీ కార్ కలెక్షన్ పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయింది.
దుబాయ్ పోలీసుల వద్ద ఇప్పటికే ఫెరారీ ఎఫ్ఎఫ్, లాంబోర్గినీ అవెంటేడర్, ఆస్టన్ మార్టిన్ వన్-77 వంటి ప్రముఖ కార్లు ఉన్నాయి. భారత మార్కెట్లో బుగాటి వేరాన్ సూపర్ కారు ధర సుమారు రూ.15 కోట్లకు పైమాటే. బుగాటి వేరాన్ సూపర్ కారులో 8.0 లీటర్ డబ్ల్యూ16 ఇంజన్‌ను అమర్చారు. ఇది కేవలం 2.6 సెకండ్ల సమయంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని, 7.1 సెకండ్లలో 0 నుంచి 200 కిలోమీటర్ల వేగాన్ని మరియు 16 సెకండ్లలో 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 429 కిలోమీటర్లు. మరి ఈ బుగాటి వేరాన్ అందాలను చూసొద్దాం రండి.

బుగాటి వేరాన్

బుగాటి వేరాన్

బుగాటి వేరాన్

బుగాటి వేరాన్

బుగాటి వేరాన్



Click it and Unblock the Notifications








